ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తాం

మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్

ఆశ వర్కర్ల  సమస్యలను పరిష్కరిస్తాం

మేడ్చల్ జిల్లా:

     మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని  ఆశావర్కర్ల  సమస్యలను తప్పకుండా పరిశీలించి వారికి పరిష్కారం అందిస్తామని జిల్లా అదనపు కలెక్టర్  ఫైజాన్ అహ్మద్ అన్నారు. 
     మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లో నిరసన తెలుపుతున్న ఆశావర్కర్ల సమస్యలను అడిగి తెలుసుకొని జిల్లా స్థాయిలో పరిష్కరించే సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తామని అన్నారు. జిల్లాలో పరిష్కారం కాని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి  ప్రత్యేక చొరవతో పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తామని తెలిపారు.  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తో మీ సమస్యలను చర్చించి  నియమ నిబంధనల అనుగుణంగా పరిష్కరిస్తామని తెలిపారు. మీరు ఏ సమస్యలున్న తన దృష్టికి తీసుకురావాలని తను తప్పకుండా మీ సమస్యలను పరిష్కరిస్తానని అదనపు కలెక్టర్  సూచించారు. అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ఆశావర్కర్లు సంతోషం వ్యక్తం చేసి తమ సమస్యల, డిమాండ్ లను తెలియజేస్తూ దరఖాస్తును అదనపు కలెక్టర్ కు అందజేసారు.

About The Author