ప్రపంచంలో శాంతి నెలకొనాలి.. ప్రొఫెసర్ కోదండరాం

ప్రపంచంలో శాంతి నెలకొనాలి.. ప్రొఫెసర్ కోదండరాం

ఎల్బీనగర్:

యుద్ధం వల్ల విధ్వంసం, వినాశనమే తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జరుగుతున్న యుద్దాన్ని వెంటనే ఆపితే ప్రపంచంలో శాంతి నెలకొంటుందని తెలిపారు. బుధవారం ఉదయం సరూర్ నగర్ కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ హోమ్ నుండి కొత్తపేట చౌరస్తా వరకు తెలంగాణ స్టడీ ఫోరం, వాకర్స్ అసోసియేషన్ సంయుక్తంగా వేలాది మంది వాకర్స్ తో నిర్వహించిన శాంతి ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. యుద్ధం చేసి శాంతి నెలకొల్పాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. ట్రంప్ దమనకాండ నశించాలన్నారు. యుద్ధం ఆపి ఆయిల్ సంక్షోభాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టడీ ఫోరం అధ్యక్షులు శ్రీనివాసచారి, కేవిఎల్, ఎల్బీనగర్ జేఏసీ మాజీ అధ్యక్షులు కేవి రంగారెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ గుప్తా, రిటైర్డ్ తహసీల్దార్ లక్ష్మయ్య, బేర బాలకిషన్, జక్కుల శ్రీశైలం యాదవ్,  మాజీ కార్పొరేటర్లు ఆకుల శ్రీవాణి, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, పగడాల రమణ, పల్లె వినయ్ కుమార్, ఉద్యమకారులు పాల్గొన్నారు.

About The Author