బడంగ్‌పేట్‌లో 'మినార్ టి ప్యాలెస్'హోటల్ ను ప్రారంభించిన: టీ.పీ.సీ.సీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి..
బడంగ్‌పేట్:
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 'మినార్ టి ప్యాలెస్' శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ప్యాలెస్‌ను ప్రారంభించారు.
నాణ్యమైన సేవలు అందించాలి ఈ సందర్భంగా పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న బడంగ్‌పేట్ ప్రాంతంలో స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక వసతులతో ఇలాంటి ఫంక్షన్ హాళ్లు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. వ్యాపార సంస్థలు లాభార్జనతో పాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రజల ఆదరణ పొందాలని ఆమె ఆకాంక్షించారు.
మాజీ కార్పొరేటర్లు సూర్ణగంటి అర్జున్, పెద్దబావి సుదర్శన్ రెడ్డి.
పార్టీ నాయకులు రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, లిక్కీ కృష్ణారెడ్డి.
గట్టు బాలకృష్ణ, బొల్లపల్లి కుమార్, సూర్ణగంటి విజయ్ తదితరులు ఉన్నారు.
నూతన ప్యాలెస్ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ప్రజలు, అభిమానుల కోలాహలంతో ఆ ప్రాంతం సందడిగా మారింది.
About The Author
04 Feb 2026
