సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములు కావాలి

సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములు కావాలి

ఎల్బీనగర్:

సామాజిక ఉద్యమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీసీ ప్రభంజనం సమన్వయకర్త టియుడబ్ల్యుజే రాష్ట్ర నాయకులు జాల కిషన్ పిలుపునిచ్చారు. బీసీ ప్రభంజనం కన్వీనర్ ఉప్పు సత్యనారాయణ జన్మదిన వేడుకలు కొత్తపేట బీజేఆర్ భవన్ లో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈబీసీ ఉద్యమాలు రాజకీయాలకు అతీతంగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం సామాజిక ఉద్యమాలకు కేంద్రంగా ఉందని టియుడబ్ల్యుజే జాతీయ నాయకులు ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. రాజకీయ చైతన్యం అధికంగా ఉండే ఎల్బీనగర్ ప్రాంతంలో తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున జరిగింది అని టియుడబ్ల్యుజే జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సత్యనారాయణ అన్నారు. ఉప్పు సత్యనారాయణ సేవలు ముందు ముందు యదావిధిగా కొనసాగించాలని తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాచం సత్యనారాయణ గుప్త పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న ఉప్పు సత్యనారాయణకు పలువురు ప్రముఖులు జన్మదిన వేడుకలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాచం సత్యనారాయణ గుప్త, వివిధ దిన పత్రికల ఇంచార్జులు కిషన్, ప్రవీణ్ కుమార్, మేకల సత్యనారాయణ, దశరథ్ గౌడ్, శేఖర్, సురేందర్, తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిండిగ అలియాస్ తెలంగాణ వెంకన్న, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు పిడికిలి రాజు, రాష్ట్ర ఇంచార్జి కేవి గౌడ్, టియుడబ్ల్యుజే జిల్లా నాయకులు తగరం సత్యనారాయణ, టియుడబ్ల్యుజే ఎల్బీనగర్ అధ్యక్షుడు సైదులు, టియుడబ్ల్యుజే ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ టియుడబ్ల్యుజే జిల్లా నాయకులు సుభాష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author