పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
23 మందికి రూ. 17.20 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ: మధుయాష్కీ గౌడ్
ఎల్బీనగర్:
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన విధానమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా ఎంతోమంది నిరుపేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందని, ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందే సామాన్యులకు ఇది వరమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం హయత్ నగర్ టీ నగర్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 23 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 17,20,000 విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా..
వివిధ అనారోగ్య సమస్యలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొంది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పలువురు బాధితులు మధుయాష్కీని సంప్రదించగా, ఆయన సానుకూలంగా స్పందించి వారికి సీఎంఆర్‌ఎఫ్ నిధులు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉంటుందని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా పని చేస్తోందని వివరించారు.
మొత్తం 23 మందికి మంజూరైన సహాయంలో ప్రధానంగా వనస్థలిపురానికి చెందిన నూకల కృష్ణమోహన్‌కు రూ. 5 లక్షల ఎల్ఓసీ (LOC) అందజేశారు.
మిగిలిన లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి:
రూ. 60,000 పొందిన వారు: బోడ నరసింహ, గుర్రం భాస్కర్, ఈపూరి సత్యనారాయణ, పిట్టల అర్జున్ ముదిరాజ్, దొడ్డి భాగ్యలత, గుడాల నర్సింగ్ రావు, ఉగాది మల్లేష్, ఉగాది శివుడు, సుజాత పట్నాయక్, వేముల నర్సమ్మ, వాడపల్లి రాజు, షేక్ హలీమా, తోట చిన్నయ్య, మేడిశెట్టి వెంకయ్య.
ఇతర లబ్ధిదారులు: రామాచారి (రూ. 50,000), కొత్త కుర్మ అభిలాష్ (రూ. 46,000), కొప్పుల ప్రేమమ్మ (రూ. 27,000), మారగోని కుమార్ గౌడ్ (రూ. 56,500), మాదాసు రాము (రూ. 50,000), మణెమ్మ (రూ. 49,000), తాళ్ల నర్సింగ్ గౌడ్ (రూ. 40,500), చక్రపాణి (రూ. 50,000).
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాంగ్రెస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు మకుటం సదాశివుడు, చెన్నగోని రవీందర్ గౌడ్, బుడ్డ సత్యనారాయణ, కుట్ల నర్సింహ యాదవ్, లింగాల కిషోర్ గౌడ్ పాల్గొన్నారు. అలాగే మహిళా కాంగ్రెస్ ఎల్బీనగర్ అధ్యక్షురాలు స్వర్ణ మాధవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నేలపాటి రామారావు, గణేష్ నాయక్, దేవాలయ కమిటీల డైరెక్టర్లు కంచర్ల కవిత, భవాని శంకర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ మరియు నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, షరీఫ్, వినయ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
