రేపు శ్రీరామనవమి శోభాయాత్ర: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్:
నగరంలో శుక్రవారం నిర్వహించనున్న శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకుని ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర సుల్తాన్‌బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో యాత్ర సాగే మార్గాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు వాహనాల మళ్లింపులు అమలులో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వెల్లడించారు.
ప్రధాన మళ్లింపు పాయింట్లు:
సీతారాంబాగ్ - మల్లేపల్లి: ఆసిఫ్ నగర్ నుంచి భోయిగూడ కమాన్ వైపు వచ్చే వాహనాలను మల్లేపల్లి ఎక్స్ రోడ్ వద్ద విజయ్ నగర్ కాలనీ, నాంపల్లి వైపు మళ్లిస్తారు.
భోయిగూడ కమాన్ - అఘాపురా: దారుసలాం నుంచి వచ్చే ట్రాఫిక్‌ను అఘాపురా ఎక్స్ రోడ్ వద్ద ఘోడే-కీ-ఖబర్ లేదా నాంపల్లి వైపు మళ్లిస్తారు.
ఎంజే మార్కెట్ - అబిడ్స్: నాంపల్లి, అబిడ్స్ నుంచి ఎస్.ఏ బజార్ వైపు వెళ్లే వాహనాలను ఎంజే మార్కెట్ వద్ద జాంబాగ్, పుత్లీబౌలి వైపు మళ్లిస్తారు.
కోఠి - చాదర్‌ఘాట్: చాదర్‌ఘాట్ నుంచి పుత్లీబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను రంగమహల్ వద్ద సీబీఎస్, అఫ్జల్‌గంజ్ వైపు మళ్లిస్తారు.
రద్దీగా ఉండే ప్రాంతాలు:
బేగంబజార్ ఛత్రీ, అఫ్జల్‌గంజ్, శివాజీ బ్రిడ్జ్, సీబీఎస్, రంగమహల్ జంక్షన్, పుత్లీబౌలి, కోఠి ఆంధ్ర బ్యాంక్, అబిడ్స్ జీపీఓ, ఎంజే మార్కెట్, చాదర్‌ఘాట్, కాచిగూడ ప్రాంతాల్లో తీవ్ర వాహన రద్దీ ఉండే అవకాశం ఉంది.
వాహనదారులకు సూచన:
యాత్ర జరిగే సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం 9010203626 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
