సంస్కృతి రక్షణలో యువత పాత్ర అభినందనీయం

  • *బంజారా కాలనీ యువత రూపొందించిన దృశ్య కావ్యం (వీడియో సాంగ్) ఆవిష్కరణ
  • *వ్యసనాలకు దూరంగా ఉండి కళలు, క్రీడల్లో రాణించాలి: కళ్లెం నవజీవన్ రెడ్డి

సంస్కృతి రక్షణలో యువత పాత్ర అభినందనీయం

*హయత్‌నగర్:

భాష, సంస్కృతుల పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. డివిజన్ పరిధిలోని బంజారా భవనంలో, బంజారా కాలనీకి చెందిన యువతీ యువకులు తమ మాతృభాషలో రూపొందించిన ఒక అద్భుతమైన దృశ్య కావ్యాన్ని (వీడియో సాంగ్‌ను) శనివారం ఆయన వీక్షించారు.
ఈ సందర్భంగా నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ, తమ సొంత భాషా సంస్కృతులను కాపాడుకునేందుకు యువత చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయమన్నారు. నేటి తరం యువత మత్తు పదార్థాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. విలువైన సమయాన్ని చదువు, ఉపాధి, క్రీడలు, కళలు మరియు సాంస్కృతిక రంగాలపై కేటాయించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఇలాంటి సృజనాత్మక ఆలోచనలు యువతకు సమాజంలో మంచి గుర్తింపును తీసుకువస్తాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలతో తమ ప్రతిభను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ, యువతకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ వినూత్న గీతం ఘన విజయం సాధించాలని ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉగాది ఎల్లప్ప, పార్టీ నాయకులు రఘుపతి నాయక్, శంకర్ నాయక్, అమల్ నాయక్, భరత్ నాయక్, కాలనీ వాసులు పాంతు, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-07-12 at 19.49.15

About The Author