నేటి భారతం :
.jpg)
పూర్వాశ్రమంలో అద్భుతమైన వినోద సాధనాలు..
నాటకాలు, నాటికలు, అందులో సాంఘిక, పౌరాణికాలు..
హరికథలు, బుర్ర కథలు, ఒగ్గు కథలు, బొమ్మలాటలు..
వీధి నాటకాలు, మేళతాళాలతో భజనలు..
ఇవన్నీ సంస్క్రుతిని ప్రతిబింబించేవి..
నాగరికతను నేర్పించేవిగా ఉండేవి..
మనిషి జీవితాన్ని మేళవిస్తూ మనతో మమేకం అవుతూండేవి..
బండ్లు కట్టుకుని పక్కూరికి పోయి చూసేవాళ్ళు..
మరి ఇప్పుడు..?
సాంకేతికత పెరిగాక..
ఉన్నమతి పోయే.. చంద్రమతి అనే సామెత నిజమౌతోంది..
సినిమాలు, టీవీ షోలు, సోషల్ మీడియా..
ఒక్కటేమిటి నా సామిరంగా వేళల్లో పుట్టుకొచ్చాయి..
మనిషి జీవితాన్ని, సమాజాన్ని సర్వనాశనం చేయడానికి..
మేలుకో సమాజమా.. నిన్ను నువ్వు రక్షించుకో..
About The Author
08 Nov 2025
