వెబ్ స్టోరీస్
తెలంగాణ  వెబ్ స్టోరీస్ 

చదువు "కొంటున్నాం"

చదువు చదువుల తల్లిని బహిరంగ మార్కెట్ లో అమ్మేస్తున్న దౌర్భాగ్యం..  న్యాయస్థానాలు అక్షింతలు వేస్తున్నా ఏమాత్రం ప్రయోజనం లేదు..  అక్రమ విద్యా సంస్థలకు నోటీసులు ఇవ్వడం చేతులు దులుపుకోవడం..  అవినీతి అధికారుల అలసత్వం.. పేద విద్యార్థులకు శాపం..  ఉచితంగా నిర్బంధ విద్య అమలైనప్పుడే అందరికీ విద్య దొరుకుతుంది..  కేజీ టు పీజీ ఫ్రీ అంటూ ఊదరగొట్టడం తప్ప ఏపార్టీ ఏమీ చేసింది లేదు..  కార్పొరేట్ స్కూళ్లకు, విద్యాసంస్థలకు దాసోహం అంటున్న ప్రభుత్వాలు..  పరిపాలనలో భాగస్వాములవుతున్న కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు..  ప్రైవేట్ విద్యా సంస్థల్లో సెక్షన్ 12(1)(సి) ఎందుకు అమలవ్వడం లేదు..? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది..?  పేద విద్యార్థులు చదువుకోకూడదా..? ఉన్నత స్థానానికి చేరకూడదా..?  విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు పోరాటం సాగిస్తున్న ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ..  దేశంలో ఉచితాలు అవసరం లేదు.. ఉచితాలు అనుచితం అంటూ మేధావులు చెబుతూనే ఉన్నారు.. ఉచితాలనే తాయిలాలు పంచుతూ  పబ్బం గడుపుకుంటున్నాయి ప్రభుత్వాలు.. ఉచితాలతో సోమరిపోతులను చేస్తున్నారు.. నిజానికి దేశంలో ఉచితంగా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే రెండే రెండు.. అవి విద్య, వైద్యం.. దురదృష్టం ఏమిటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండే చాలా ఖరీదైనవిగా మారిపోయాయి.. ఎందుకంటే ఇవి పెద్ద వ్యాపార వస్తువులుగా మార్చేశారు.. మార్కెట్ ను షేక్ చేస్తున్నారు.. ఎలాంటి చట్టాలు వీరికి వర్తించవు.. వీరికి ఎలాంటి నిజాయితీ ఉండదు.. కేవలం ధన వ్యామోహం తప్ప.. పేద విద్యార్థులు విద్యావంతులైతే తమ మనుగడకే ప్రమాదం అని తలస్తున్న బడా నాయకులు ఆడుతున్న ఆట ఇది.. ఈ పద్ధతి మారాలి.. విద్య అందరికీ అందాలి..  
Read More...
వెబ్ స్టోరీస్ 

కలకలం రేపుతున్న శర్మిష్ట బుక్‌..

కలకలం రేపుతున్న శర్మిష్ట బుక్‌.. ప్రణబ్‌ ముఖర్జీ జీవితంపై ఆయన కూతురు శర్మిష్ఠ రాసిన పుస్తకం జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తాను ప్రధాని కాకుండా సోనియాగాంధీ అడ్డుపడ్డినట్లు ప్రణబ్‌ ముఖర్జీ తనతో చెప్పారని షర్మిష్ఠ ఈ పుస్తకంలో రాశారు. పదవినే ఆశించనపుడు, అసంతృప్తే ఉండదని తన తండ్రి చెప్పినట్లు షర్మిష్ట రాశారు.. అలాగే రాహుల్‌గాంధీ రాజకీయంగా పరిణతి చెందలేదనీ, ఆయన పార్లమెంటుకు రెగ్యులర్‌గా రాకపోవడంపై తన తండ్రికి నచ్చకపోయేదన్నారు.దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, తన తండ్రికి గురించిన విషయాలతో ఆయన కూతురు శర్మిష్ట ముఖర్జీ పుస్తకం రాశారు. ప్రణబ్‌ డైరీ, ఆయన తనతో చెప్పిన విషయాల ఆధారంగా శర్మిష్ట ముఖర్జీ ‘ఇన్‌ ప్రణబ్‌, మై ఫాదర్‌: ఏ డాటర్‌ రిమెంబర్స్‌’ బుక్‌లో కీలక విషయాలు వెల్లడిరచారు. ఈ పుస్తకంలోని విషయాలు ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గురించి తన తండ్రికి ఉన్న అభిప్రాయాలను పంచుకున్నారు. రాహుల్‌ గాంధీకి నెహ్రూ`గాంధీ అహంకారం వచ్చినప్పటికీ, వారి రాజకీయ చతురత రాలేదని పేర్కొన్నట్లు ప్రణబ్‌ కూతురు వెల్లడిరచారు. ఆయనకు రాజకీయ పరిపక్వత లేదని డైరీలో రాసుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ గురించి శర్మిష్ట ముఖర్జీ సంచలన విషయాలు వెల్లడిరచారు. ప్రణబ్‌ ముఖర్జీకి, మోడీకి ఉన్న సంబంధాల గురించి వెల్లడిరచారు. ప్రధాని మోడీతో, ప్రణబ్‌ ముఖర్జీకి విచిత్రమై సంబంధం ఉందని, మోడీ ఎప్పుడూ ప్రణబ్‌ ముఖర్జీ కాళ్లకు నిజాయితీతో నమస్కరించేవారని చెప్పారు.ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంలో తన విధులు, బాధ్యతల గురించి స్పష్టంగా ఉండేవారని, మోడీ, తన తండ్రి వేర్వేరు సిద్ధాంతాలకు చెందిన వారైనప్పటికీ, పాలనలో తాను జోక్యం చేసుకోనని చెప్పినట్లు ఆమె వెల్లడిరచారు. మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రి కాకముందు నుంచి వీరిద్దరి మధ్య సంబంధం ఉండేదని ఆమె తెలిపారు.ప్రధాని మోడీ అప్పడు ఒక సాధారణ పార్టీ కార్యకర్తగా వివిధ కార్యకలాపాల కోసం ఢల్లీికి వచ్చేవాడినని, ఉదయం ప్రణబ్‌ ముఖర్జీ మార్నింగ్‌ వాక్‌ వెళ్లే సమయంలో కలిసే వాడినని, తాను ఎల్లప్పుడు ప్రణమ్‌ పాదాలకు నమస్కరించేవాడిని’’ అని ప్రధాని మోడీ చెప్పారని శర్మిష్ట అన్నారు. ప్రణబ్‌ డైరీలో ఇది ఓ ఆసక్తికరమైన విషయమని అనుకున్నానని చెప్పారు.గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న సమయంలో రాష్ట్రపతిని కలిసేందుకు వచ్చినప్పుడు ప్రణబ్‌ ముఖర్జీ కీలక విషయాన్ని వెల్లడిరచారు. ‘ అతను కాంగ్రెస్‌ ప్రభుత్వం, దాని విధానాలపై తీవ్ర విమర్శకుడు, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడూ నా పాదాలను తాకుతాడు, ఇది తనకు ఆనందాన్ని ఇస్తుంది, ఎందుకో నాకు అర్థం కాదు’ అని ప్రణబ్‌ ముఖర్జీ రాశారని శర్మిష్ట చెప్పారు.రాష్ట్రపతి, ప్రధాన మంత్రి సంబంధాలు కేవలం వ్యక్తిగత సంబంధంపై నిర్మించబడలేదని, రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రభుత్వంలో జోక్యం చేసుకోకుండా ఉండాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని ప్రణబ్‌ విశ్వసించారని ఆయన కూతురు తెలిపారు. ప్రజలు విూకు అధికారం ఇచ్చారని, విూ పాలనలో జోక్యం చేసుకోనని, కానీ ఏదైనా రాజ్యాంగపరమైన విషయంలో సాయం కావాలంటే నేను ఉంటానని ప్రణబ్‌ చెప్పినట్లు మోడీ తనతో వెల్లడిరచారని శర్మిష్ట తెలిపారు. 2009 సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. తాను సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలం కాదని చెప్పిన ఘటనను తన తండ్రి డైరీలో పేర్కొన్నారని ఆమె వెల్లడిరచారు. 2004`2014 వరకు ప్రణబ్‌, రాహుల్‌ గాంధీల మధ్య పెద్దగా కలుసుకోలేదని వెల్లడిరచారు. ‘‘రాహుల్‌ చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు, అనేక ప్రశ్నలు అడుగుతారు, కానీ రాజకీయాల్లో ఆయన పరిణతి సాధించలేదు, 2013 జూలైలో ఓసారి మా ఇంటికి వస్తే ముందుగా కేబినెట్‌లో చేరి అనుభవం తెచ్చుకోవాలని చెప్పానని, అయితే ఆయన నా సలహాను వినిపించుకోలేదు.’’ అని ప్రణబ్‌ డైరీలో రాసుకున్నారు.రాహుల్‌ గాంధీ రాజకీయ భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వంటి దోషులను కాపాడేందుకు 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ని కాంగ్రెస్‌ అధినేతగా ఉన్న రాహుల్‌ గాంధీ చింపేసి చెత్తబుట్టలో పడేసిన తీరుపై ప్రణబ్‌ ముఖర్జీ కలత చెందినట్లు శర్మిష్ట ముఖర్జీ అన్నారు. రాహుల్‌ గాంధీ రాజకీయంగా పరిపక్వతతో లేరని తన తండ్రి చెప్పినట్లు వెల్లడిరచారు. అతను అవగాహన లేకుండా ఉన్నారని ప్రణబ్‌ భావించారని ఆమె తెలిపారు. గాంధీ`నెహ్రూల అహంకారమంతా రాహుల్‌ గాంధీకి వచ్చింది, కానీ వారి రాజకీయ చతురతే ఆయనకు అబ్బలేదని డైరీలో రాసుకున్నారని పుస్తకంలో పేర్కొన్నారు.2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరపరాజయం తర్వాత రాహుల్‌ గాంధీ తరుచుగా పార్లమెంట్‌కి గైర్హాజరు కావడం పట్ల ప్రణబ్‌ ముఖర్జీ అసంతృప్తితో ఉండేవారని శర్మిష్ట తెలిపారు. సోనియాగాంధీని ప్రధాని చేయాలనే ఆశలు తనకు లేవని ప్రణబ్‌ ఓ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని ఆమె చెప్పారు. 2004లో సోనియాగాంధీ ప్రధాని పీఠం వద్దన్న తర్వాత తన తండ్రి ప్రణబ్‌తో పాటు మన్మోహన్‌ సింగ్‌ పేర్లు వినిపించాయని, ప్రధాని మంత్రి పదవి వద్దని, మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని అవుతారని తనకు చెప్పినట్లు తన తండ్రి చెప్పినట్లు శర్మిష్ట తెలిపారు.
Read More...
వెబ్ స్టోరీస్ 

