అక్రమ షెడ్లను కూల్చివేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు

అక్రమ షెడ్లను కూల్చివేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు

ఎల్బీనగర్:

రోడ్డుకు ఇరువైపులా షెడ్లు నిర్మించి చిరు వ్యాపారాలు చేస్తుండడం వల్ల తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అధికారులకు కాలనీవాసులు, వాహనదారుల నుండి ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు అందడంతో సోమవారం టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీస్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కొత్తపేట మోహన్ నగర్ నుండి ఓమ్ని ఆసుపత్రి సర్వీసు రోడ్డు, మహాలక్ష్మి థియేటర్ రోడ్డు పక్కన అక్రమంగా నిర్మించిన షెడ్లను, కొత్తపేట రైతుబజార్ వద్ద రోడ్లపై అక్రమంగా వ్యాపారాలు చేస్తున్న షెడ్లను చైతన్యపురి పోలీసులు,ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో సరూర్నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి అర్చన నేతృత్వంలో అక్రమ షెడ్లను కూల్చివేశారు. రోడ్డు పక్కన అక్రమంగా నిర్మించిన షెడ్లను బుల్డోజర్ తో కూల్చివేసి వాటిని జిహెచ్ఎంసి అధికారులు తీసుకువెళ్లారు. కాగా మా జీవనోపాధిపై దెబ్బతీస్తున్నారని చిరు వ్యాపారులు అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే మాపై అధికారులు ప్రతాపం చూపుతున్నారని చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు చిరు వ్యాపారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది నెలసరి మామూళ్లకు అలవాటు పడి చిరు వ్యాపారులను వదిలేయడం వల్లే రోజురోజుకు సర్వీస్ రోడ్డు పక్కన వ్యాపార కేంద్రాలు పెరిగిపోతున్నాయని పరిసర కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఒక్కరోజు వాటిని తొలగించి అధికారులు చేతులు దులుపుకుంటారని మరుసటి రోజు నుంచి చిరు వ్యాపారుల తంతు యథావిధిగా కొనసాగుతుందని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సర్వీసు రోడ్డును ఆక్రమించకుండా అధికారులు శాశ్వత చర్యలు చేపట్టాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో
చైతన్యపురి సీఐ సైదులు,స్టేషన్ సిబ్బంది ట్రాఫిక్ సీఐ మల్లారెడ్డి వారి సిబ్బంది, ఏఎస్ఐ శేఖర్ న్యాక్ ఇంజనీర్ సురేష్ నాయక్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది సాయి, రాము, అబ్బాస్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-03-02 at 20.10.41

About The Author