శాయంపేట ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం..

 

WhatsApp Image 2025-11-19 at 6.00.52 PM

ఉమ్మడి వరంగల్ బ్యూరో : 

గతపాలనలో అభివృద్ధికి నోచుకోలేదు.. గడిచిన రెండేళల్లో అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నాం… గతపాలకుల పాలనలో అభివృద్ధికి నోచికోని 31 డివిజన్ శాయంపేటను గడిచిన రెండేళల్లో అన్ని రంగాల్లో అభివృద్దిలో ముందు వరుసలో ఉంచుతున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి  అన్నారు.బుధవారం  నగర మేయర్  గుండు సుధారాణి తో కలిసి న్యూ శాయంపేట ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రూ.60 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణనికి భూమి పూజా చేశారు.అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబధిత అధికారులని ఆదేశించారు.పూర్తి గ్రామీణ వాతావరణంలో ఉన్న డివిజన్ ని గతంలో ఎవరు పట్టించుకోలేదని గడిచిన రెండేళ్లలో అత్యధికంగా నిధులు కేటాయించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మామిండ్ల రాజు,మాజీ కార్పొరేటర్ లు మోహన్ రావు,శివ శంకర్,డివిజన్ అధ్యక్షులు సురేందర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. 

About The Author