మేము ఉన్నాం మిత్రమా...

సహచరుని కుటుంబానికి ఆర్థిక ఆసరా అందించి.. మేము ఉన్నామని భరోసా ఇచ్చిన 2002 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్లు..

మేము ఉన్నాం మిత్రమా...

ఎల్బీనగర్:

గ్రూపు సభ్యుల నుంచి విరాళాలు సేకరించి సురక్ష సేవా సంఘం ద్వారా, మృతుడు సీఐ జాన్సన్ బాబు కుటుంబానికి 8 లక్షల రూపాయలు అందించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇన్స్ పెక్టర్లు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 2002 బ్యాచ్ కి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ ప్రస్తుత ఏహెచ్టీయు ఇన్స్ పెక్టర్ జాన్సన్ బాబూరావు గత సంవత్సరం 10 వ నెలలో అనారోగ్యం కారణంగా మరణించారు. హఠాత్తుగా సహచర మిత్రుడు మరణించడంతో జీర్ణించుకోలేని సహచర అధికారులు జాన్సన్ బాబు కుటుంబానికి అండగా నిలిచారు. గ్రూపు సభ్యుల నుండి విరాళాలు సేకరించి, సురక్ష సేవా సంఘం ద్వారా తక్షణ సహాయం కింద 8 లక్షల రూపాయలు మృతుని కుటుంబానికి ఆదివారం అందించి, భవిష్యత్ లో ఎటువంటి అవసరాలకైనా మేమున్నామని భరోసా ఇచ్చారు. పక్కవాడు పోతే నాకేంటి అని పక్కకు పోయే ఈరోజుల్లో, సహచర మిత్రుడి కుటుంబం పట్ల చూపిన ఔదార్యానికి 2002 బ్యాచ్ పోలీస్ అధికారులకు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ముద్దనూర్ ఎస్.నగేష్ బాబు, కడప ఉజ్జిని సదాశివయ్య, చిన్న చౌక్ గౌనీ, ఓబులేష్, వేంపల్లి టీ. నర్సింహులు, కొండాపూర్ పి. రాజా, మున్నూరు ఎస్.లింగప్ప, డీటీఆర్బీ కడప ఎస్ మహమ్మద్ బాబా, కడప రైల్వే ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్లు శ్యామల వెంకటేష్, అవ్వారి నరసింహ స్వామి, నార్కోటిక్స్ ఇన్స్పెక్టర్ పార రాజు, సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్ పాల్గొన్నారు.

About The Author