ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రజలకు అండగా బీఆర్ఎస్ నాయకులు

గణేష్‌పురి, న్యూ ఎంసీహెచ్, మున్సిపల్ కాలనీ వాసులకు పేపర్‌వర్క్‌లో సహాయం

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రజలకు అండగా బీఆర్ఎస్ నాయకులు

ఎల్బీనగర్:

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా చైతన్యపురి డివిజన్‌ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సొంటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గణేష్‌పురి, న్యూ ఎంసీహెచ్, మున్సిపల్ కాలనీ ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో స్థానికులకు అవసరమైన పత్రాల పరిశీలన, దరఖాస్తుల పూరణ (పేపర్‌వర్క్)లో సహాయం చేసి, పూర్తి చేసిన ఫారాలను సంబంధిత బీఎల్‌వోలకు సమర్పించేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసుకునేలా బీఆర్ఎస్ నాయకులు సహకారం అందించారు. కార్యక్రమంలో సాయి ప్రశాంత్, రామకృష్ణ, జలంధర్, పులి కిరణ్, శ్రవణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

About The Author