మహిళా విద్యార్థులకు అండగా ఉంటా

సంగారెడ్డి :

- కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
- మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్ సందర్శించిన టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి 

 

Read More సెమీకండక్టర్ హబ్ గా భారతదేశం

 

WhatsApp Image 2025-09-21 at 5.27.18 PM

Read More నేటి భారతం :

గత పదేళ్ల కాలంలో పార్టీ అధికారంలో లేదని దీంతో ప్రజలకు నష్టం జరిగిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శనివారం  సంగారెడ్డి ప్రభుత్వం మహిళా డిగ్రీ కాలేజీనీ టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలతో కలిసి జగ్గారెడ్డి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.  హాస్టల్ గదిలో 12 మంది అమ్మాయిలు ఉండేలా విశాలంగా నిర్మించాలని అధికారులకు సూచించారు. ఒకేసారి వెయ్యి మంది కూర్చొని భోజనం చేసేలా డైనింగ్ హాల్ డిజైన్ చేయాలన్నారు. క్లాస్ రూమ్ స్లాష్ రూమ్స్ లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ ఆడిటోరియం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలన్నారు. అక్టోబర్ 10 వరకు ఎస్టిమేషన్లో డిజైన్లు సిద్ధం చేసేలా కార్యాచరణ రూపొందిస్తే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు దామోదర నరసింహ, శ్రీధర్ బాబు వివేక్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. నిర్మల జగ్గారెడ్డి ఇక్కడే చదివారని, తాను కూడా స్టూడెంట్ లీడర్ గా ఉన్న రోజుల్లో ఇదే కాలేజీకి వచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆనాడు ర్యాగింగ్ నిర్మూలన కోసం నాగలక్ష్మి అని అమ్మాయి పోరాటం చేసిన ఉదాంతాన్ని గుర్తుచేస్తూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తోనే మహిళా డిగ్రీ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాగా గత పదేళ్ల కాలంలో పార్టీ అధికారంలో లేదని ఉమ్మడి రాష్ట్రంలో ఎంత చేయాలో అంతగా చేశానని పేర్కొన్నారు. కానీ ప్రజలకు పదేళ్లు నష్టం జరిగిందన్నారు. రాజకీయాల మీద పెద్దగా ఆశ లేదని పార్టీ అధికారంలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తాను చెప్పింది విని అభివృద్ధి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కేవలం ఒక వ్యక్తిగా ఇక్కడికి వచ్చానని సంస్థను కాపాడే పని కోసమే పాటు పడతానన్నారు. స్థానికంగా ఉండే తాను సమస్యలను చాలెంజిగా తీసుకొని కాలేజీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాలేజీ అభివృద్ధి చెందితే 1000 మంది చదివే ఆస్కారం ఉంటుందన్నారు. తద్వారా పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాలేజీ డిజైన్ చేయాలని అధికారులను కోరారు. అదనపు భవనం కళాశాల కొత్త భవనాలకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి మా ఇల్లు అధ్యక్షులు అనంత తోపాచి కిషన్, కోన సంతోష్, ఆయా కాలేజీల ప్రిన్సిపాల్ లు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. 

Read More అభివృద్ధి పనులకు 2కోట్ల హెచ్ఎండిఏ నిధులు మంజూరు

About The Author