విలవిలలాడిన చెన్నై…

విలవిలలాడిన చెన్నై… మిచౌంగ్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘మిగ్జామ్‌’ తుపాను చెన్నై నగరంలో వర్ష బీభత్సం సృష్టించింది. అతి భారీ వర్షాలతో చెన్నై పూర్తిగా జలమయం అయింది. నగరంలో ఎటు చూసినా నీరే. దీనిపై తమిళనాడు పురపాలక శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ స్పందించారు. నగరంలో గత 70`80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసిందని వెల్లడిరచారు. తనకు తెలిసినంతవరకు చెన్నై ఇంతటి భారీ వర్షాలను ఎప్పుడూ ఎదుర్కోలేదని తెలిపారు. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ, తుపాను తీవ్రత దృష్ట్యా ఆ చర్యలు సరిపోలేదని వెల్లడిరచారు. తుపాను విలయం ముందు తమ యంత్రాంగం విఫలమైందని కేఎన్‌ నెహ్రూ అంగీకరించారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ద్వారా 3 లక్షల మందికి ఆహారం అందిస్తున్నట్టు తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు బోట్లు పంపించామని చెప్పారు. సహాయ చర్యల కోసం 5 వేల మంది సిబ్బందిని ఇతర జిల్లాల నుంచి రప్పించామని వెల్లడిరచారు. కాగా, చెన్నైలో కుండపోత వానలు కురుస్తుండడంతో విమానాశ్రయంలోకి నీళ్లు ప్రవేశించాయి. దాంతో మూడు విమానాలను బెంగళూరుకు మళ్లించారు. వరద నీరు ప్రవేశించడంతో 14 రైల్వే సబ్‌ వేలను అధికారులు మూసివేశారు. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. తాంబరంలో నీటిలో చిక్కుకుపోయిన 15 మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి. తుపాను కారణంగా నగరంలోని కోర్టులకు సెలవు ఇచ్చినట్టు మద్రాస్‌ హైకోర్టు ప్రకటించింది. అటు, చెంగల్పట్టు, తిరువళ్లూర్‌, కాంచీపురం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయిభారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడుపై తుఫాన్‌ ప్రభావం ఓ రేంజ్‌లో ఉంది. ముఖ్యంగా చెన్నై నగరం చిగురుటాకులా వణికిపోతోంది. చెన్నైలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది.భారీ వర్షాల కారణంగా చెన్నై అంధకారంగా మారింది. భారీ వర్షాల కారణంగా 8 మంది మృతి చెందారు. చెన్నై సహా తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టులో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. అత్యధికంగా ఆవడి ప్రాంతంలో 30 సెం.విూ వర్షపాతం కురిసింది. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా సబ్‌వేలు మూసివేశారు. నిత్యవసర సరకుల కోసం జనం ఇక్కట్లు పడుతున్నారు. సహాయక చర్యలు కోసం సైన్యం రంగంలోకి దిగింది.మిచౌంగ్‌ తుఫాన్‌ దెబ్బకు చెన్నై అతలాకుతలమైంది. నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల వీధుల్లోకి భారీగా వరద నీరు చేరి పలు కార్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. పలు కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఇక చెంగల్పట్టులోని పలు ప్రాంతాలపై భారీ వర్షం, సముద్రపు గాలులు తీవ్రమైన ప్రభావం చూపుతోంది.చెన్నైలో పలు సబ్‌వేలను మూసేశారు. నీటి ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి.ఎన్డీఆర్‌ఎఫ్‌ , ఎస్డీఆరెఫ్‌ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి..ఇప్పటివరకూ 300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు..ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఇక భారీ వర్షానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.మే 9`15 మధ్య వచ్చిన మోచా తుపాను చైనా, బంగ్లాదేశ్‌, భారత్‌, శ్రీలంకను వణికించేసింది. 1.5 బిలియన్ల ఆస్తి నష్టం సంభవించగా 463 మంది మృత్యువాత పడ్డారు. జూన్‌ 6`19 మధ్య వచ్చిన బిపర్‌జాయ్‌ తుపాను కూడా అదే స్థాయి నష్టాన్ని మిగిల్చింది. ఇది ఇండియా పాకిస్థాన్‌పై ఎక్కువ ప్రభావం చూపించింది. 124 మిలియన్ల రూపాయల ఆస్తినష్టం సంభంవించగా 17 మంది చనిపోయారు. తేజ్‌ పేరుతో అక్టోబర్‌లో 20`24 మధ్య వచ్చిన తుపాను ఒమన్‌, యెమెన్‌ దేశాల్లో చాలా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.అక్టోబర్‌ 21`25 మధ్య బంగ్లాదేశ్‌, పశ్చిమబెంగాల్‌, మిజోరాంలో భయంకరమైన తుపాను వచ్చింది. దీని కారణంగా 567 మిలియన్ల రూపాయల నష్టం వాటిల్లింది. 17 మంది మృత్యువాత పడ్డారు. అదే ప్రాంతాన్ని కవర్‌ చేస్తూ నవంబర్‌ 14`18 మధ్య మిథిలి అనే పేరుతో తుపాను బీభత్సం సృష్టించింది. 276 మిలియన్ల ఆస్తి నష్టం జరగ్గా ఏడుగురు చనిపోయారు. ప్రస్తుతం మిగ్‌జాం పేరుతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకొని తుపాను కొనసాగుతోంది. ఇది ఎంత నష్టాన్ని మిగులుస్తుందో అధికారులు అంచనా వేయలేకపోతున్నారు.
Read More...
వెబ్ స్టోరీస్ 

నేడు అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం

నేడు అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 7 డిసెంబర్‌ 2013 నాటి నుండి ప్రపంచవ్యాప్తంగా సామాజిక, ఆర్థికాభివృద్ధి కొరకు పౌర విమానయానం యొక్క ప్రాముఖ్యతను హైలైట్‌ చేయాలనే లక్ష్యంతో జరుపుకుంటారు. వాయు రవాణా యొక్క భద్రత మరియు సమర్థతను ప్రోత్సహించడానికి మరియు వాయు రవాణాలో అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ యొక్క పాత్రగురించి అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం జరుపుకుంటారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసిఏఓ) ఇంటర్నేషనల్‌ ఫర్‌ ఏవియేషన్‌ సేఫ్టీ ప్రమాణాలను అభివృద్ధి చేసే బాధ్యత ఐక్యరాజ్యసమితిపై ఉంది. ప్రతి సంవత్సరం 7 డిసెంబరు న అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం జరుపుకుంటారు. 1944లో చికాగోలో ఈ రోజు అంతర్జాతీయ పౌర విమానయాన ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థకు సంబంధించిన వాస్తవాలు:1. పౌర విమానయానంలో అంతర్జాతీయ సహకారం మరియు ఏకరూపతను సాధించడానికి 7 డిసెంబరు 1944న అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ స్థాపించబడిరది. 2. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక కారణం సామాజిక మరియు ఆర్థికాభివృద్ధిలో అంతర్జాతీయ పౌర విమానయానం యొక్క ప్రాముఖ్యతగురించి ప్రపంచ అవగాహన ను ఉత్పత్తి చేయడం మరియు బలోపేతం చేయడం, అలాగే అంతర్జాతీయ వాయు రవాణా యొక్క భద్రత, సమర్థత మరియు క్రమతను పెంపొందించడం. 3.1996 లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ యొక్క ఐసిఏఓ చొరవ మరియు కెనడా ప్రభుత్వ సహకారంతో, డిసెంబర్‌ 7ను అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవంగా ప్రకటించబడిరది. 4. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రపంచ వాతావరణ సంస్థ, ఇంటర్నేషనల్‌ టెలికమ్యూనికేషన్స్‌ యూనియన్‌, యూనివర్సల్‌ పోస్టల్‌ యూనియన్‌, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ మరియు ఇంటర్నేషనల్‌ మారిటైమ్‌ ఆర్గనైజేషన్‌ తో సహా ఇతర యుఎన్‌ సభ్యులతో కలిసి పనిచేస్తుంది.
Read More...
వెబ్ స్టోరీస్ 

