ఘనంగా నేరెళ్ల వేణుమాధవ్ స్వరార్చన, ప్రతిభా పురస్కార కార్యక్రమం

ఉమ్మడి వరంగల్ :
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మిమిక్రీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ 94వ జయంతి, స్వరార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లోని వేణుమాధవ్ కళాప్రాంగణంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. తొలుత నేరెళ్ల వేణుమాధవ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజాకవి, ప్రముఖ గాయకుడు వరంగల్ శ్రీనివాస్, ప్రముఖ సినీ, మిమిక్రీ కళాకా రుడు ఫన్ స్టార్ శివారెడ్డి, జబర్దస్త్ ఫేమ్, సినీ నటుడు రాకింగ్ రాకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షురాలు నేరెళ్ల శోభావతి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో ఉన్న కళ బయటికి తీసుకువచ్చేందుకు నేరెళ్ల వేణుమాధవ్ ఎంతో కృషి చేశారన్నారు. కల ఎవరి సొత్తు కాదని, ఎవరు నేర్చుకుంటే వారికి వస్తుందన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కార్యదర్శి డాక్టర్ అంపశయ్య నవీన్ మాట్లాడుతూ.. వేణుమాధవ్ ప్రదర్శన ఇచ్చిన తర్వాత ప్రతి సారి ఎలా ఉంది అని అడిగేవారని, నేను బాగున్నది అని చెప్పేవాడిన్నారు. ఆయన్ను ప్రతిక్షణం గుర్తు చేసుకుంటున్నట్లు చెప్పారు. అత్యంత ఉన్నత స్థానా నికి మిమిక్రీ కళను తీసుకెళ్లారని గుర్తుచేశారు. వివిధ ప్రముఖుల గొంతులను సహజంగా అనుకరిస్తూ, హాస్యంతో పాటు సందేశాత్మక అంశాలను కూడా అందిస్తూ మిమిక్రీ కళకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకుల నుంచి విశేష స్పందన పొందిన బాలమురకృష్ణ, యువతకు ప్రేరణగా నిలిచి, భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారన్నారు.ఈ సందర్భంగా ప్రసిద్ధ కవి, కథా రచయిత, నవలాకారులు ప్రొఫెసర్ రామాచంద్రమౌళికి నేరెళ్ల వేణుమా ధవ్ స్మారక ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు. కార్యక్ర మంలో నేరెళ్ల శ్రీనాథ్, నేరెళ్ల రాధాకృష్ణ, సలహా మండలి సభ్యులు డాక్టర్ గిరిజామనోహర్ బాబు, వనం లక్ష్మీకాంతారావు, కొణతం కృష్ణ, పాట్లపల్లి శ్రీనివాసరావు తదితలు పాల్గొన్నారు.
