జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం
- హెల్త్ క్యాంప్ ప్రారంభించిన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి:
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సారథ్యంలో, ఫసల్ వాదిలోని జ్యోతిర్వాస్థు విద్యాపీఠంలో స్వచ్ఛంద రక్త దాన శిబిరం, ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. హెల్త్ క్యాంప్ లో భాగంగా పంటి పరీక్షలు, కంటి పరీక్షలు, ఈసిజి వంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, మహేశ్వర శర్మ సిద్ధాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్త దానం ద్వారా ఎంతో మంది ప్రాణాలనుకాపాడవచ్చాన్నారురక్తదానం అన్ని దానాల కంటే విలువైనదని, ముఖ్యమైనదన్నారు. ప్రతీ ఒక్కరూ రక్త దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ శ్రీధర్, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, విద్యాపీఠం సేవకులు పాల్గొన్నారు
About The Author
16 Jul 2026
