మధుయాష్కీని కలిసిన... వేం నరేందర్ రెడ్డి..!
హైదరాబాద్:
రాజ్యసభ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి ఆదివారం మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డికి మధుయాష్కీ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సాగాలి..
అనంతరం మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. "పెద్దల సభలో రాష్ట్ర సమస్యలను గట్టిగా వినిపించి, తెలంగాణ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి వేం నరేందర్ రెడ్డి గారు తన వంతు కృషి చేస్తారని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు పార్టీ అధిష్టానానికి, సహకరించిన నేతలకు నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
సుమారు గంటకు పైగా సాగిన ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో అమలు అవుతున్న ప్రజా సమస్యలపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About The Author
16 Mar 2026