నేడు అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం

నేడు అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం (వాలంటీర్స్‌ దినోత్సవం) ప్రతి సంవత్సరం డిసెంబరు 5వ తేదీన నిర్వహించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధిలకు మద్దతుగా వాలంటీరిజాన్ని మెరుగుపరచడంతోపాటు… కష్టాల్లో ఉన్నవారిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా రక్షించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారందరి సేవను గుర్తించుకునేందుకు ఈ దినోత్సవం జరుపబడుతుంది. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 1985, డిసెంబర్‌ 17 తేదీన చేసిన 40/212 తీర్మానంలో ప్రతి సంవత్సరం డిసెంబరు 5వ తేదీన స్వచ్ఛంద దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితి ఇందులో కీలకపాత్ర పోషిస్తుండగా, రెడ్‌క్రాస్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, వంటి అనేక ఎన్‌జిఒ సంస్థలు ఈ స్వచ్ఛంద సేవకు తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి. దాదాపు 130 దేశాల్లో 86 ఫీల్డ్‌యూనిట్లతో ఐక్యరాజ్య సమితి వాలంటీర్ల సంఘం ఏర్పాటయింది. ఐక్యరాజ్య సమితి గుర్తించిన 7700 మంది వాలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా అక్కడికి వెళ్ళి సేవలను అందిస్తారు. అంతేకాకుండా 2000వ సంవత్సరం నుండి ఐక్యరాజ్య సమితి ఆన్‌లైన్‌ వాలంటీర్ల విభాగం కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విభాగంలో ఫ్రెంచ్‌, స్పానిష్‌, ఇంగ్లీషు భాషల్లో ఆన్‌లైన్‌లో సేవలందించే వాలంటీర్లు పనిచేస్తారు. ఐక్యరాజ్య సమితి 1997, నవంబరు 20వ తేదీన జరిపిన జనరల్‌ అసెంబ్లీలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ కు జపాన్‌ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన మేరకు 52/17 తీర్మానంతో 2001వ సంవత్సరం అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవంగా ప్రకటించబడిరది. 13కూలిన వైమానిక శిక్షణా విమానం మెదక్‌ మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మున్సిపాలిటీ పరిధి రావెల్లి శివారులో దుండిగల్‌ ఎయిర్పోర్ట్‌ కు సంబంధించిన శిక్షణ విమానం సోమవారం తెల్లవారుజామున కూలిపోయింది. కూలిపోయిన విమానం పూర్తిగా కాలిపోవడంతో అందులో ఎంతమంది ఉన్నారు అన్న విషయం ఇంకా తెలియడం లేదు
Read More...
వెబ్ స్టోరీస్ 

జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు, నల్లజాతి సూరీడు, భారతరత్న నెల్సన్‌ మండేలా

జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు, నల్లజాతి సూరీడు, భారతరత్న  నెల్సన్‌ మండేలా జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాలపాటు ‘‘రోబెన్‌’’ అనే ద్వీపంలో జైలు శిక్షను అనుభవించిన మండేలా, 20వ శతాబ్దపు అత్యంత సుప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. దీంతో ఆయన, జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు, వర్ణ సమానతకు ఒక సంకేతంలాగా నిలిచారు. జీవిత వివరాలను చూస్తే… నెల్సన్‌ రోలిహ్లాహ్లా మండేలా, దక్షిణాఫ్రికా దేశ మాజీ అధ్యక్షుడు. కేప్‌ ప్రాంతంలోని ఉమటా జిల్లా, మవెజో అనే ఊర్లో 1918, జూలై 18వ తేదీన ఈయన జన్మించారు. దక్షిణాఫ్రికాకు పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడిగా ఈయన కీర్తి గడిరచారు. అధ్యక్షుడు కాకమునుపు ఇతను జాతి వివక్ష వ్యతిరేఖ ఉద్యమకారుడిగా, ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు, దానికి సాయుధ విభాగం అయిన ‘‘ఉంకోంటో విసిజ్వే’’కు అధ్యక్షుడిగా పనిజేశారు.ఫిబ్రవరి 11, 1990లో జైలునుండి విడుదల అయిన తరువాత నెల్సన్‌ మండేలా రాజకీయంగా తన లక్ష్యాన్ని సాధించడానికి, దేశంలో నెలకొన్న జాతి వైర్యాన్ని నివారించడానికి, అందరి మధ్య సయోధ్య పెంచడానికి కృషి చేశారు. తన పూర్వపు శత్రువులనుండి కూడా ప్రశంసలు అందుకొన్నారు. వందకు పైగా అవార్డులు, సత్కారాలతో వివిధ దేశాలు, సంస్థలు ఈయనను గౌరవించాయి. వాటిలో 1993లో లభించిన నోబెల్‌ శాంతి బహుమతి ముఖ్యమైనది. స్వదేశంలో మండేలాను ‘‘మదిబా’’ అని వారి తెగకు సంబంధించిన గౌరవసూచకంతో పిలుస్తుంటారు.జాతిపిత మహాత్మా గాంధీ బోధించిన శాంతియుత విధానాలు, అహింస, శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కొనే పద్ధతి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మండేలా చాలాసార్లు వెల్లడిరచారు. భారత దేశం కూడా మండేలాను ‘‘జవహర్‌లాల్‌ నెహ్రూ అంతర్జాతీయ సయోధ్య బహుమతి’’తో సత్కరించింది.అలాగే… 1990లో భారత ప్రభుత్వం మండేలాకు మనదేశపు అత్యున్నత పురస్కారం అయిన భారతరత్నను ప్రకటించింది. మన దేశం నుంచి ఆయనకు ఎంతో గౌరవం లభించిందన్న దానికి నిదర్శనంగా అనేక విగ్రహాలు కూడా చాలాచోట్ల నెలకొల్పబడ్డాయి. కొన్ని కూడళ్ళకు, రోడ్లకు మండేలా పేరు పెట్టారు. ఢల్లీిలో కూడా ఆయన పేరుతో ఒక ‘‘నెల్సన్‌ మండేలా రోడ్‌’’ ఉంది.అదలా ఉంచితే… 1994లో మండేలా తన 77 సంవత్సరాల వయసులో అధ్యక్ష పదవిని చేబట్టి ఆ పదవిని అలంకరించిన వారిలో అతి పెద్ద వయస్కుడయ్యారు. రెండవసారి మరలా ఎన్నికల్లో పోటీ చేయరాదని నిశ్చయించుకున్న ఆయన, 1999లో పదవీ విరమణ చేశారు. జూలై 2001లో ఆయనకు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, రేడియేషన్‌ వైద్యం చేశారు.తన పదవీ విరమణ తరువాత ఎయిడ్స్‌ వ్యాధి నివారణకు మండేలా విశేషంగా కృషి చేశారు. ఆ తరువాత జూన్‌ 2004లో తాను రాజకీయ జీవితం నుండి విరమించుకుని, అధికంగా కుటుంబంతో గడపాలని అనుకుంటున్నట్లు మండేలా ప్రకటించారు. అయితే ఆయన పూర్తిగా సమాజం నుంచి దూరం కాలేదుగానీ, 2003 తరువాత తన సాంఘిక కార్యక్రమాలను బాగా తగ్గించుకున్నారంతే..!కొంత కాలంగా తీవ్ర శ్వాసకోశ సంబంధ అస్వస్థతతో బాధపడుతూ 2013 డిసెంబర్‌ 5 న 20:50 (దక్షిణాఫ్రికా ప్రాంతీయ సమయం) కగంటలకు జోహెన్స్‌ బర్గ్‌ లో మరణించారు. వివిధ దేశాలనుండి సుమారుగా 90 మంది ప్రతినిధులు ఆయన అంత్యక్రియలకు హాజరు అయ్యారు.
Read More...
వెబ్ స్టోరీస్ 

మళ్లీ తెరపైకి ఇండియా కూటమి

మళ్లీ తెరపైకి ఇండియా కూటమి కేంద్రంలో రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఈసారి ఆ దూకుడుకి కళ్లెం వేయాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది కాంగ్రెస్‌. అందుకే ఎన్డీయేకి దీటుగా ఇం.డి.యా పేరుతో కూటమిని ఏర్పాటు చేసింది. అన్ని పార్టీలనూ సమన్వయం చేసుకుంది. ప్రస్తుతం ఈ కూటమిలో దాదాపు 26 పార్టీలున్నాయి. కాంగ్రెస్‌తో సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ బీజేపీని ఓడిరచాలన్న లక్ష్యంతో కొన్ని పార్టీలు కలిసొచ్చాయి. ఈ కూటమి పెట్టనైతే పెట్టారు కానీ అప్పటి నుంచి అంతా సైలెంట్‌ అయిపోయింది. కూటమి ఏర్పాటైన కొద్ది రోజులకే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. కాంగ్రెస్‌ వెంటనే అప్రమత్తమైంది. పూర్తిగా ఈ అసెంబ్లీ ఎన్నికలపైనే ఫోకస్‌ పెట్టింది. కూటమి సంగతి తరవాత చూసుకుందామని వదిలేసింది. తరవాత ఎన్నికలు పూర్తయ్యాయి. నాలుగు రాష్ట్రాల ఫలితాలూ విడుదలయ్యాయి. వీటిలో తెలంగాణ మినహా మిగతా మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కి ఎదురు దెబ్బే తగిలింది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ హవానే కొనసాగింది. ఉత్తరాదిన పూర్తిగా పట్టు కోల్పోయింది కాంగ్రెస్‌ పార్టీ. సౌత్‌లో మాత్రం కర్ణాటక, తెలంగాణను తమ ఖాతాలో వేసుకుంది. ఇది కొంత వరకూ ఊరటనిచ్చినప్పటికీ…నార్త్‌ బెల్ట్‌ని కోల్పోవడం మాత్రం పెద్ద దెబ్బే. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఫలితాలు బీజేపీ జోష్‌ని రెట్టింపు చేయగా…కాంగ్రెస్‌ని నిరాశపరిచింది. తెలంగాణ ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయమే. కానీ…ఉత్తరాదిలో పార్టీ ఉనికి ప్రమాదంలో పడిరది. ఈ సమయంలోనే ఇం.డి.యా కూటమి భవిష్యత్‌ ఏంటన్నదే అంతుపట్టకుండా ఉంది. విపక్ష కూటమికి నేతృత్వం వహించే బాధ్యతను కాంగ్రెస్‌ తీసుకుంటుందన్న అధికారిక ప్రకటన ఏవిూ రాలేదు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కన్వీనర్‌గా ఉంటారన్న వార్తలు అప్పట్లో బాగానే వచ్చాయి. కానీ…ఆ పదవిపై పెద్దగా ఆసక్తి లేదని తేల్చి చెప్పారు నితీశ్‌. నితీశ్‌ తరవాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కీలకంగా వ్యవహరించారు. విపక్ష పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపారు. అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు తన ప్రయత్నం తాను చేశారు. ఇదే సమయంలో 5 రాష్ట్రాల ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ముందు రాష్ట్రాల్లో గెలిస్తే ఆ తరవాత లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టొచ్చని భావించారు. కాంగ్రెస్‌ దృష్టి పెట్టినప్పటికీ కొన్ని సమస్యల కారణంగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌ విపక్ష కూటమిని లీడ్‌ చేయగలుగుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. లోక్‌సభ ఎన్నికల స్ట్రాటెజీలు వేరు అని అంత సులువుగా కొట్టిపారేయలేం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం కచ్చితంగా లోక్‌సభ ఎన్నికలపై ఉంటుంది. ఇదే కాంగ్రెస్‌ని ఇరకాటంలోకి నెట్టింది. కాంగ్రెస్‌ ఓడిపోవడంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన కామెంట్స్‌ని బట్టి చూస్తుంటే కూటమిలో చీలికలు మొదలవుతాయా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో ఓడిపోవడం బీజేపీ సక్సెస్‌ కాదని, కాంగ్రెస్‌ వైఫల్యమే అని తేల్చి చెబుతోంది టీఎమ్‌సీ. జనతా దళ్‌ నేతలూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్‌ ఓడిపోవడం అంటే విపక్ష కూటమి ఓడిపోయినట్టు కాదు’’ అని స్పష్టం చేస్తున్నారు. బీజేపీని కాంగ్రెస్‌ ఢీకొట్టలేదని, ఆ భ్రమ నుంచి ఆ పార్టీ బయటకు రావాలని కొందరు విపక్ష నేతలు నేరుగానే చెబుతున్నారు. డిసెంబర్‌ 6వ తేదీన ఖర్గే నివాసంలో ఇం.డి.యా కూటమి సమావేశం కానుంది. ఈ భేటీకి కొందరు నేతలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. శరద్‌ పవార్‌ కూడా చాలా క్లియర్‌గా ఓ విషయం వెల్లడిరచారు. ఈ ఫలితాలేవ విపక్ష కూటమిపై ప్రభావం చూపించలేవని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పుంజుకోవడాన్ని మాత్రం విపక్షాలు స్వాగతిస్తున్నాయి. ఇది కచ్చితంగా ఆ పార్టీకి మంచి జోష్‌ ఇస్తుందని చెబుతున్నాయి. అయితే…మిగతా మూడు రాష్ట్రాల్లో ఓటమిపై మాత్రం విపక్ష పార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. కూటమి వ్యూహాలను మార్చాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నాయి. అంతే కాదు. అసలు కూటమిలో కొనసాగాలా వద్దా అని పునరాలోచనలో పడ్డట్టూ సమాచారం. ఇందులో నిజమెంత అన్నది మాత్రం స్పష్టత లేదు. ముఖ్యంగా సీట్‌ల షేరింగ్‌ విషయంలో కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసే పరిస్థితి ఉండదు. మిగతా పార్టీలు ఏం చెబితే అది వినాల్సి వస్తుంది. లేదా పూర్తిగా కూటమే కూలిపోయే ప్రమాదం లేకపోలేదు. ప్రతి పార్టీ తమ ఓటు బేస్‌ని వదులుకునేందుకు ఇష్టపడదు. ఆప్‌, టీఎమ్‌సీ సహా మరి కొన్ని పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించే అవకాశాలు తక్కువే. ఢల్లీి, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లో సీట్‌ షేరింగ్‌ విషయంలో విభేదాలు తలెత్తే అవకాశాలున్నాయి. ఈ విభేదాలు ఫైనల్‌గా బీజేపీకే ప్లస్‌ అవుతాయి. వాళ్లలో వాళ్లకే సఖ్యత లేదని ఇప్పటికే బీజేపీ ప్రచారం చేస్తోంది. నాయకత్వ లోపమూ విపక్ష కూటమిని ఇబ్బందుల్లో పెడుతోంది. కాంగ్రెస్‌లోనే అంతర్గతంగా ఈ విషయంలో సఖ్యత కుదరకపోవచ్చు కూడా. తమ ఓటు బ్యాంకునీ కాపాడుకోవడంలో నానా అవస్థలు పడుతోంది ఈ పార్టీ. ఇలాంటి సమయంలో సరైన నాయకత్వం లేకపోతే మరింత చతికిలబడి పోవడం ఖాయం. కానీ బీజేపీకి ఈ సమస్యలేదు. బలమైన నాయకత్వమే ఆ పార్టీని ముందుకు నడిపిస్తోంది. కూటమిలో చీలికలు వస్తాయని జోస్యం చెబుతున్నారు బీజేపీ నేతలు. అసలే సమస్యలతో సతమతం అవుతున్న కాంగ్రెస్‌ని మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే కాంగ్రెస్‌ పరిస్థితి చాలా వరకూ మారిపోయేది. కానీ…తెలంగాణలో గెలిచామన్న సంతోషం తప్ప మరేవిూ మిగల్లేదు. ఇప్పటికే బీజేపీ బలపడుతోంది. కాంగ్రెస్‌ ఓటమి బీజేపీకి చాలా ప్లస్‌ అవుతుంది. సీట్ల సంఖ్యని మరింత పెంచే అవకాశాలూ ఉన్నాయి. కాంగ్రెస్‌ భవిష్యత్‌ని నిర్ణయించనున్న ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి జోష్‌ ఇస్తాయనుకుంటే ఉన్న జోరునీ తగ్గించాయి. ఇప్పటి నుంచి ఈ పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. భారత్‌ జోడో యాత్రతో కొంత క్యాడర్‌లో జోష్‌ పెరిగిందని భావించినా…అది ఎంతో కాలం కొనసాగేలా లేదు.
Read More...
వెబ్ స్టోరీస్ 

ఎగ్జిట్‌ పోల్స్‌… ఖచ్చితత్వం ఎంత

ఎగ్జిట్‌ పోల్స్‌… ఖచ్చితత్వం ఎంత దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం పోలింగ్‌ పూర్తౌెంది. తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అలా కాదు. పోలింగ్‌ రోజే ఓటరు మనోగతం తెలుసుకుంటూ సర్వే నిర్వహిస్తారు. ఎంపిక చేసుకున్న కొన్ని పోలింగ్‌ కేంద్రల వద్ద ఓట్ల నాడీని తెలుసుకుని ఒక అంచనాకు వస్తారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో సేకరించిన సమాచారంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో లెక్కకడతారు. ప్రీపోల్‌ సర్వేలో ఎవరిని ప్రశ్నించాలనేది నిర్వాహకులు ముందే నిర్ణయించుకుంటారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, కులం, మతం, పేదలు, మధ్యతరగతి ఇలా వివిధ వర్గాల వారీగా ఓటర్లను ఎంచుకొని సర్వే చేస్తారు. కానీ ఎగ్జిట్‌పోల్‌లో అలా కాదు. పోలింగ్‌ రోజే, ఓటు వేసేందుకు వచ్చే వారిని మాత్రమే ప్రశ్నించి సమాచారం సేకరిస్తారు.సాధారణంగా పోలింగ్‌ పూర్తౌెన వెంటనే అందరి దృష్టి ఎగ్జిట్‌ పోల్స్‌ వైపు మళ్లుతుంది. ఎలక్షన్లకు ముందు వివిధ సంస్థల సర్వేలు హడావిడి చేస్తే, పోలింగ్‌ ముగిశాక ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు హీట్‌ పెంచుతుంటాయి. ఏపార్టీకి ఓట్లు ఎక్కవగా పోలయ్యాయి. ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు. విజయం ఎవరిని వరించనుంది. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌ గురించి అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో అసలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంటే ఏంటి? వాటిని ఎలా నిర్వహిస్తారు ? ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పే లెక్కలు ఎంత వరకు నిజం.. అనే విషయాల గురించి తెలుసుకుందాం.ఎగ్జిట్‌ పోల్స్‌ అనేది ఒక నిర్దిష్ట ఎన్నికలలో ఓట్లు ఎలా పడ్డాయనే దాని గురించి ఇచ్చే సమాచారం. దీన్ని వార్తా సంస్థలు, ఇతర ఏజెన్సీలు నిర్వహించే ఓటరు సర్వేలు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఓటింగ్‌ సరళి గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తాయి. తద్వారా విజేతలను అంచనా వేయడంలో సహాయపడతాయి. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు పూర్తిగా నమ్మదగినవి కానప్పటికీ, అవి ఎన్నికలకు సంబంధించిన అనేక అంశాల గురించి స్థూలమైన అంచనాను అందిస్తాయి.కొన్ని ప్రత్యేక సంస్థలు ఎన్నికలకు ముందు ప్రీపోల్స్‌, ఎన్నికల తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహిస్తుంటాయి. ప్రీపోల్స్‌ సర్వేలు ఎన్నికల నోటిఫికేషన్‌ రాక ముందు చేపట్టే ప్రక్రియ. వివిధ రాజకీయ పార్టీల పొత్తులు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ప్రభావం ఎలా ఉండబోతుందని విశ్లేషిస్తారు. పోలింగ్‌ తేదీ సవిూపించినప్పుడు నియోజకవర్గాల వారీగా కొంతమంది ఓటర్లను ర్యాండమ్‌గా సెలెక్ట్‌ చేసుకుని ప్రీపోల్స్‌ నిర్వహిస్తారు. అయా నియోజకవర్గాల వారీగా ఓటర్లను కలుసుకుని ఏ అభ్యర్థి నిలబడతారు, ఏ పార్టీకి విన్నింగ్‌ ఛాన్స్‌ ఉందినే విషయాన్ని సేకరించి పోల్‌ రిజల్ట్‌ వెల్లడిస్తారు.మొత్తంగా చూస్తే ప్రీపోల్‌ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్‌ పోల్స్‌లో ఖచ్చితత్వానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు రిజల్ట్‌కు దాదాపు దగ్గరగా ఉంటాయి. ఎన్నికల పోలింగ్‌ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. ఎగ్జిట్‌ పోల్‌ నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు కవర్‌ అయ్యేలా వేర్వేరు సమయాల్లో ఓటర్ల స్పందనను తెలుసుకుంటారు. కానీ ఈ ప్రక్రియను ఎంత ఎక్కువ మంది పకడ్బందీగా, విస్తృతంగా నిర్వహిస్తేనే కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.ప్రస్తుతం తెలంగాణతో సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాలకు పలు విడతల్లో పోలింగ్‌ జరగ్గా.. తెలంగాణకు నవంబర్‌ 30న పోలింగ్‌ ముగిసింది. పోలింగ్‌ ఉదయం 7 నుంచి 5 గంటల వరకు సాగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్‌ ముగిసిన గంట తర్వాత అంటే సాయంత్రం 6 గంటలకు ఆయా సంస్థలు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు విడుదల చేస్తారు..
Read More...
వెబ్ స్టోరీస్ 

భారతదేశపు తొలి విమాన చోదకుడు,గొప్ప పారిశ్రామికవేత్త జెఆర్డి టాటా

భారతదేశపు తొలి విమాన చోదకుడు,గొప్ప పారిశ్రామికవేత్త జెఆర్డి టాటా భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు, ఎయిర్‌ ఇండియా వ్యవస్థాపకుడు, టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ జహంగీర్‌ రతన్‌ జీ దాదాభాయి టాటా, ఈయనకు 1992లో భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్యారిస్‌ లో జన్మించిన ఈయనను ‘‘జెప్‌ా’’ లేక ‘‘జేఆర్డీ’’గా సంబోధిస్తారు. ఈయన తల్లి ఫ్రాన్సు దేశస్థురాలు కావడంతో, ఈయన ఫ్రెంచి భాషను మొదటి భాషగా నేర్చుకున్నాడు. 1929లో ఈయన భారతదేశములోనే మొట్టమొదటి పైలట్‌ లైసెన్సు పొందాడు. 1932 లో ఈయన భారతదేశపు తొలి వాణిజ్య విమానసేవలను టాటా ఎయిర్‌ లైన్స్‌ పేరుతో ప్రవేశపెట్టాడు. 1946లో అది ‘‘ఎయిర్‌ ఇండియా’’గా రూపాంతరం చెందింది. తర్వాతికాలంలో ఆయన భారతదేశపు పౌరవిమానయాన పితామహుడుగా ప్రశంసింపబడ్డాడు.34 ఏళ్ళ వయసులో ఆయన టాటా వ్యాపారసంస్థలకు పెట్టుబడిదారీ సంస్థ హోల్డింగ్‌ కంపెనీ లేక మాతృసంస్థ అయిన టాటా సన్స్‌ సంస్థకు చైర్మనుగా బాధ్యతలు చేపట్టి 1991 వరకు ఆ పదవిలో కొనసాగాడు. సుదీర్ఘమైన ఆయన హయాంలో టాటా గ్రూపు ఆస్తులు అరవైరెండు కోట్ల రూపాయల నుండి పదివేల కోట్ల రూపాయల పైబడి పెరగగా, గ్రూపులో సంస్థలు పదిహేను నుండి నూటికి పైగా చేరుకున్నాయి.జహంగీర్‌ రతన్‌జీ దాదాభాయి టాటా ఫ్రాన్స్‌ లోని ప్యారిస్‌లో రతన్‌జీ దాదాభాయి టాటాకు ఆయన ఫ్రెంచ్‌ సతీయణి అయిన సుజానె బ్రెయిర్‌కూ రెండో బిడ్డగా 1904 జూలై 29 లో జన్మించాడు. ఆయన తండ్రి భారతదేశంలో తొలి పారిశ్రామికవేత్త అయిన జెంషెట్‌జీ టాటాకు దాయాది సోదరుడు. టాటా ఫ్రాన్స్‌లోని బీచ్‌బడ్డున ఉన్న హార్డెలోట్‌లో తన బాల్యాన్ని గడిపినప్పుడు, ఆయనకు విమానయానం పైన ఆసక్తి ఏర్పడిరది. విమానాలు నడపడంలో ఆద్యుడైన లూయీ బ్లెరియో నుండి ఆయన స్ఫూర్తి పొందాడు.1929 లో టాటా భారతదేశంలో మొట్టమొదట పైలట్‌ లైసెన్సు పొందాడు. తర్వాతి కాలంలో ఆయన భారత పౌర విమానయాన పితగా గుర్తింపు పొందాడు. భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య విమానయాన సంస్ధ టాటా ఎయిర్‌ లైన్స్‌ను 1932 లో స్ధాపించాడు. అదే తర్వాత 1946 లో ఎయిర్‌ ఇండియాగా మారింది.ఆయన తల్లి ఫ్రెంచ్‌ దేశానికి చెందినవారవటం వల్ల ఆయన తన బాల్యాన్ని ఎక్కువగా ఫ్రాన్స్‌లోనే గడిపాడు. అతను నేర్చుకున్న మొదటి భాష ఫ్రెంచ్‌. ఆయనకు ఎన్నో ఇష్టాలుండేవి. కేంబ్రిడ్జ్‌లో చదువుకోవాలనుకున్నాడు. వేగంగా వేళ్లే కార్లపై మోజు పడేవాడు, ఫ్రెంచ్‌ సైన్యంలో లా సఫిస్‌ (సిపాయి?) అనే రెజిమెంట్‌లో పనిచేశాడు. ముంబయిలోని కాథెడ్రల్‌, జాన్‌కానన్‌ పాఠశాల్లో చదువుకున్నాడు. 1925 లో టాటా స్టీల్‌ కంపెనీలో అప్పటి డైరెక్టర్‌ ఇన్‌ఛార్జి అయిన జాన్‌ పీటర్సన్‌ దగ్గర పనిచేయడానికి బొంబాయి హౌజ్‌కు వచ్చాడు.1938 లో టాటా సన్స్‌కి చైర్మన్‌ అయిన సర్‌ నౌరోజి సక్లత్‌ వాలా చనిపోగానే 34 ఏళ్ల వయస్సున్న జె.ఆర్‌.డి దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు.చాలా దశాబ్దాల పాటు స్టీల్‌, ఇంజినీరింగ్‌ ఎల్లక్ట్రికల్‌ కంపెనీ వంటి ఎన్నో పరిశ్రమున్న టాటా గ్రూప్‌ సంస్ధను ఉన్నత ప్రమాణాలతో, ఏ రాజకీయవేత్తకూ లంచాలూ ముడుపులూ చెల్లించకుండా, నల్లబజారు మార్గం ఎంచుకోకుండా ఆయన వ్యాపారం నడిపించాడని కీర్తి పొందాడు. ఈ రోజుకూ విశ్వాసానికి మారుగా టాటా పేరు గడిరచాడు. 1939 లో దేశంలో మళ్లీ మళ్లీ ఏర్పడుతున్న కొరతను తీర్చడానికై స్వయం ఆధారితమైన మౌలిక కర్బనేతర రసాయన పరిశ్రమ టాటా కెమికల్స్‌ను భారతదేశం కోసం ప్రారంభించాడు. 1945 టాటా స్టీల్‌ వారు భారత రైల్వే శాఖలో లోకోమోటివ్స్‌ను ఉత్పత్తి చేసే ఉద్దేశంతో టాటా ఇంజనీరింగ్‌ అండ్‌ లోకోమోటివ్‌ కంపెనీని స్ధాపించాడు. టెల్కోను తర్వాత టాటా మోటర్సుగా మార్పు చేసి భారతదేశంలోనూ, విదేశాల్లోనూ ఆటోమోటివ్‌ మార్కెట్‌లో అత్యంతప్రధానమైనదిగాను తీర్చిదిద్దాడు. జెఆర్‌డి అధ్యక్షతన టాటా గ్రూప్‌ కంపెనీ 15 నుండి 100 కు అభివృద్ధి చెందాయి.1932 లో టాటా విమానయాన సర్వీసును ప్రారంభించడం ద్వారా ఆయనకు విమానాలపై ఉన్న ఆశ నెరవేరింది. మొట్టమొదటి భారత పౌర విమానం కరాచీలోని ద్రిగ్‌ రోడ్డు విమానక్షేత్రం నుండి 1932 అక్టోబరు 15 న భయుదేరి టాటానే స్వయంగా ఒంటరిగా దాన్ని నియంత్రిస్తుండగా అహ్మదాబాద్‌కు, అక్కడి నుండి బాంబేకు చేరింది. టాటా ఏవియేషన్‌ సర్వీస్‌ ప్రారంభమైన మొదటి సంవత్సరంలో వందకు వంద శాతం సమయపాలన పాటిస్తూ 10,000 రూపాయి లాభాన్ని పొందింది. 1953 లో ప్రభుత్వం విమానయాన వ్యాపారాన్ని జాతీయం చేయాని నిర్ణయించి ఆ పరిశ్రమకు అధ్యక్షుడుగా టాటాను ఆహ్వానించింది. దేశంలోని విమానయాన పరిశ్రమ అప్పుడు ఆధ్వాన్న స్ధితిలో ఉండిరది. టాటా ఏవియేషన్‌ తర్వాత 1946 లో ఎయిర్‌ ఇండియాగా మారింది. టాటా అంత:కరణ కలిగిన చైతన్యవంతమైన పౌరుడు, జాతికి సేవందించడంలో ఎప్పుడూ విఫలం కాలేదు. 1941 లో ఆసియాలోని మొదటి కేన్సర్‌ ఆసుపత్రిని టాటా నేతృత్వంలో 1941 లో ప్రారంభించాడు. అంతర్జాతీయంగా కేన్సర్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో టాటా మెమోరియల్‌ ఆసుపత్రి భారతదేశంలో మొట్టమొదటిది. దేశంలో శాస్త్ర రంగ పరిశోధన కోసం డా.హోవిూబాభాకు, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పండ్‌మెంటల్‌ రిసెర్చ్‌’ స్ధాపించడానికై టాటా గొప్ప వితరణతో గ్రాంటు ఇచ్చాడు. హోమి భాభా మాటల్లో చెప్పాంటే ఆ ఇన్‌స్టిట్యూట్‌ మన ఆటోమిక్‌ ఎనర్జీ ప్రోగ్రాంకి నాంది అనవచ్చు. జనాభా నియంత్రణ కోసం మొదటగా కృషి ప్రారంభించింది టాటానే.1951 జనాభా లెక్క ప్రకారం భారతదేశం 35 కోట్ల జనాభాను మించిపోయిందని ఆయన గుర్తించాడు. టాటా ఈ విషయాన్ని అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ దృష్టికి తీసుకువెళ్లాడు. కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదు. జెఆర్‌డి ప్రభుత్వ స్పందన కోసం అగలేదు, మిసెస్‌ ఆవాబాయి వాడియా ప్రారంభించిన భారత కుటుంబ నియంత్రణ అసోసియేషన్‌కు పాక్షిక సాయం అందించాడు. 1970 లో ఫోర్డ్‌ ఫౌండేషన్‌తో కలిసి కుటుంబ నియంత్రణ సంస్ధను స్ధాపించాడు.ఈ రంగంలో ఆయన చేసిన కృషికిగాను 1992 లో ఆయనకు యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ అవార్డు ప్రదానం చేశారు.భారతదేశానికి, వాణిజ్య పరిశ్రమ రంగాకు అందించిన ఎనలేని సేవకు గుర్తుగా 1992 లో టాటాకు, ఆయన జీవించిఉండగానే ఇది ఎంతో అరుదైన సంఘటన భారతదేశపు అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నతో గౌరవించారు. 1954 లో ఫ్రెంచ్‌ ప్రభుత్వం అయనకు అవార్డు నిచ్చింది. వాణిజ్య విమానయాన సంస్ధకు అయన అందించిన విశిష్టసేవకు గాను ఆయనకు టోనీ జానస్‌ అవార్డు లభించింది.1988 లో ఆయన ప్రతిష్ఠాత్మకమైన గుగెన్‌ హేమ్‌ మెడల్‌ను పొందారు.జెఆర్‌డి టాటా తన 89వ ఏట 29 నవంబర్‌ 1993 లో స్విట్జర్లండ్‌లోని జెనీవాలో మరణించాడు. ఆయనను పారిస్‌లోని పెర్‌ షైజ్‌ శ్మశానవాటికలో ఖననం చేశారు. ఇండియన్‌ పార్లమెంట్‌, అసాధారణంగా ఏ ప్రభుత్వ రాజకీయపదవీ అనుభవించని సామాన్య పౌరుడైన ఆయనకు నివాళిగా సభను వాయిదా వేసింది. మహారాష్ట్ర మూడు రోజు సంతాపదినాలుగా ప్రకటించింది.
Read More...
వెబ్ స్టోరీస్ 

మహూవా ఎంపీ సీటుకు ఎసరు

మహూవా ఎంపీ సీటుకు ఎసరు తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున ఎన్నికై లోక్‌సభలో ప్రవేశించిన మహువా మొయిత్రా చాలా త్వరగానే ‘వార్తల్లో వ్యక్తి’ అయ్యారు. తీరా నాలుగేళ్లయ్యే సరికల్లా వివాదంలో చిక్కుకున్నారు. ఏం జరిగిందో అందరూ గ్రహించే లోగానే ఉరుము లేని పిడుగులా, ఊహించని ఉత్పాతంలా వచ్చిపడిన వివాదం చివరికామె పార్లమెంటు సభ్యత్వానికి కూడా ఎసరుపెట్టేలా పరిణమించింది.సభ్యుల నైతిక వర్తనను నియంత్రించే లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ ఆమెను సభ నుంచి బహిష్కరించాలని స్పీకర్‌ను కోరుతూ గురువారం నివేదికను ఆమోదించింది. ఇందుకు ప్రధానంగా అనైతిక వర్తన, తీవ్ర తప్పిదాలకు పాల్పడటం కారణాలుగా చూపింది. అంతేకాదు… ఈ విషయంలో సంస్థాగత విచారణ, చట్టపరంగా గట్టి చర్యలు అవసరమని సిఫార్సు చేసింది.పార్లమెంటు సభ్యులు సభలో ప్రశ్నలు వేయటానికి వినియోగించే ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌ లాగిన్‌, పాస్‌వర్డ్‌ ఆమె తన స్నేహితుడైన దుబాయ్‌ రియలెస్టేట్‌ వ్యాపారి దర్శన్‌ హీరానందానీకి ఇచ్చారనీ, ఆయన నుంచి కోటి రూపాయల ముడుపులు తీసుకుని ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ సంస్థలపై ప్రశ్నలు సంధించారనీ మొయిత్రాపై వచ్చిన ఆరోపణలు. ఆ ప్రశ్నలు అదానీ సంస్థల ప్రయోజనాలు దెబ్బతీసేంత తీవ్రమైనవా? అందువల్ల హీరానందానీకి ఒరిగేదేమిటి? ముడుపుల సంగతిని మొయిత్రా తోసి పుచ్చారు. లాగిన్‌, పాస్‌వర్డ్‌ ఇచ్చినట్టు అంగీకరించారు. అందుకుగల కారణాలు చెప్పారు. దేశభద్రతకు ముప్పు తెచ్చే చర్య అనీ, లంచం తీసుకుని ప్రశ్నలేయటం అనైతికమనీ బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే గత నెలలో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. కమిటీ విచారణ తీరుతెన్నులను ప్రశ్నిస్తూ ఇప్పటికే మొయిత్రా ఓం బిర్లాకు లేఖ రాశారు. కమిటీ తనను ప్రశ్నించిన తీరు ‘వస్త్రాపహరణం’ మాదిరిగా వున్నదంటూ దుయ్యబట్టారు.మొయిత్రా రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌. కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ వలె ఆంగ్ల భాషాప్రావీణ్యం వుండటం వల్లనే త్వరగా ఆమెకు పేరుప్రతిష్టలు సాధ్యమైనాయని అనుకోవటానికి లేదు. ప్రసంగించదల్చుకున్న అంశంపై పట్టు సంపాదించటం ఒక్కటే మొయిత్రా ప్రత్యేకతని చెప్పడానికి కూడా లేదు. విషయ పరిజ్ఞానంతోపాటు విస్ఫులింగాలు విరజిమ్మే స్వభావం, నిర్భీతిగా పాలక పక్షాన్ని నిలదీసే తత్వం ఆమెకొక విశిష్టతను తీసుకొచ్చాయి. అంతకుముందు మూడేళ్లు ఆమె తృణమూల్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ మొయిత్రా గురించి దేశానికంతకూ తెలిసిందిఈ నాలుగేళ్ల కాలంలోనే. సభలోనే కాదు… వెలుపల కూడా ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా నిప్పులు చిమ్ముతారు. మూకుమ్మడి అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్షపడిన గుజరాత్‌ దోషులకు క్షమాభిక్ష పెట్టడాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎథిక్స్‌ కమిటీ విచారణలో నిర్ధారించిన అంశాలేమిటో, అవి ఏరకంగా తీవ్రమైన స్వభావంతో కూడుకున్నవో ఇంకా తెలియాల్సి వుంది. ఎన్‌ఐసీ లాగిన్‌, పాస్‌వర్డ్‌ ఇవ్వటం విషయంలో ఇంతవరకూ ఎలాంటి నిబంధనలూ లేవు. అయినా సరైంది కాదనుకుంటే ఆమెను మందలించవచ్చు.కమిటీలోని విపక్ష సభ్యులు చెబుతున్న ప్రకారం 800 మంది ఎంపీల్లో అనేకులు సగటున కనీసం ఇద్దరు ముగ్గురికి ఇలా ఇస్తారు. కంప్యూ టర్‌ల వాడకం, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవటం ఇందుకు కారణం. ఈ విషయంలో స్పీకర్‌ ఏం నిర్ణయిస్తారన్నది చూడాలి. ఆ సంగతలా వుంచితే ఫిర్యాదు, విచారణ వగైరాలన్నీ ఆదరా బాదరాగా సాగినట్టు కనబడుతోంది. అక్టోబర్‌ 26న కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ నెల 2న జరిగిన రెండో సమావేశం మధ్యలోనే ముగిసింది. అడిగినవాటికి జవాబివ్వకుండా ఆమె దుర్భాషలాడారని కమిటీ ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌ సోంకార్‌ ఆరోపిస్తే… ఫిర్యాదుతో సంబంధం లేని ప్రశ్నలతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా వేధించారన్నది మొయిత్రా ఆరోపణ.దుబాయ్‌ వెళ్తే ఏ హోటల్‌లో దిగుతారు… విూతో ఎవరుంటారు… విూరు విూ మిత్రులతో మాట్లాడుతున్నట్టు వారి భార్యలకు తెలుసా అని అడిగారని కూడా ఆమె ఆరోపించారు. దీనికి నిరసనగా ఆమె, విపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు. కమిటీ విచారణ గోప్యం కనుక ఆరోపణలు, ప్రత్యారోపణల్లో నిజానిజాలేమిటో తెలియదు. అయితే ఈ మొత్తం వ్యవహారం మన పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తుందన్నది మాత్రం వాస్తవం. అసలు దూబే ఫిర్యాదుకు మొయిత్రా మాజీ సహచరుడు దేహద్రాయ్‌ లేఖ ఆధారమన్న సంగతి కమిటీకి తెలుసా? కమిటీకిచ్చిన అఫిడవిట్‌లో మొయిత్రాకు ముడుపులు చెల్లించానని హీరానందానీ అంగీకరించారా? లేదని విపక్ష సభ్యులు చెబుతున్నారు. విడిపోయిన జంట పరస్పరం ఆరోపించుకోవటం సర్వసాధారణం. ఇప్పటికే పెంపుడు కుక్క విషయంలో వారిద్దరూ కేసులు పెట్టుకున్నారు. కనుక దేహద్రాయ్‌ ఫిర్యాదు అంశంలో దూబే, ఎథిక్స్‌ కమిటీ ఆచితూచి అడుగు లేయాల్సింది.మహిళ గనుకే ఇలా చేశారన్న అపవాదు రానీయకుండా చూసుకోవాల్సింది. ఈ వ్యవహారంలో వ్యక్తిగతం, రాజకీయం కలగాపులగం చేశారన్న అప్రదిష్ట కలగడమూ మంచిది కాదు. ఏదేమైనా వ్యవస్థను ఢీకొట్టేవారు నిరంతరం అత్యంత జాగురూకతతో మెలగాలని మొయిత్రా ఇప్పటికే గుర్తించి వుంటారు. ఈ వివాదంలో పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యానికి అనుగుణమైన నిర్ణయం వెలువడాలని అందరూ కోరుకుంటారు.
Read More...
వెబ్ స్టోరీస్ 

న్యాయ వ్యవస్థపై పని ఒత్తిడి

న్యాయ వ్యవస్థపై పని ఒత్తిడి భారతదేశ రాజ్యాంగం అన్ని చట్టాలకు మూలాధారం. ఇదే రాజకీయ వ్యవస్థకు మౌలిక లక్షణాలను కట్టబెట్టింది. రాజ్యాంగంలో పొందుపరచిన ఎటువంటి చట్టం అయిన దేశంలో నివసించే ప్రతి పౌరునికి, ప్రతి ప్రాంతానికి వర్తిస్తుంది. ప్రభుత్వ అంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే. రాజ్యాంగానికి సార్వభౌమాధికారం ప్రజలచే ఏర్పడిరది. కావున న్యాయవ్యవస్థతో సహ, శాసన, కార్యనిర్వాహక శాఖలు ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిందే. ఈ మూడు భాగాలలో ఏ ఒక్కటి రాజ్యాంగం కంటే ఎక్కువ కాదు. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా రాజ్యాంగ చట్టాలకు లోబడే ఉంటుంది. రాజ్యాంగ అధికారాలు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు ఆపాదించటమైంది.కొన్ని రోజుల క్రితం ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రజాప్రతినిధులపై పెండిరగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి సుప్రీంకోర్టు చొరవ తీసుకోవడం ఆహ్వానించదగిన విషయం. నేర చరిత కలిగిన నేతలపై పెండిరగ్‌ కేసులు ప్రజాస్వామ్యానికి దెబ్బ అని రాష్ట్ర హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలలో ప్రజాప్రతినిధులపై పెండిరగ్‌ కేసులు ఉన్నవి.. ఇవి ఇంకెన్నాళ్ళు జాప్యమవుతాయి. నేరచరిత కలిగిన వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేలా చేయడంలో చొరవ తీసుకోవడం చాలా అవసరం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పిలవబడే భారతదేశంలో ఎన్నికల కోలాహలం ప్రారంభమయ్యింది. 2024 లోక్‌ సభ ఎన్నికలకు ముందుగా జరుగుతున్న ఈ ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సందర్భంలో ప్రజాప్రతినిధులపై పెండిరగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి సుప్రీంకోర్టు చొరవ తీసుకోవడం మంచి పరిణామం.శాసన శాఖ చేసే చట్టాలు ప్రజలకు న్యాయం కల్పించలేని పరిస్థితుల్లో న్యాయవ్యవస్థ తలుపులు తెరచుకుంటాయి. సాధరణంగా శాసన శాఖ చట్టాలను రూపొందిస్తే కార్యనిర్వాహక శాఖ వాటిని అమలు చేయాలి. ఆ చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయో లేదో అని పరిశీలించేదే న్యాయశాఖ. మరీ అటువంటి చట్టాలతో న్యాయం జరగనప్పుడు న్యాయవ్యవస్థను ఆశ్రయించటం నేడు పరిపాటిగా మారింది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(పిల్‌) పుణ్యమా అని న్యాయవ్యవస్థ ప్రజలకు మరింత చేరువయ్యింది. ఆధునిక ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వ లక్షణాల్లో ‘స్వతంత్ర న్యాయ వ్యవస్థ’ చాలా ముఖ్యమైనది.భారతదేశ రాజ్యాంగ పౌర చట్టాల పరిరక్షణలో న్యాయవ్యవస్థ క్రియాశీల పాత్ర వహిస్తుంది. అయితే ఇవి ఇచ్చే తీర్పులని బట్టి ప్రభుత్వంలోని నాయకులు న్యాయవ్యవస్థ తన పరిధిని దాటిందని విమర్శిస్తే, మరికొందరు న్యాయవ్యవస్థను ‘ప్రజాస్వామ్య సంరక్షకుడి’గా గుర్తించారు. ఇలా అన్ని విషయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న న్యాయవ్యవస్థ పెండిరగ్‌ కేసులతో పని ఒత్తిడి బాగా పెరిగింది. దీనికోసం సుప్రీంకోర్టులో గరిష్ట న్యాయమూర్తుల నియామకం చేయడం శుభ పరిణామం.రాజ్యాంగ మరియు చట్టాల పరిరక్షణతో పాటు మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా సమన్యాయం కలిపించడానికి న్యాయవ్యవస్థకు ‘సృజనాత్మకత’, ‘పూర్తి స్వతంత్రత’ చాలా అవసరం. నిరంతరం శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖల వైఫల్యం, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయ పరిరక్షణ చేకూర్చేందుకు న్యాయవ్యవస్థ తనకు తాను పరిస్థితులకు అనుగుణంగా తీర్పులను ఇచ్చే ఆవశ్యకతను తెలియజేస్తుంది. దేశంలో లోక్‌పాల్‌, లోక్‌ అదాలత్‌, ట్రిబ్యునళ్ళు వంటి వ్యవస్థలను పూర్తిస్తాయిలో ఏర్పాటు చేసి పరిపాలన నాణ్యతలో న్యాయం చేకూరేలా కృషి చేయటంలో న్యాయ వ్యవస్థ తీరు ఇంకా మెరుగుపడుతుంది.రాజ్యాంగంలో ‘న్యాయసవిూక్ష’ ప్రక్రియలో భాగంగా న్యాయవ్యవస్థ పరిమిత అధికారాలను మాత్రమే కలిగి ఉంది. అలా న్యాయ వ్యవస్థ దాని పరిధిలోనే ఉంటూ పూర్తి న్యాయం అందించాల్సి ఉంది. అంతేకాని ఈ పరిమిత అధికారాలను ఆసరాగా తీసుకొని పూర్తిగా రాజ్యాంగ సవరణ చేసే అధికారాలను విస్తృతపరచుకోజాలదు. అధికరణ 32, 141, 142 ప్రకారం న్యాయ వ్యవస్థ రాజ్యాంగాన్ని సవిూక్షించే అధికారాన్ని విస్తరించుకోజాలదు. కాని శాసన, కార్యనిర్వాహక శాఖల వైఫల్యంతో న్యాయవ్యవస్థపై పని భారం పెరిగింది. ప్రభుత్వ పాలసీ విధానాలపై కూడా న్యాయ వ్యవస్థ తీర్పులను ఇచ్చే అవకాశం ఏర్పడిరది. చివరగా న్యాయవ్యవస్థలో కూడా కొన్ని లోటుపాట్లు, విమర్శలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తన పరిధిని అతిక్రమించకుండా ‘రాజ్యాంగ పరిరక్షణ’ పాత్రను సమర్థవంతంగా పోషించటం వలన న్యాయవ్యవస్థపై రోజు రోజు ప్రజా విశ్వాసం పెరుగుతుందని చెప్పవచ్చు. న్యాయవ్యవస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా సత్వర పరిష్కార తీర్పులను ఆశించటం భావ్యం కాదని ప్రభుత్వం గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి.
Read More...
వెబ్ స్టోరీస్ 

