ఆంధ్రప్రదేశ్‌
ఆంధ్రప్రదేశ్‌ 

ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి

ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సబా భవన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, డిఆర్వో...
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి

పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి కడప, జూలై 15(భారత శక్తి) : జిల్లాలోని 7 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఏపిపిఎస్సి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి యం. విశ్వేశ్వర నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో డిఆర్వో గారి ఛాంబర్లో.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించే క్రింద తెలిపిన నోటిఫికేషన్ సంబందించిన పరీక్షల నిర్వహణపై...
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

పేదరికాన్ని రూపుమాపేందుకే పి4

పేదరికాన్ని రూపుమాపేందుకే పి4 కడప, జూలై 15(భారత శక్తి) : రాష్ట్రంలోని పేదరికాన్ని రూపు మాప‌డ‌మే ల‌క్ష్యంగా, స్వర్ణ ఆంధ్ర @ 2047 విజ‌న్‌ప్లాన్‌లో భాగంగా ప్ర‌భుత్వం పి4 విధానాన్ని రూపొందించింద‌ని జిల్లా ఇంచార్జి క‌లెక్ట‌ర్ అదితిసింగ్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో జిల్లాలో పి4 సర్వే నిర్వహణపై.. జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ ఆధ్వర్యంలో...
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది

చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది తిరుపతి జిల్లా ప్రతి నిధి /విజయవాడ, జూలై 15 (భారతశక్తి) :   సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఉయ్యూరు టౌన్ పార్టీ అధ్యక్షులు జంపాన గురునాథరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని, వారికి అమలైన పథకాలు గురించి రాజేంద్రప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా...
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి 

దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి  కడప, భారత శక్తి ప్రతినిధి, జూలై 15: మంగళవారం ఉదయం 10 గంటలకు, 'దళిత ఐక్య వేదిక" జిల్లా అధ్యక్షులు ఎన్.నారాయణ జిల్లాలోని దళితుల భూముల భూకబ్జాలకు వ్యతిరేకంగా చేస్తున్న "రిలే నిరాహారదీక్షల"కు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ దీక్షా శిబిరాన్ని సందర్శించి, సంపూర్ణ మద్దతు తెలియజేశారు. నేడు...
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

సగిలేరు గురుకుల పాఠశాలను తరలించడం, బహుజన విద్యార్థులను చదువుకు దూరం చేయడం సరి కాదు

