పలు కుటుంబాలకు వంగ రాజేశ్వర్ రెడ్డి పరామర్శ

పలు కుటుంబాలకు వంగ  రాజేశ్వర్ రెడ్డి పరామర్శ

భారత శక్తి,:

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన నక్క చరణ్ అకాల మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషయం తెలుసుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి గురువారం మృతుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
చిన్న వయసులోనే చరణ్ మృతి చెందడం ఎంతో దురదృష్టకరమన్నారు. తన వంతుగా రూ.10,000 ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అంతక ముందు నంగునూరు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గోవిందారం మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి గురువారం మృతుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.WhatsApp Image 2026-04-09 at 19.38.49

About The Author