పేద కుటుంబానికి అండగా నిలిచిన యువ నాయకుడు మూడుచింతల నరేందర్ రెడ్డి

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

పేద కుటుంబానికి అండగా నిలిచిన యువ నాయకుడు మూడుచింతల నరేందర్ రెడ్డి

గుమ్మడిదల:


సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ కేంద్రానికి చెందిన ఎస్సీ కాలనీలో నివసించే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు తుడుం రాజమ్మ భర్త నరసయ్య అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెన్నార్ యువసేన వ్యవస్థాపకులు మూడు చింతల నరేందర్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం పెద్ద మనసుతో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని భరోసాకల్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు సురేందర్ రెడ్డి తులసీదాస్, నాయకులు ఆంజనేయులు, రామా గౌడ్ శీను రవీందర్ రెడ్డి రాజిరెడ్డి కర్ణాకర్, సంతోష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,హరీష్, హజర్,అశోక్ యాదగిరి,మహమ్మద్, నరసింహులు, రమేష్, శ్రీను సుధాకర్,సురేష్,సాయి, లింగం బాధిత కుటుంబ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు.

About The Author