సగిలేరు గురుకుల పాఠశాలను తరలించడం, బహుజన విద్యార్థులను చదువుకు దూరం చేయడం సరి కాదు కడప, భారత శక్తి ప్రతినిధి, జూన్ 28: బద్వేల్ నియోజకవర్గం లోని సగిలెరు గురుకుల పాఠశాలను బ్రహ్మంగారిమఠం మండలంలోని తోట్లపల్లి గ్రామం సమీపంలో మహా గురుకుల పాఠశాలకు తరలించడం చాలా దారుణమని, సగిలేరు చుట్టూ ప్రక్కల 4,5 మండలాల విద్యార్థులు ఆ గురుకుల పాఠశాల మీద ఆధారపడి ఉన్నాయి, విద్యార్థులు అక్కడికి వెళ్లడం ద్వారా ఇబ్బంది పడుతారు అని,కావున వెంటనే యధావిధిగా సగిలేరు గురుకుల పాఠశాలను నిర్వహించాలని బహుజన్ సమాజ్ పార్టీ గా డిమాండ్ చేస్తున్నాం, కడప నగరం బిఎస్పీ జిల్లా కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ కడప జిల్లా అధ్యక్షులు సగిలి గుర్రప్ప మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గం లోని పోరుమామిళ్ల మండలం సగిలేరు గురుకుల పాఠశాల దాదాపు కొన్ని ఏళ్ల నుంచి ఎంతోమంది విద్యార్థులు అక్కడ చదువుకొని ఉన్న స్థాయికి చేరుకున్నారు, పోరుమామిళ్ల, కలసపాడు శ్రీ అవధూత కాశినాయన B,కోడూరు మండలాలు చుట్టుపక్కల అనేక గ్రామ ప్రజలు విద్యార్థులకు సగిలేరు గురుకులం పాఠశాల ఉపయోగపడుతుంది,కానీ ఇప్పుడు బ్రహ్మంగారిమఠంలోని తోట్లపల్లి గ్రామం సమీపంలో ఉన్న మహా గురుకుల పాఠశాలకు తరలించడం చాలా దారుణం, మఠం అంబేద్కర్ గురుకుల పాఠశాల (రెసిడెన్షియల్) లో కొత్త అడ్మిషన్ విద్యార్థులు 200 మంది పాత అడ్మిషన్ విద్యార్థులు 300 మంది ఉన్నారు,వారిని సగిలేరు గురుకుల పాఠశాల విద్యార్థులు కలుపుకొని 660 మందినీ ఇప్పుడు దాదాపు 900 పైబడి విద్యార్థులకు ఉండే మహా గురుకుల పాఠశాలకు తరలించడం జరుగుతుంది, కానీ అక్కడ ఉన్న విద్యార్థులకు హాస్టల్ వసతులు ఉన్నప్పటికీ విద్యకు అవసరమయ్యే మౌలిక వసతులు 900 మంది విద్యార్థులకు అక్కడ లేని పరిస్థితి కనపడుతుంది, 14 క్లాసు రూల్స్ 20 బాత్రూంలు ఉన్నాయి, పూర్తిస్థాయిలో విద్యార్థులు అక్కడ చేరినప్పటికీ క్లాస్ రూమ్స్ బాత్రూం వంటి వసతులు లేక ఇబ్బంది పడుతారు, కావున సగిలేరు విద్యార్థులను అక్కడ వెళ్ళటం వల్ల విద్యార్థులు విద్యకు దూరం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి, కావున సగిలేరు గురుకులం పాఠశాలను వెంటనే యధావిధిగా పాఠశాలను కొనసాగించాలని, జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఉన్నత విద్యా శాఖ అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం, లేని పక్షంలో పెద్ద ఎత్తున బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేయడానికి సంసిద్ధంగా ఉంటామని BSP గా డిమాండ్ చేస్తున్నాం, ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జిలు డి ఎస్ జయరాం బాలచంద్ర జిల్లా ప్రధాన కార్యదర్శి బేబీ పాల్గొన్నారు.
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులాన్ని సగిలేరులోనే కొనసాగించాలి : ప్రజా సంఘాల ఐక్య వేదిక డిమాండ్.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులాన్ని సగిలేరులోనే కొనసాగించాలి : ప్రజా సంఘాల ఐక్య వేదిక డిమాండ్. కడప,భారత శక్తి ప్రతినిధి, జూన్ 28: కడప జిల్లా బి కోడూరు మండలం లో వై యస్ ఆర్ కడప జిల్లా , బద్వేలు నియోజక వర్గం, బి కోడూరు మండలంలోని సగిలేరు డ్యామ్ వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం గత ముప్పై సంవత్సరాలకు పైగా యెంతో మంది విద్యార్థులను ఉద్యోగులుగా, అధికారులుగా తీర్చిదిద్దిన గొప్ప గురుకుల విద్యా సంస్థ. ప్రస్తుతం ఆ విధ్యా సంస్థను ఎటువంటి సమస్యలు లేకపోయినా అక్కడి నుండి తరలించి మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం లోని మహా గురుకులంలో కలిపివేయాలని ప్రభుత్వం వారు నిర్ణయించినట్లు తెలుస్తుంది అయితే ఎప్పుడు గత 30 సంవత్సరాలుగా ఎటువంటి సమస్యలు లేని సగిలేరు పాఠశాలను అనేక సమస్యలతో ఉన్న బ్రహ్మంగారిమఠం మహా గురుకులంలో కలపడం సరైన నిర్ణయం కాదని ప్రభుత్వం మరియు వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ గారు అలాగే గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సగిలేరు వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను బ్రహ్మంగారిమఠం పాఠశాలలో కలిపే నిర్ణయంపై మరో మరోమారు పునరాలోచించి బద్వేల్ నియోజకవర్గంలోని పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేయకుండా యధావిధిగా సగిలేరులోనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను మరియు కళాశాలను కొనసాగించాలని పోరుమామిళ్లలోని ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ యంబడి ఈశ్వర్ మరియు వివిధ ప్రజాసంఘాల నాయకులు నేడు అంబేద్కర్ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి సమస్య యొక్క మూలాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయించారు. గత 30 సంవత్సరాలుగా కూలిపోని సగిలేరు గురుకుల పాఠశాల భవనాలు నేడు భూమి బాగాలేదని పాఠశాల భవనాలు కూలిపోతాయని కారణాలు చూపిస్తూ ఇక్కడి నుంచి కళాశాలను తరలించే ప్రక్రియపై ఆలోచించి విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజాసంఘాల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని యధావిధిగా సగిలేరు గురుకులాన్ని సగిలేరులోనే కొనసాగించాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న ఏకైక బాలుర గురుకులాన్ని పరిరక్షించుకోవడానికి పార్టీలకతీతంగా సంఘాల కతీతంగా అందరూ తమ వంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు త్వరలోనే సమస్య పరిష్కార నిమిత్తం నియోజకవర్గ అధికార ప్రతిపక్ష పార్టీల నేతలకు జిల్లా కలెక్టర్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఈ విషయమై వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమం చేస్తామన్నారు. సగిలేరు గురుకులాన్ని పరిరక్షించుకోవడమే బద్వేలు నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవమని వారు తెలిపారు. విద్యార్థుల భద్రత విద్య రవాణా అనుకూలంగా ఉన్న సగిలేరు గురుకులాన్ని యధావిధిగా సెగిలేరులోనే కొనసాగించడం ద్వారా పేద విద్యార్థులకు విద్యను మరింత చేరువ చేసినట్లు ఉంటుందని ఈ సందర్భంగా వారు ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని పునరాలోచిస్తుoదని భావిస్తున్నామని తెలుపుతూ ఒకవేళ అలాగే ముందుకు వెళితే ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని వారు ముక్తకంఠంతో తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ గా యంబడి ఈశ్వర్ ను, కో కన్వీనర్లుగా ముత్యాల ప్రసాదరావు, భైరవ ప్రసాద్, సిపిఎం.రవికుమార్, మండల కార్యదర్శి.పిడుగు మస్తాన్, సిపిఐ.గుడిమే సునీల్ కుమార్ , కలసపాడు మండల కార్యదర్శి ఓ. యోహాన్ ఎర్రబల్లి ప్రసాద్, బి కోడూరు మండల కార్యదర్శి.వీరయ్య , నారి పోగు మనోజ్ లను, గౌరవ సలహాదారులుగా బండి ఓబులేసును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం నాయకులు ముత్యాల ప్రసాదరావు వైఎస్ఆర్ కడప జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు బండి ఓబులేసు సిపిఐ నాయకులు రవికుమార్, పిడుగు మస్తాన్ సిపిఎం నాయకులు భైరవ ప్రసాద్, దళిత వేదిక రాష్ట్ర నాయకులు వద్దేపోగు యోహాన్, ఎంఆర్పిఎస్ నాయకులు మనోజ్, సింగరయ్య, మాల మహానాడు నాయకులు కిరణ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వీరయ్య కలసపాడు మండలం సిపిఐ నాయకులు గుడిమే సునీల్ కుమార్ బి కోడూరు మండల సిపిఐ నాయకులు ప్రసాద్ ఎన్జీవో సంఘం నాయకులు దాసరి పల్లె పౌలు కాశినాయన మండలం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కందుల.కుమార్, వరి కుంట్ల భాస్కర్, వరికుంట్ల రాజశేఖర్ సీనియర్ జర్నలిస్ట్, విజయ్ మాల మహానాడు కార్యకర్తలు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

రైతులకు నష్టం వాటిల్లకుండా పరిహారం అందేలా చూడాలి: జిల్లా జేసీ అధితి సింగ్

రైతులకు నష్టం వాటిల్లకుండా పరిహారం అందేలా చూడాలి: జిల్లా జేసీ అధితి సింగ్ కడప, జూన్ 28(భారత శక్తి): జాతీయ రహదారుల విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణలో భాగంగా ఉద్యాన పంటలు, వృక్షాలు కోల్పోతున్న రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా జేసీ అధితి సింగ్ సంబందిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల విస్తరణ కోసం చేపట్టిన భూ సేకరణలో ఉద్యాన పంటలు / చెట్లు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అంచనా ప్రక్రియపై.. శనివారం కడప కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి సంబందిత అధికారులు, ఆయా డివిజన్ల ఆర్డీవోలు, తహశీలర్లతో జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జేసీ అదితి సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమీక్షకు ఎస్డీసి, ఎన్ హెచ్ పీడి వెంకటపతి, జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీవోలు సాయిశ్రీ, చిన్నయ్య సంబందిత రీజియన్ల ఎన్ హెచ్ఏఐ, ఎన్ హెచ్ పీడిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. బెంగుళూరు-కడప-విజయవాడ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి భూసేకరణ చేపట్టడం జరుగుతోందన్నారు. అందుకు సంబంధించి జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రయివేటు, అటవీ శాఖకు చెందిన పలు భూములను కొనుగోలు చేసి భూములు కోల్పోయినవారికి పరిహారం కూడా ఇవ్వడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా చేపడుతున్న భూసేకరణ ప్రక్రియలో జమ్మలమడుగు, వి.ఎన్. పల్లె మండలాల్లో ఉద్యాన పంటలు కోల్పోతున్న రైతులకు ఎలాంటి నష్టం రాకుండా భూసేకరణ చట్టంలోని సంబందింత ప్రామాణికాలను పక్కాగా పాటిస్తూ పరిహారం అంచనాలను నివేదించాలన్నారు. వృక్షాల వయస్సు, చెట్ల పెంపకానికి ఎరువులు, ఫరీలైజర్స్ ఇతర నిర్వహణకు సంబంధించి ఇప్పటివరకు రైతులు వెచ్చించిన వ్యయం తదితర అంశాలను ఉద్యాన వన శాఖ అధికారులు ఖచ్చితంగా, పారదర్శకంగా వ్యాల్యూయేషన్ చేయాలన్నారు. వేగవంతం చేయడం జరుగుతోందన్నారు. కాగా ఇంకా ఇంకనూ పెండింగ్ లోవున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ఏఐ పీడి అశోక్ కుమార్, ఆర్&బి నేషనల్ హైవే ఈఈ విజయ్ భాస్కర్ రెడ్డి, ఎన్ హెచ్ ప్రాజెక్టుల ప్రనిధులు, ఫారెస్ట్, భూసేకరణ, రెవెన్యూ, ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

దాయ్ అఖర్ లేఖ రచన పోటీ విజేతకు సర్టిఫికేట్ మరియు చెక్కు జారీ

దాయ్ అఖర్ లేఖ రచన పోటీ విజేతకు సర్టిఫికేట్ మరియు చెక్కు జారీ విజయవాడ, భారత శక్తి ప్రతినిధి, జూన్ 27: పోస్టల్ డిపార్ట్మెంట్ చే నిర్వహించబడిన దాయ్ అఖర్ లేఖ రచన 2024-25 పోటీకి సంబంధించి పటమటలోని నిర్మల హై స్కూల్ కు చెందిన కుమారి యు.కమలిని తండ్రి యు. వంశీధర్ జాతీయ స్థాయి లో మొదటి బహుమతి గెలుచుకున్నది. ఈ సందర్భము గా కుమారి యు. కమలిని కి పోస్టల్ సర్కిల్ ఆఫీస్, క్రిష్ణలంక, విజయవాడ -13 మిస్.బి.పి.శ్రీదేవి, చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ వారి చేతుల మీదుగా 27.06.2025 న సర్టిఫికేట్ మరియు నగదు బహుమతి Rs. 50,000/-చెక్కు రూపములో అందజేయడమైనది. ఈ కార్యక్రమానికి శ్రీ కె.సంతోష్ నేత, డీపీఎస్ (హెడ్ క్వార్టర్స్), ఏపీ సర్కిల్, శ్రీ జి.శివ నాగ రాజు, అసిస్టెంట్ డైరెక్టర్, సిపిఎంజి, ఏపీ సర్కిల్ మరియు శ్రీ ఎం.నరసింహ స్వామి, ఎస్ ఎస్ పి ఒ లు, విజయవాడ డివిజన్, తదితరులు పాల్గొన్నారు.
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

మహా గురుకులంలో.. జూలై 2వ తేదీ నుండి తరగతులు ప్రారంభం: జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

మహా గురుకులంలో.. జూలై 2వ తేదీ నుండి తరగతులు ప్రారంభం: జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి కడప, జూన్ 27(భారత శక్తి) : పేద విద్యార్థులకు అధునాతన వసతులు, నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో.. బి.మఠంలో నిర్మించిన డా. బి.ఆర్. అంబేద్కర్ బాలుర మహా గురుకులంలో జూలై 2వ తేదీ నుండి తరగతులు ప్రారంభం కానున్నట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కాలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో.. బి.మఠం మండలంలో నూతనంగా ఏర్పాటైన డా.బి.ఆర్.అంబేద్కర్ మహా గురుకులం (బాలుర) విద్యాలయంలో తరగతుల ప్రారంభానికి సంసిద్ధత, ఏర్పాట్లు, విద్యార్థుల అడ్మిషన్ సంబందిత అంశాలపై సంబందిత అధికారులతో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… బి.మఠం మండల కేంద్రానికి సమీపంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, వసతులతో సువిశాల ప్రాంగణంలో రూపు దిద్దుకున్న డా. బి.ఆర్. అంబేద్కర్ మహా గురుకులం వచ్చే నెల 2వ తేదీ నుండి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించనుందన్నారు. 960 మంది విద్యార్థులకు విద్యా వసతులు కల్పించగల సామర్థ్యం ఉన్న ఈ బాలుర మహా గురుకులంలో.. ఈ విద్యా సంవత్సరానికి గాను 800 మంది విద్యార్థులతో అడ్మిషన్లను పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే సగిలేరు, బి.మఠం గురుకుల పాఠశాలల పాత భవనాల్లోని 660 మంది విద్యార్థులను కూడా మహా గురుకులంలోకి షిఫ్ట్ చేయడం జరుగుతోందన్నారు. కొత్త అడ్మిషన్లకు సంబంధించి.కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతొందన్నారు. తరగతుల ప్రారంభం అయ్యే నాటికి మహా గురుకులంలో ఎలాంటి మౌళిక సదుపాయాల కొరత లేకుండా చూడాలన్నారు. ఫర్నిచర్, కిచెన్ సామగ్రి, డైనింగ్ రూమ్, డార్మెటరీ రూమ్స్ లతోపాటు రోడ్లు, విద్యుత్, వాటర్, గ్రీనరీ, ఉద్యాన మొక్కల ప్లాంటేషన్, డ్రిప్ ఇరిగేషన్ తదితర అన్ని రకాల సౌకర్యాలను ఎలాంటి కొరత లేకుండా సమకూర్చాలన్నారు. ఆధునాథనమైన సౌకర్యాలు, నాణ్యమైన విద్యను అందించే మహా గురుకులంలో.. చేరేందుకు అర్హులైయిన పేద విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. ఇంకనూ ఏవైనా సదుపాయాల పెండింగ్ ఉంటే… జూలై 2వ తేదీ లోపు సిద్దం చేయాలని సంబందిత అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు ఆర్డీవో చంద్రమోహన్, సాంఘిక సంకేమ గురుకుల విద్యాలయాల జిల్లా కో. ఆర్డినేటర్ ఉదయశ్రీ, డీఈవో శంశుద్దిన్, ఎస్ఎస్ఏ ఎపిసి ఎ. నిత్యానందరాజులు, సోషల్ వెల్ఫర్ డిడి సరస్వతి, కాంట్రాక్టు ఏజెన్సీ, పీఆర్, ఏపీఎస్పీడిసిఎల్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

జిల్లాకు బాసటగా ఐ ఎస్ బి,బిల్ గేట్స్ ఫౌండేషన్:జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

జిల్లాకు బాసటగా ఐ ఎస్ బి,బిల్ గేట్స్ ఫౌండేషన్:జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వైఎస్ఆర్ కడప జిల్లా, జూన్ 27(భారత శక్తి): జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజల పౌష్టికాహారం మెరుగుపరిచేందుకు ఐ ఎస్ బి, బిల్ గేట్స్ ఫౌండేషన్స్ బాసటగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎనాక్ట్స్ ప్రాజెక్ట్(ENACTS) (ఎనేబుల్ అగ్రికల్చర్ న్యూట్రిషన్ కన్వర్జేన్స్ త్రు టెక్నికల్ సపోర్ట్) లో భాగంగా భారతీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్(ISB) భాగస్వామ్యం తో జిల్లాలో పౌష్టికాహారం లోపం ఉన్న వారిని గుర్తించి పౌష్టికాహారం పెంపొందించడానికి జిల్లా కలెక్టర్ ఆధ్యర్యంలో గురువారం ఆన్లైన్ జూమ్ సమావేశం జరిగింది. జూమ్ సమావేశం లో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ…భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఐఎస్బి వారి ఆధ్వర్యంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో జిల్లాలోని పౌష్టికాహార లోపంతో ఉన్న మహిళలకు పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ అందించేందుకు ఎనాక్ట్స్ ప్రాజెక్ట్ ద్వారా ఆకాంక్షిత జిల్లాలో భాగంగా మొదటగా చింతకొమ్మదిన్నె, జమ్మలమడుగు మండలాలలో అమలుచేసి తర్వాత జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. గ్రామీణ కుటుంబాలకు పోషక ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి పోషక అంశాలపై భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సహకారంతో జిల్లాలో అధ్యయనం చేయనున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఎనాక్ట్స్ ప్రాజెక్టులో సాంకేతిక మద్దతు ద్వారా పోషకార లోపం ఉన్న కుటుంబాలలోని మహిళలు పిల్లలపై దృష్టి సారించి జిల్లాలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారందరికీ పౌష్టికాహారం అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పౌష్టికాహార, ప్రోటీన్ ఆహార పదార్థాలను కొనలేని స్థితిలో చాలామంది ప్రజలు ఉన్నారని వారందరికీ అందుబాటులో సరసమైన ధరల్లో పౌష్టికాహారం బహుళ రంగ మార్కెట్ల ద్వారా ప్రజలకు అందించడానికి ఈ సంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపారు. జిల్లాలో పోషకాహార లోపాన్ని తగ్గించడం, వివిధ మార్కెట్ల ద్వారా న్యూట్రిషన్ ఫుడ్ ను అందుబాటులోకి తీసుకురావడం వంటి వాటిపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. పోషకాహారాన్ని అందించడానికి డిజిటల్ ఈ వోచర్లను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.డిజిటల్ ఓచర్లు ద్వారా న్యూట్రిషన్ ఫుడ్ ను బయట మార్కెట్లో తక్కువ ధరకే పొందవచ్చునని తెలిపారు.అలాగే ప్రతిరోజు పాలు,గుడ్లు తీసుకోవడం పట్ల ప్రజల్లో అవగాహనను పెంచడం జరుగుతుందన్నారు. అలాగే సేంద్రియ పద్ధతిలో పంట ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. రాయలసీమ జిల్లాలలో కడప జిల్లాను లీడింగ్ హార్టికల్చర్ హబ్ గా మార్చడంలో బాగంగా ఐ ఎస్బి సర్వే ను ఉపయోగించుకొని ఉద్యాన శాఖ, ఐ ఎస్బి సమన్వయంతో పోషక విలువలు అధికంగా ఉండే పండ్ల తోటలపై దృష్టి సారించి న్యూట్రీషన్ ఆహార పదార్థాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

అత్యున్నత లక్ష్యాలకు అద్భుత వేదిక’ కడప ఆర్ట్స్ కళాశాల: ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రవీంద్రనాథ్

అత్యున్నత లక్ష్యాలకు అద్భుత వేదిక’ కడప ఆర్ట్స్ కళాశాల: ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రవీంద్రనాథ్ కడప, జూన్ 27(భారత శక్తి) అత్యున్నత లక్ష్యాలను చేరుకోవడానికి విద్యార్థులకు ఉన్న అద్భుత వేదిక కడప ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల) అని.. ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి రవీంద్రనాథ్ అన్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పీజీ సెట్ 2025) ఫలితాలలో ఎం.కామ్ సబ్జెక్ట్ నందు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ర్యాంకును సాధించిన కళాశాల విద్యార్థి ఎం. చిన్మయ వెంకట సాయి కి.. శుక్రవారం తన చాంబర్ నందు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రవీంద్రనాథ్ నగదు బహుమతి అందించి సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఆర్ట్స్ కళాశాలలో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని కంప్యూటర్ ల్యాబ్, ఎన్.సి.సి, స్పోర్ట్స్, విశాలమైన ఆట స్థలము మరియు అతిపెద్ద లైబ్రరీ అదేవిధంగా ఏ కళాశాలలో లేని అత్యున్నత అర్హతలు గల అధ్యాపకులు విద్యార్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. కావున విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలను ఆర్ట్స్ కళాశాలలో చేర్పించి పిల్లల బంగారు భవిష్యత్తుకు తోడ్పాటు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్. రమేష్, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్. రామకృష్ణ, వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు మరియు ఎన్.సి.సి అధికారి కెప్టెన్. డాక్టర్. నీలయ్య, డాక్టర్ మధుసూదన, డాక్టర్ నాగరాజు, డాక్టర్ కృష్ణవేణి, శివరాం, రెడ్డి భాష, రాధిక మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Read More...