తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా గంట సుదర్శన్ నియామకం
ఎల్బీనగర్:
ఈ మేరకు గంట సుదర్శన్ కు నియమిక పత్రాన్ని బుధవారం సరూర్ నగర్ లో జరిగిన ఉద్యమ కారుల సమావేశంలో ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రూబీ స్టీవెన్ సన్, ప్రధాన కార్యదర్శి పిండిగ వెంకన్న అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న గంట సుదర్శన్ ఉద్యమ కారుల సంక్షేమం కోసం భవిష్యత్తులో పని చేస్తారని ఆశిస్తూ ఈ నియామకం చేయడం జరిగింది అని రాష్ట్ర అధ్యక్షుడు రూబీ స్టీవెన్ సన్ పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో రాజీలేని పోరాటం చేసిన గంట సుదర్శన్ తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమం హక్కుల కోసం క్రియాశీలకంగా పాల్గొంటారని ఆయన తెలిపారు. తెలంగాణ కోసం 2001 నుంచి సుదర్శన్ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు అని రాష్ట్ర ప్రధాన పిండిగ వెంకన్న అలియాస్ తెలంగాణ వెంకన్న అన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం నియమించిన బాబు జగ్ జీవన్ రాం, అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీకి వైఎస్ చైర్మన్ గా పని చేశారు. తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షుడు రూబీ స్టీవెన్ సన్, ప్రధాన కార్యదర్శి పిండిగ వెంకన్న కు గంట సుదర్శన్ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమ కారుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సమితి రాష్ట్ర నాయకులు బి. జాన్, జిల్లా నాయకులు ఇరుగు కిరణ్, కొమ్ము రాజశేఖర్, ఇరుగు నాగరాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.
