ఘనంగా ముడుపుల ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం

వైభవంగా శ్రీ ముడుపుల ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

ఘనంగా ముడుపుల ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం

గజ్వేల్:

సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం మునిగడప గ్రామంలో శ్రీ ముడుపుల ఎల్లమ్మ ఆలయ 10వ  వార్షికోత్సవ వేడుకలు  వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఎల్లమ్మ తల్లి కల్యాణం, కన్నుల పండుగగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. 
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు, అమ్మవారి ఉపాసకులు దొమ్మట సునీత - నర్సింలు స్వామితో పాటు నిర్వాహకులు, భక్తులు మాట్లాడుతూ శ్రీ ముడుపుల  ఎల్లమ్మ కరుణాకటాక్షాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఆలయ వార్షికోత్సవ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి స్వామివారి కృప ఉంటుందని అన్నారు, అమ్మ వారి కల్యాణం, భారీ భక్త జనసంద్రంలో అంగరంగ వైభవంగా నిర్వహణ జరిగిందని తెలిపారు. మూడురోజుల పాటు నిర్వహించిన వేడుకల్లో అమ్మవారి ఉపాసకులు నర్సింలు స్వామి ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్న ప్రసాద వితారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, పాలకవర్గ సభ్యులు, మునిగడప గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

About The Author