హైడ్రా..రూ. 70 వేల కోట్ల ప్రజా ఆస్తిని కాపాడాం!
- పర్యావరణ పరిరక్షణ సర్కార్ ఒక్కడిదే కాదు.. అందరి బాధ్యత*
- *ప్రతి కాలేజీలోనూ ‘ఎన్విరాన్‌మెంట్ క్లబ్’ పెట్టాలి*
- సీబీఐటీ ‘మున్ 2026’లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి
హైదరాబాద్:
పర్యావరణాన్ని కాపాడుకోవడం కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి కర్తవ్యమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రకృతి పట్ల బాధ్యత పెంచితేనే భవిష్యత్ తరాలకు సుస్థిరమైన వాతావరణాన్ని అందించగలమని చెప్పారు. శుక్రవారం హైటెక్స్‌లో సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీ నిర్వహించిన ‘మోడల్ యునైటెడ్ నేషన్స్ 2026’ (MUN) ప్రోగ్రామ్‌కు ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి హాజరయ్యారు.
*క్లబ్‌లు పెడితేనే అవేర్‌నెస్..*
ప్రస్తుతం విద్యాసంస్థల్లో కల్చరల్, స్పోర్ట్స్, ప్లేస్‌మెంట్ క్లబ్‌లు ఉన్నట్టే.. ప్రతి కాలేజీలో కచ్చితంగా ‘ఎన్విరాన్‌మెంట్ క్లబ్’ ఉండాలని రంగనాథ్ సూచించారు. వీటి ద్వారా మొక్కలు నాటడం, నీటి వనరుల సంరక్షణ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వంటి అంశాలపై విద్యార్థుల్లో చైతన్యం తేవాలన్నారు. స్టూడెంట్స్ చురుగ్గా పాల్గొంటేనే సమాజంలో సానుకూల మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హైడ్రా చేపట్టిన ఆపరేషన్ల ద్వారా నగరంలో ఇప్పటివరకు సుమారు రూ. 70 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను, పార్కులను, చెరువులను ఆక్రమణల నుంచి కాపాడామని రంగనాథ్ వివరించారు.
* *వరద కాలువలు, నాలాల ఆక్రమణలను ఉపేక్షించేది లేదు.*
చెరువులు బాగుంటేనే వరద ముప్పు తప్పుతుంది.
హైడ్రా చేపడుతున్న ప్రకృతి వనరుల పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీబీఐటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీవీ నరసింహులు, కాలేజీ ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు..jpeg)
