గడ్డిఅన్నారం డివిజన్‌లో బీజేపీలో చేరికల సందడి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలో ఘన కార్యక్రమం

గడ్డిఅన్నారం డివిజన్‌లో బీజేపీలో చేరికల సందడి

ఎల్బీనగర్:

గడ్డిఅన్నారం డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ చేరికల కార్యక్రమం అత్యంత విజయవంతంగా జరిగింది. డివిజన్ అధ్యక్షులు దాసరి జయప్రకాశ్ నాయకత్వంలో డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ బస్ స్టాప్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శరామచంద్ర రావుని గడ్డిఅన్నారం డివిజన్ మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు ఘనంగా స్వాగతం పలికి, మర్యాదపూర్వకంగా కండువా కప్పి సన్మానించారు. అనంతరం వారి సమక్షంలో టీమ్ వివేకానంద, షార్య ఉత్సవ మండల్ సభ్యులు, వివిధ కాలనీలకు చెందిన యువత, మహిళలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు.ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ.. బీజేపీ సిద్ధాంతాలు మరియు అభివృద్ధి లక్ష్యాలు ప్రజలలో విశ్వాసాన్ని పెంచుతున్నాయని, ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడం శుభపరిణామమని తెలిపారు. గడ్డిఅన్నారం ప్రాంతంలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి కృషి, ప్రజలతో ఉన్న బలమైన అనుబంధం వల్లే ఈ భారీ చేరికలు సాధ్యమయ్యాయని ప్రశంసించారు. అదేవిధంగా గడ్డిఅన్నారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కీర్తిశేషులు బద్దం సుభాష్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ, వారు చూపిన మార్గంలో పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గడ్డిఅన్నారం ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం బీజేపీ కట్టుబడి పనిచేస్తుందని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి (అర్బన్) జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎల్బీనగర్ ఇన్చార్జ్ సామ రంగారెడ్డి, జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, చిలుకూరి రాంరెడ్డి, చింతల సురేందర్ నాథ్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు బండి నిర్మల, సుధాకర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొని కొత్తగా చేరిన సభ్యులను అభినందించారు.

About The Author