మహిళలు సంఘటితమై ముందుకు సాగాలి..

మహిళలు సంఘటితమై ముందుకు సాగాలి..

ఎల్బీనగర్

మహిళలు ఐకమత్యంతో సంఘటితమై ముందుకు సాగాలని సరూర్ నగర్ సర్కిల్ 12 డిప్యూటీ కమిషనర్,13 వ సర్కిల్ ఇంచార్జి బోనగిరి శ్రీనివాస్ సతీమణి బోనగిరి లావణ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల పురస్కరించుకొని చైతన్యపురిలోని మాధవరెడ్డి ఫంక్షన్ హాలులో సంతోషిమాత  పట్టణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఓర్పు సహనంతో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. పురుషులకు సమానంగా అన్ని రంగాలలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగడం శుభపరిణామం అన్నారు. అనంతరం మహిళలను సత్కరించారు. డాన్సులు ఉపన్యాసాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన  ఈ కార్యక్రమంలో యుసిడి ప్రాజెక్టు ఆఫీసర్ విక్రాంత్ రెడ్డి, జి. సహదేవ్, సైదులు, శిల్ప, పల్లవి చైతన్యపురి డివిజన్ ప్రభాత్ నగర్ కాలనీ మహిళలు, సమాఖ్య సభ్యురాళ్లు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

About The Author