ఇంటర్ మొదటి సంవత్సరానికి దరఖాస్తులు చేసుకోవాలి.. జోన్ 6 ఆఫీసర్ ఎం. భీమయ్య
ఎల్బీనగర్:
రెగ్యులర్ ప్రాతిపదికన 2025-26 విద్యా సంవత్సరంలో ఐసిఎస్ఈ, సీబీఎస్ఈ ద్వారా 2026 లో 10వ తరగతి పరీక్షలకు హాజరైన అభ్యర్థులు రెగ్యులర్ జూనియర్ కాలేజీలు, వృత్తివిద్య,సైనిక కళాశాలలలో ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం దరఖాస్తులు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 6 వ
జోన్ ఆఫీసర్ ఎం. భీమయ్య తెలిపారు. సోమవారం చైతన్యపురిలోని గురుకుల న్యాయ కళాశాలలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 15 న శుక్రవారం ఉ.10.00 గం. మండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడునని పేర్కొన్నారు. ప్రాస్పెక్టస్, ఇతర వివరాల కోసం http://rjcet.telangana.gov.in లేదా http://tgswreis.telangana.gov.in వెబ్ సైట్ లో చూడొచ్చన్నారు. వివరాల కోసం దరఖాస్తుదారులు సమీప టిజిఎస్ డబ్ల్యూఆర్ జూనియర్ కళాశాలలో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.
