సిద్దిపేట కలెక్టర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్

అక్కన్నపేటలో ఇద్దరు గల్లంతుపై ఆరా
ఎస్డీఆర్ఎఫ్ టీంలను పంపి గాలింపు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి ఆదేశం

WhatsApp Image 2025-10-30 at 6.19.58 PM

కరీంనగర్ : 

Read More నేను బెంజిలో తిరిగిన గంజికే కనెక్ట్ అవుతా..

మొంతా తుపానుకు కురిసిన భారీ వర్షానికి  హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలోని మల్లంపల్లి చెరువులో ఇద్దరు (భార్యభర్తలు) గల్లంతయ్యారనే సమాచారం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు గురువారం ఫోన్ చేశారు.  ఆ ఇద్దరి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరూ భార్యాభర్తలని వారి బైక్ లభ్యమైందే తప్ప ఆచూకీ తెలియలేదని కలెక్టర్ వివరించారు. వెంటనే ఎస్డీఆర్ఎఫ్ టీంలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయంలో అవసరమైతే అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. స్థానిక బీజేపీ శ్రేణులు సైతం సహాయక చర్యల్లో పాల్గొనాలని, వర్ష బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని పిలుపునిచ్చారు.

Read More లింగంపేట మండలం ఎల్లారాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించిన జిల్లా కలెక్టర్

About The Author