వేములవాడ నేతలు జూబ్లీ బాట

WhatsApp Image 2025-11-05 at 5.11.19 PM

వేములవాడ : 

Read More భూ నిర్వాసితులపై చిన్న చూపు చూస్తున్న సింగరేణి యాజమాన్యం.

రాజధాని హైదరాబాద్ లో హోరాహోరీగా జరుగుతున్న జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచారంలో బుధవారం రోజున వేములవాడ నుండి కాంగ్రెస్ పార్టీ నేతలు భారీగా తరలి వెళ్లారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే,ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు, వేములవాడ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నేతలు జూబ్లీహిల్స్ లోని తమకు అప్పగించిన ప్రాంతాల్లోనే తిష్ట వేసి ప్రచారంలో తిరుగుతు గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తూ,అక్కడే మకాం వేసి తీరికలేని షెడ్యూల్ తో బిజీబిజీగా గడపుతున్నారు, అలాగే తమ అభ్యర్థి గెలుపు కోసం జిల్లాలోని ఆయా మండలాల్లో తమ సన్నిహితులు,బంధువుల వారి ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు సైతం హాజరు కాకుండా జూబ్లీహిల్స్ లో తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిళ నవీన్ కుమార్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని, ప్రచారంలో పార్టీ తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఫ్రీ బస్సు ఇలా మరెన్నో సంక్షేమ పథకాలు వంటి ఓటర్లకు వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులి రాంబాబు గౌడ్, సయ్యద్ సాబీర్, మర్రిపల్లి రాజు, తోటరాజు, పల్లపు రాజేందర్, దూరం భూమేష్ గౌడ్, మారంపల్లి రాజయ్య, అతహుర్ రెహమాన్, కొండ శేఖర్, పెండ్యాల ప్రకాష్, గుడిసె కరుణాకర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 

Read More అయ్యప్ప మహా పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

About The Author