న్యూ బోయిగూడలో బుల్డోజర్ల గర్జన!
సామాన్యుల దారిని మూసేసి మేడ కడితే ఊరుకుంటామా?
సికింద్రాబాద్:
అధికారం అండ ఉందనో, అధికారుల అలుసు ఉందనో సామాన్యుల దారిని మూసేసి అక్రమంగా మేడలు కడతామంటే కుదరదని హైడ్రా నిరూపించింది. బన్సీలాల్‌పేట పరిధిలోని న్యూ బోయిగూడలో బుధవారం హైడ్రా బుల్డోజర్లు గర్జించాయి.
అసలేం జరిగిందంటే:
న్యూ బోయిగూడలో సుమారు 20 అడుగుల సిమెంట్ రోడ్డు ఉంది. అయితే, స్థానికంగా ఉండే ఓ వ్యక్తి కక్కుర్తితో ఆ రోడ్డులో సుమారు 50 గజాల మేర దారిని అడ్డుకుని పక్కా ప్లాన్‌తో షాపు, పైన ఇల్లు నిర్మించడం మొదలుపెట్టాడు. కాలనీవాసులు జీహెచ్‌ఎంసీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదు. విసిగిపోయిన బాధితులు 'హైడ్రా'ను ఆశ్రయించారు.
రంగంలోకి దిగిన హైడ్రా టీమ్.. ఆ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని, పైగా అది పక్కాగా ప్రజా రహదారిని ఆక్రమించిందని తేల్చింది. ఇంకేముంది.. బుధవారం ఉదయాన్నే బుల్డోజర్లతో వెళ్లిన సిబ్బంది, ఆ అక్రమ కట్టడాన్ని క్షణాల్లో నేలమట్టం చేశారు. తమ దారి తమకు దక్కడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు.
About The Author
10 Apr 2026
