జాతీయం
జాతీయం 

ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లో రూ.4600 కోట్ల వ్యయంతో సెమీకండక్టర్ తయారీ యూనిట్ల ఏర్పాటు

ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లో రూ.4600 కోట్ల వ్యయంతో సెమీకండక్టర్ తయారీ యూనిట్ల ఏర్పాటు న్యూఢిల్లీ, భారత శక్తి ప్రతినిధి, ఆగస్టు 12:సెమీకండక్టర్, అధునాతన ప్యాకేజింగ్ రంగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద మరో నాలుగు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే వివిధ దశల్లో అమల్లో ఉన్న ఆరు ఆమోదిత సెమీ...
Read More...
జాతీయం 

తెలంగాణలో  కొత్త రైల్వే లైన్

తెలంగాణలో  కొత్త రైల్వే లైన్ తెలంగాణ ట్రైన్ ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్‌కు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం పటాన్‌చెరు-ఆర్మూర్‌-ఆదిలాబాద్‌ కొత్త రైల్వే లైన్ పనులను ప్రారంభించడానికి కేంద్ర రైల్వే శాఖ సిద్ధమైంది. 250 కి.మీ.ల ఈ మార్గం.. ఆదిలాబాద్ నుంచి నగరానికి 72 కి.మీ. దూరాన్ని తగ్గిస్తుంది, సమయం, ఖర్చూ ఆదా చేస్తుంది. ఇది నిర్మల్, నిజామాబాద్, బోధన్, సంగారెడ్డిలను కలుపుతూ పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుంది.
Read More...
జాతీయం 

ధర్మస్థల దేవాలయంపై తప్పుడు ప్రచారాలు చేయడం పెద్ద తప్పు : బీజేపీ

ధర్మస్థల దేవాలయంపై తప్పుడు ప్రచారాలు చేయడం పెద్ద తప్పు : బీజేపీ బెంగళూరు, భారత శక్తి ప్రతినిధి, జూలై 23:కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ప్రాంతంలో 1998 నుండి 2014 మధ్య కాలంలో వందలాది మంది మహిళలు, యువతులను లైంగిక వేధింపులకు గురిచేసి, సామూహిక ఖననం చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై పెద్ద దుమారం రేగింది. దీనిపై బీజేపీ స్పందించింది.దీనిపై ప్రభుత్వం స్పందించింది, సిట్ ఏర్పాటు చేయడాన్ని తాము...
Read More...
జాతీయం 

భారత విప్లవ వీర సింహం 'ఆజాద్ చంద్ర శేఖర్'

భారత విప్లవ వీర సింహం 'ఆజాద్ చంద్ర శేఖర్' చంద్రశేఖర్ ఆజాద్ 119వ జయంతి సందర్భంగా.... దృఢ కాయము వాడుతేజోమయ మోమువాడుభారత విప్లవ వీరుడతడుఆజాదు చంద్రశేఖరుడు
Read More...
జాతీయం 

అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్నిక,  భారత్‌కు భారీ విజయం

అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్నిక,  భారత్‌కు భారీ విజయం ప్రధాని మోదీది చాణక్య దౌత్యం. ప్రపంచ వేదికపై బ్రిటన్‌ ఓటమి. ప్రధాని మోదీజీ ప్రపంచవ్యాప్తంగా సంబంధాలను ఎలా నిర్మించుకున్నారో చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ.
Read More...
జాతీయం 

గ్రామీణ స్థాయి నుండి వృద్ధి కోసం విస్తృత ప్రణాళికను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా

గ్రామీణ స్థాయి నుండి వృద్ధి కోసం విస్తృత ప్రణాళికను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా న్యూఢిల్లీ, భారత శక్తి ప్రతినిధి, జూలై 17:న్యూఢిల్లీలో ఇండియా పోస్ట్ బిజినెస్ మీట్ 2025-26లో గ్రామీణ స్థాయి నుండి వృద్ధి కోసం విస్తృత ప్రణాళికను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా ఆవిష్కరించారు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా నాయకత్వంలో పోస్టల్...
Read More...
జాతీయం 

వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి

వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి భారత శక్తి ప్రతినిధి, న్యూఢిల్లీ, జూలై 15:ధైర్యానికి నిలువెత్తు రూపం, సైద్ధాంతిక నిబద్ధతకు ప్రతిరూపం, అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి, శక్తిమంతునిగా నిరూపింతం చేసుకున్న వ్యక్తి, కేరళలోని కన్నూర్ కి చెందిన ప్రముఖ విద్యావేత్త, ఆరెస్సెస్ కార్యకర్త సదానందన్ మాస్టర్ ను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు. సామాజిక సేవలో నిత్యం ముందుండే సదానందన్...
Read More...
జాతీయం 

