తహసీల్దార్ కు వినతిపత్రం అందజేసిన టీజీఈ జేఏసీ నాయకులు

తహసీల్దార్ కు వినతిపత్రం అందజేసిన టీజీఈ జేఏసీ నాయకులు

ఎల్బీనగర్:

తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను, న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ, శుక్రవారం టీజీఈ జేఏసీ నాయకులు, ఉద్యోగులు, పెన్షనర్లు శుక్రవారం సరూర్నగర్ మండల తహసిల్దార్ పి. వేణుగోపాల్ కు వారి ప్రధాన డిమాండ్లతో జూన్ 2 వ తేది నాటికి పీఆర్సీ అమలు పరచాలని, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలనీ, ప్రకటిత ఎంప్లాయిస్ హెల్త్ స్కీం తక్షణమే అమలులోకి తెస్తూ అందరికీ హెల్త్ కార్డ్స్ జారీ చేయాలనీ, సీపీఎస్ రద్దు చేసి ఒపీఎస్ విధానం పునరుద్దరణ చేయాలనీ, 61 సంవత్సరాలు నిండిన విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సాధారణ బదిలీలు చేపట్టాలని వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమంలో జీ. డేవిడ్, గోవర్ధన్ యాదవ్, ఆర్ఐ జ్యోతి జీవన్ జ్యోతి, వి. ఈశ్వర్, బి. ప్రభాకర్, ఎస్. ప్రవీణ్,టీ. ప్రవర్ధన్ రెడ్డి రషీద్, అఖిల, వైఎస్ కల్పన, సరళ, రాజు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts