మార్కెట్లను పరిశుభ్రంగా ఉంచడం మా బాధ్యత....
- ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా అవగాహన కలిపిస్తాం
- గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి.
ఎల్ బీ నగర్:
మార్కెట్ యార్డులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని, మార్కెట్ కి వచ్చే రైతులకు,వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి తెలిపారు.మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ ను దాదాపు పూర్తి స్థాయిలో శుభ్రం చేయడం జరిగింది.వర్షాకాలం ప్రారంభం దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరక్టర్లు బండి మధుసూదన్ రావు, మెగావత్ గణేష్ నాయక్, చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి, నాయకులు నవీన్, శేఖర్, సాయి,భార్గవ్ అనీల్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