నేడు జాతీయ మత్స్య రైతుల దినోత్సవం

నేడు జాతీయ మత్స్య రైతుల దినోత్సవం 1957లో ఇదే రోజున హైపోఫిసేషన్ టెక్నిక్ ద్వారా భారతీయ మేజర్ కార్ప్స్ లో ప్రేరిత సంతానోత్పత్తి, పునరుత్పత్తికి మార్గనిర్దేశం చేసిన భారతీయ మత్స్య రంగ  ప్రొఫెసర్ డాక్టర్ హీరాలాల్ చౌదరి, ఆయన సహచరుడు డాక్టర్ కె.హెచ్.అలీకున్హి చేసిన కృషిని గౌరవించడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి జాతీయ మత్స్య పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (ఎన్ఎఫ్ఎఫ్ డి) జాతీయ చేపల రైతు దినోత్సవం నిర్వహిస్తోంది..
Read More...
జాతీయం 

PMEGP పథకం కింద దేశవ్యాప్తంగా..

PMEGP పథకం కింద దేశవ్యాప్తంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘స్వావలంబన మరియు అభివృద్ధి చెందిన భారతదేశం’ అనే దార్శనికతకు గుర్తింపు లభిస్తోందని, PMEGP పథకం దాని బలమైన పునాదిగా మారిందని అభిప్రాయపడ్డారు. ఈ పథకం కేవలం ఆర్థిక సహాయం అందించడానికే పరిమితం కాదని, లక్షలాది మంది యువత, మహిళలు మరియు చేతివృత్తుల వారిని స్వయంఉపాధి, వ్యవస్థాపకతతో అనుసంధానించే ఒక సామాజిక ఉద్యమంగా కూడా మారిందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రతి గ్రామంలోనూ ఉపాధి మరియు స్వావలంబనను సృష్టించడంలో ఈ పథకం పాత్ర గణనీయంగా ఉంది.
Read More...
జాతీయం 

