మూడవ దశలో మూడవ ర్యాండమైజేషన్..
- జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జనరల్ అబ్జర్వర్ సత్యనారాయణరెడ్డి సమక్షంలో పూర్తి

కామారెడ్డి జిల్లా :
మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మూడవ ర్యాండమైజేషన్ కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్, సాధారణ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే బాన్సువాడ నియోజక వర్గంలోని 8 మండలాలు బాన్సువాడ, బిచ్కుంద, బీర్కూర్, డోంగ్లి, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్ పెద్దకొడప్గల్ మండలాలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది యెుక్క మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జనరల్ అబ్సర్వర్ సమక్షంలో నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్ , సిపిఓ, రఘునందన్ ,ఎస్ఓ శివకుమార్ , జిల్లా పంచాయతీ అధికారి , కంప్యూటర్ ఆపరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