సమ్మతిని అతిగా అన్వయించుకోవద్దు….

సమ్మతిని అతిగా అన్వయించుకోవద్దు…. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రభుత్వానికి, గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌కు మధ్య వివాదం పరాకాష్ఠకు చేరింది. కేంద్రం కక్ష సాధింపు సాధనాలుగా గవర్నర్లు దుర్వినియోగపడుతున్నారు. గవర్నర్‌ సమ్మతి మేరకే రాష్ట్ర ప్రభుత్వాలు మనుగడ సాగిస్తాయి అని రాజ్యాంగంలో వున్న వాక్యాన్ని ఈ రాష్ట్రాల గవర్నర్లు అతిగా అన్వయించుకొంటున్నారు. ఈ సమ్మతి అనేది శాసన సభల్లో సంఖ్యాధిక్యత కలిగిన ప్రభుత్వాల విషయంలో అప్రమేయంగా పని చేయవలసి వుంటుంది. సుప్రీంకోర్టు చేసిన ఒక వ్యాఖ్య గవర్నర్లకు స్పష్టంగా దిశానిర్దేశం చేస్తున్నది. శాసన సభలో ఆమోదించి పంపిన బిల్లులపై న్యాయస్థానాలు జోక్యం చేసుకొనేంత వరకు గవర్నర్లు నిర్ణయం తీసుకోకపోడం అలవాటైపోయిందంటూ అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.‘ఇది చాలా తీవ్రమైన సమస్య, దీనిని కూలంకషంగా పరిశీలించాలి. గవర్నర్లు తమ పని తాము చేసేటట్టు చూడడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించవలసిన పరిస్థితి ఎందుకు తలెత్తాలి? రాజ్యాంగం అవతరించినప్పటి నుంచి మనది ప్రజాస్వామ్య దేశం. ఇటువంటి సమస్యలను గవర్నర్లు, ముఖ్యమంత్రులు కలిసి పరిష్కరించుకోవాలి. రాజ్యాంగం ఎటువంటి ఆటంకాలు లేకుండా అమలయ్యేటట్టు చూస్తాము’ అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారంటే ఇక ముందు ఏ రాష్ట్ర గవర్నరూ జాప్యందారీ వ్యూహాలను ప్రయోగించరాదని ఆయన అనుమానాతీతంగా చెప్పారు.పంజాబ్‌ ప్రభుత్వం అక్కడి గవర్నర్‌ బన్వరీ లాల్‌ పురోహిత్‌ వైఖరిని సవాలు చేస్తూ దాఖలు చేసుకొన్న పిటిషన్‌పై విచారణలో ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ ఈ విధంగా వ్యాఖ్యానించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాతనే గవర్నర్ల బరి తెగింపు ఈ స్థాయికి చేరుకొన్నదని చెప్పక తప్పదు. తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల గవర్నర్లు కూడా అక్కడి శాసన సభల ఆమోదంతో తమకు చేరిన బిల్లులపై నిర్ణయాలు తీసుకోకుండా వాటిని నిరవధికంగా తమ వద్ద వుంచుకొన్న సందర్భాలున్నాయి. అప్పుడు కూడా ఆ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. పంజాబ్‌లో ఆర్థిక బాధ్యత, పన్ను చట్టాల సవరణ అంశాలకు సంబంధించినవి సహా అనేక కీలక బిల్లులను గవర్నర్‌ ఎప్పటికీ తేల్చకుండా తన వద్ద వుంచుకొన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రశ్నలు లేవనెత్తుతూ బిల్లులను తిప్పి పంపడం వరకే గవర్నర్లు చేయవలసిన పని. మంత్రి వర్గాలు వాటిని తిరిగి ఆమోదం కోసం పంపితే గవర్నర్లు కాదనడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రజలెన్నుకొన్న శాసన సభలో మెజారిటీ అనుభవిస్తున్న ప్రభుత్వం అదే సభ ఆమోదం పొంది పంపే బిల్లులు శిలాశాసనాల వంటివి.వాటిని అడ్డుకొనే స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వం నియమించే గవర్నర్లకు ఎంత మాత్రం లేదు. కేరళ ప్రభుత్వానికి, గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌కు అనేక అంశాల విూద అసఖ్యత, వైరుధ్యం నెలకొని వున్నాయి. కెఎన్‌ బాలగోపాల్‌ అనే మంత్రి తన సమ్మతిని కోల్పోయాడని చెబుతూ ఆయనను వెంటనే బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌ 2022 అక్టోబర్‌ 25న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. కేరళ విశ్వవిదాలయాల తీరుపై గవర్నర్‌ తరచూ విమర్శించడాన్ని ప్రస్తావిస్తూ కొంత మంది ఉత్తరప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లోని పద్ధతులకు అలవాటుపడిపోయి కేరళ యూనివర్శిటీల ప్రజాస్వామ్య ప్రవర్తనను అర్థం చేసుకోలేకపోతున్నారని మంత్రి బాలగోపాల్‌ వ్యాఖ్యానించినందుకు ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని గవర్నర్‌ సిఫారసు చేశారు. దానిని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఖాతరు చేయలేదు. 2020లో విజయన్‌ ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగంలోని పౌరసత్వ చట్ట సవరణకు సంబంధించిన భాగాన్ని శాసన సభలో చదవకుండా వదిలిపెట్టడం ద్వారా గవర్నర్‌ వివాదాస్పదుడయ్యారు. విజయన్‌ ప్రభుత్వం పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శాసన సభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. కేరళ ప్రభుత్వం శాసన సభలో ఆమోదింపజేసి పంపిన 8 లేక 9 బిల్లులను గవర్నర్‌ ఏ నిర్ణయమూ తీసుకోకుండా తన వద్ద వుంచుకొన్నారు. వీటిలో 3 బిల్లులు రెండేళ్ళకు పైగా ఆయన వద్ద పెండిరగ్‌లో వున్నాయి. విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లులు, కేరళ సహకార సంఘాల సవరణ బిల్లు, లోకాయుక్త సవరణ బిల్లు, ప్రజారోగ్య సవరణ బిల్లు వంటివి కేరళ రాజ్‌భవన్‌లో గుర్రు నిద్ర తీస్తున్నాయి. కొన్ని బిల్లులపై గవర్నర్‌ నిర్ణయం తీసుకొన్నారని వివరమైన సమాచారాన్ని ఈ వారాంతానికి తెలియజేస్తానని పంజాబ్‌ కేసులో సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టుకు విన్నవించుకొన్నట్టు తెలుస్తున్నది. గవర్నర్లపై ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటువంటి హావిూయే రావడం ఆ తర్వాత గవర్నర్లలో చలనం కలగడం జరుగుతున్నది. ఇదంతా ప్రజాప్రభుత్వాల పనిని అడ్డుకోడానికి, అనవసరమైన కాలయాపనకు దారి తీసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది.
Read More...