బలప్రయోగంతో మాత మార్పిడి హింసాత్మక చర్య:డా. మోహన్ భగవత్

బలప్రయోగంతో మాత మార్పిడి హింసాత్మక చర్య:డా. మోహన్ భగవత్ నాగపూర్, ప్రత్యేక ప్రతినిధి, జూన్ 6: బలప్రయోగంతో మాత మార్పిడి హింసాత్మక చర్య బలప్రయోగంతో, ఒత్తిడిని ఉపయోగించి మత మార్పిడి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అది హింసాత్మక చర్య అని ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. నాగ్‌పూర్‌లో జరిగిన కార్యకర్త వికాస్ వర్గ్ ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తూ “మాత మార్పిడి హింస. ఇష్టానుసారం చేసినప్పుడు మేము దానిని వ్యతిరేకించడం లేదు. కానీ ఆకర్షించడం, బలవంతం చేయడం, ఒత్తిడి చేయడంకు మేము వ్యతిరేకం. వారి పూర్వీకులు తప్పు చేశారని ప్రజలకు చెప్పడం ద్వారా, అది వారిని అవమానించడమే. మేము అలాంటి పద్ధతులకు వ్యతిరేకం” అని ఆయన స్పష్టం చేశారు. “(మత మార్పిడికి వ్యతిరేకంగా పోరాటంలో) మేము మీతో ఉన్నాము” అని భగవత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గిరిజన నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అరవింద్ నేతమ్‌ను ఉద్దేశించి చెప్పారు. కాగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత రాజకీయ వర్గం పరస్పర అవగాహనను చూపించిందని, సమాజం ఐక్యత సందేశాన్ని ఇచ్చిందని డా. భగవత్ సంతోషం వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత రాజకీయ వర్గం ప్రదర్శించిన అవగాహన, తరువాత భారతదేశం తీసుకున్న చర్య కొనసాగాలని, శాశ్వత లక్షణంగా మారాలని ఆయన అభిలాషను వ్యక్తం చేశారు. “పహల్గాంలో ఒక క్రూరమైన దాడి జరిగింది. ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన పౌరులను చంపారు. అందరూ విచారంగా, కోపంగా ఉన్నారు. నేరస్థులకు శిక్ష విధించాలని కోరుకున్నారు. నిజంగానే చర్య తీసుకున్నారు” అని ప్రశంసించారు. “ఈ విషయంలో, మన సైన్యం సామర్థ్యం, ధైర్యం మరోసారి ప్రకాశించింది. రక్షణలో పరిశోధన ప్రభావం నిరూపించబడింది. ప్రభుత్వం, పరిపాలన దృఢత్వాన్ని మనమందరం చూశాము. అన్ని రాజకీయ పార్టీల అవగాహన, పరస్పర సహకారాన్ని కూడా మనం చూస్తున్నాము. అన్ని తేడాలను మరచిపోతాము. ఇది శాశ్వతంగా మారితే, సమస్యలు పాతబడుతున్న కొద్దీ మసకబారితే, అది దేశానికి గొప్ప ఉపశమనం కలిగిస్తుంది” అని సర్ సంఘచాలక్ తెలిపారు. “ఈ దేశభక్తి వాతావరణంలో మనం అన్ని తేడాలు, పోటీలను మరచిపోయినట్లుగా, ఈ ఆదర్శప్రాయమైన ప్రజాస్వామ్య దృశ్యం రాబోయే కాలంలో కూడా కొనసాగాలి. మనమందరం దీనిని కోరుకుంటున్నాము” అని ఆయన చెప్పారు. ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకుల ఊచకోత తర్వాత, ప్రజలు కోపంగా ఉన్నారు. దోషులను శిక్షించాలని కోరుకున్నారని గుర్తు చేశారు. ఆ చర్య తరువాత, భారత సాయుధ దళాలు పాకిస్తాన్, ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని, పొరుగు దేశంలోని వైమానిక స్థావరాలపై ప్రతీకార దాడులలో బాంబు దాడి చేసిన ఆపరేషన్ సిందూర్‌ను పరోక్షంగా ఆయన ప్రస్తావించారు. మే 7-10 తేదీలలో జరిగిన భారత్- పాకిస్తాన్ సైనిక సంఘర్షణను మరోసారి ప్రస్తావిస్తూ, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత తీసుకున్న చర్యలో దేశ నిర్ణయాధికారుల దృఢ సంకల్పాన్ని అందరూ చూశారని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ పేరు చెప్పకుండానే, భగవత్ మాట్లాడుతూ, “భారతదేశంతో ప్రత్యక్ష పోరాటంలో గెలవలేని వారు వెయ్యి కోతలు, పరోక్ష యుద్ధం అనే విధానం ద్వారా మన దేశాన్ని రక్తసిక్తం చేయాలనుకుంటున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, బ్రిటన్ లొంగిపోతుందని ఆశిస్తూ హిట్లర్ దాదాపు ఒక నెల పాటు లండన్‌పై బాంబు దాడి చేశాడని గుర్తు చేశారు. దీనికి ప్రతిస్పందనగా, ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించి, తరువాత పార్లమెంటుకు “బ్రిటిష్ వారు సముద్రాలలో,బీచ్‌లలో” పోరాడతారని చెప్పారు. ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, సమాజం నిజమైన సింహం అని చర్చిల్ చెప్పారని, దాని తరపున అతను కేవలం గర్జించాడని భగవత్ వ్యాఖ్యానించారు. ఒకరి లాభం కొన్నిసార్లు మరొకరికి నష్టాన్ని కలిగిస్తుందని, వ్యక్తుల మధ్య అవగాహన లేకపోవడం అసంతృప్తికి దారితీస్తుందని సర్ సంఘచాలక్ తెలిపారు. అయితే, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, ఏ సమూహం లేదా తరగతి మరొకరితో వివాదంలోకి రాకూడదని స్పష్టం చేశారు. ఉద్రేకంతో వ్యవహరించడం, అనవసర వాదనల్లో పాల్గొనడం లేదా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం దేశ ప్రయోజనాలకు మంచిది కాదని ఆయన హెచ్చరించారు. భారతదేశం స్వతంత్రంగా లేని సమయంలో (బ్రిటిష్) పాలకులు విభజనలను ప్రోత్సహించి, విధ్వంసక శక్తులకు మద్దతు ఇచ్చారని, సాధారణ ప్రజలు పోరాటాన్ని చేపట్టేలా బలవంతం చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే, నేడు ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పనిచేస్తుందని చెబుతూ, ఇటువంటప్పుడు దుర్వినియోగ భాష, అతిగా స్పందించకుండా ఉండాలని భగవత్ హితవు చెప్పారు. కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత లాభం కోసం రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారని పేర్కొన్నారు. “మన మూలాలు విభజనలో కాదు, ఐక్యతలో ఉన్నాయి” అని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు వేర్వేరు భాషలు మాట్లాడవచ్చు, విభిన్న ఆచారాలను అనుసరించవచ్చు, ఐక్యత అన్ని తేడాలకు అతీతంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. భారతీయులలో జాతి భేదాల ఆలోచన బ్రిటిష్ వలస పాలన ద్వారా పెంపొందించబడిన తప్పుడు భావన అని భగవత్ చెప్పారు.
Read More...
జాతీయం 

చైనా, పాక్ వైమానిక రక్షణ వ్యవస్థలు బ్రహ్మోస్ ముందు సరిపోవు : యూఎస్ యుద్ధరంగ నిపుణుడు

