తెలంగాణ రాష్ట్రానికి నిధులు తెలీని కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి

కరీంనగర్ :

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి  జాన్ వెస్లీ డిమాండ్

WhatsApp Image 2025-09-24 at 7.29.42 PM

కేంద్రం ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నిధులు, యూరియా తీసుకురావడంలో విఫలమైన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వెంటనే రాజీనామా చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ డిమాండ్ చేశారు . కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రతి కుటుంబానికి 15000 రూపాయల ఆదాయం పేరుగుతోందని గొప్పలు చెప్తుందని  ఎద్దేవ చేశారు. బుధవారం కరీంనగర్ లోని ముకుందలాల్  మిశ్రా భవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ద్వారా రెండున్నర లక్షల కోట్ల రూపాయల భారాన్ని తగ్గిస్తున్నామని చెబుతోంది. ఈ ఏడు సంవత్సరాల కాలంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు బిజెపి ప్రభుత్వం సామాన్య ప్రజల నుండి దోచి కార్పొరేట్లకు పెట్టిందో  ప్రజల అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ జీఎస్టీ ని భారాన్ని పేద ప్రజలపై మోపి కార్పోరేట్ సంస్థల బొజ్జలు నింపిందని అన్నారు. అదేవిధంగా మన రాష్ట్రానికి రావలసిన మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందించడంలో కేంద్ర మంత్రులు విఫలమయ్యారు దీని ఫలితంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రం నుండి 8 మంది పార్లమెంటు సభ్యులు గెలిచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు తేవడంలో, యూరియా ను తేవడం లో , పూర్తిగా వైఫల్యం చెందారు. అంతర్జాతీయంగా బిజెపి మోడీ విధానాల వల్ల భారతదేశం యొక్క అస్తిత్వాన్నీ కోల్పోతుంది. అమెరికా టారిప్ ల యుద్ధం చేస్తుంటే  యుద్ధంలో మోడీ ప్రభుత్వం సరైన విధంగా యుద్ధం చేయలేకపోతున్నారు . ఐక్యరాజ్యసమితిలో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని భారతదేశం పెంచి పోషిస్తుందని ట్రంపు మాట్లాడుతుంటే దాన్ని కనీసం మోడీ ఖండించలేకపోతున్నాడని , అమెరికాలో నిరుద్యోగానికి ఇండియన్స్  కారణమని తప్పుడు కూతలు కూస్తుంటే మోడీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు? ఇప్పటికి కూడా తగ్గిన జిఎస్టి స్లాబుల కనుకూలంగా మార్కెట్లో నిత్యవసర సరుకుల ధరలు  తగ్గించడం లేదని దీనివలన పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించిన  నీళ్లు నిధులు నియామకాలు చేపట్టకపోవడంతో తెలంగాణ అన్యాయం జరిగిందని మా ప్రభుత్వం వస్తే వచ్చిన సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, వికలాంగుల పెన్షన్ పెంచుతామని,  పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం వలె ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందుతుందన్నారు. ఈ రాష్ట్రంలో 120 గజాల ఇంటి స్థలం కోసం అనేక ప్రాంతాలలో లక్షలాది మంది పేద ప్రజలు గుడిసెలు వేసుకొని జీవిస్తుంటే వారి గుడిసెలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ లాఠీ చార్జీ చేస్తుందన్నారు. ఈ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే గత ప్రభుత్వానికి పార్టీని గత ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేని పక్షంలో రాష్ట్రంలో దేశంలో ప్రత్యేక విధానాల కోసం కలిసొచ్చే పక్షాలన్నిటిని కలుపుకొని సమరశీల పోరాటం చేస్తామని అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరు వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాకు 45 వేల మెట్రిక్  టన్నుల యూరియా అవసరం ఉంటే ఇప్పటివరకు 30 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని దీంతో రైతు లు తీవ్రంగా నష్టపోతునారు. ఈ జిల్లా నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు? ESI ,hospital, త్రిబుల్ ఐటీ తేలేకపోయాడు, ఏళ్ల తరబడి రైల్వే బ్రిడ్జి అసంపూర్తిగా ఉన్నది, ఏ ఒక చిన్న తరహా పరిశ్రమ తీసుకురాలేకపోయాడు, ఈ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో ఉద్యమాల కొనసాగిస్తామని అన్నారు.

ఈ పాత్రికేయుల సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి బీమా సాహెబ్ జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్ ఎడ్ల రమేష్ కె నాగమణి డి నరేష్ పటేల్ . సీనియర్ నాయకులు పుల్లెల మల్లయ్య  తదితరులు పాల్గొన్నారు.

About The Author