చైనా, పాక్ వైమానిక రక్షణ వ్యవస్థలు బ్రహ్మోస్ ముందు సరిపోవు : యూఎస్ యుద్ధరంగ నిపుణుడు న్యూఢిల్లీ, ప్రత్యేక ప్రతినిధి, మే 16: ఆపరేషన్ సిందూర్‌తో భారత్ పూర్తిగా పాకిస్తాన్‌పై ఆధిపత్యం చెలాయించిందని, యూఎస్ యుద్ధరంగ నిపుణుడు కల్నల్(రిటైర్డ్) జాన్ స్పెన్సర్ అన్నారు. భారత్ లోని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారతదేశం చేపట్టిన దాడి రక్షణాత్మక ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని అన్నారు. పాకిస్తాన్‌లోని ఏ ప్రదేశాన్ని అయినా ఎప్పుడైనా, ఎక్కడైనా ఢీ కొనగలమనే సందేశాన్ని ఈ ప్రపంచానికి భారత్ ఇచ్చినట్లైందని.. వివరించారు. పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ భారతదేశ బ్రహ్మోస్ క్షిపణులను తట్టుకోలేదని ఆయన చెప్పారు. పాకిస్తాన్ వ్యాప్తంగా దాడి చేయడంతో పాటు పాకిస్తాన్ డ్రోన్ దాడులు, హై స్పీడ్ క్షిపణులను.. భారత్ విజయవంతంగా ఎదుర్కొందని, తనను తాను రక్షించుకుందని స్పెన్సర్ తెలిపారు. మోడరన్ వార్ ఇన్స్టిట్యూట్‌లో అర్బన్ వార్‌ఫేర్ స్టడీస్ అధిపతిగా పనిచేస్తున్న స్పెన్సర్, పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ వైమానిక రక్షణ వ్యవస్థను బ్రహ్మోస్ విజయవంతంగా ఛేదించిందని.. ఇది భారత అధునాతన సైనిక సామర్థ్యాలకు నిదర్శనమని అన్నారు. గత వారం పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడగా.. భారత్ వీటిని సమర్థవంతంగా ఎదుర్కొందని.. ఆ తర్వాత శనివారం తెల్లవారుజామున భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో పాక్ వైమానిక స్థావరాలపై దాడులు చేసిందని స్పెన్సర్ వివరించారు. 11 స్థావరాలను ధ్వంసం చేసిందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్ సైన్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని.. ఈ ఘర్షణల సమయంలో భారత సమాచార వ్యాప్తి వ్యూహాన్ని ప్రశంసిస్తూనే, రాబోయే సంవత్సరాల్లో సైనిక వ్యూహాకర్తలు, విద్యార్థులు ఈ ఆపరేషన్‌ని అధ్యయనం చేస్తారని ఆయన అన్నారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ ను ప్రపంచం ఎండగట్టే సమయం ఆసన్నమైందని పశ్చిమ దేశాలు రెండు నాలుకల విధానాన్ని ఆపాలని కోరారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని స్పెన్సర్ గట్టిగా సమర్థించారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే విధానంపై.. పునరాలోచించుకునేలా చేయడంలో ఈ నిర్ణయం సహాయపడుతుందని అన్నారు.
Read More...
జాతీయం 

ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ , కాంగ్రెస్ లను “ఛీ” కొట్టారు: బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి

ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ , కాంగ్రెస్ లను “ఛీ” కొట్టారు: బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కరీంనగర్, ఫిబ్రవరి 8(భారత శక్తి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి చరిత్ర తిరగరాసిందని , 20 ఏళ్లకు ఢిల్లీ పీఠం పార్టీ కైవసం చేసుకుందని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి భారీ విజయం సాధించిన నేపథ్యంలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ లో స్విట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారని, చారిత్రకమైన తీర్పునిచ్చిన ఢిల్లీ ఓటర్లకు జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియచేశారు.. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం గట్టిగానే పనిచేసిందన్నారు. ఎన్నడూ లేనివిధంగా బీజేపీ కి దళిత, ఓబీసీ ఓటర్లు మద్దతు లభిచిందన్నారు.మరోవైపు ఆమ్‌ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయ కుట్రలను ఢిల్లీ ప్రజలు తిప్పి కొట్టారని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా దిగజారి పోయిందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జెండా ఎగురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు , ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు కన్నబోయిన ఓదెలు, కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు ,నాయకులు సాయిని మల్లేశం, దండు కొమురయ్య, పుప్పాల రఘు, లింగంపల్లి శంకర్, నాగసముద్రం ప్రవీణ్, సురేష్, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More...