సర్ ప్రక్రియను పరిశీలించిన మహేశ్వరం ఈఆర్‌వో/ఆర్‌డీఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి

హెల్ప్ డెస్క్ లతో ఊపందుకుకున్న సర్ ప్రక్రియ

సర్ ప్రక్రియను పరిశీలించిన మహేశ్వరం ఈఆర్‌వో/ఆర్‌డీఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి

ఎల్బీనగర్:

ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో మహేశ్వరం నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్ఓ), రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎన్. జగదీశ్వర్ రెడ్డి సరూర్‌నగర్ మండల్, సర్కిల్ పరిధిలోని, క్రాంతినగర్, హుడా కాలనీ, ఆర్కేపురం కమ్యూనిటీ హాల్‌ను సందర్శించి జరుగుతున్న పనులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్‌లో కొనసాగుతున్న సర్ ప్రక్రియ పురోగతిని పరిశీలించిన ఆయన,ఊపందుకున్న సర్ ప్రక్రియ  జరిపే విధానాన్ని,బూత్ లెవల్ అధికారులు సూపర్వైజర్లు, ఎన్నికల సిబ్బందితో సమావేశమై చేపడుతున్న కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, పరిశీలన, ఓటర్ల వివరాల ధ్రువీకరణ, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం, డేటా నమోదు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అనర్హుల పేర్లు తొలగింపు, చిరునామా మార్పులు, ఇతర సవరణల విషయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దరఖాస్తులను వేగంగా స్వీకరించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.
సర్ ప్రక్రియలో పాల్గొంటున్న బీఎల్‌వోలు ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ, అవసరమైన పత్రాల గురించి స్పష్టమైన సమాచారం అందించాలని, ప్రతి దరఖాస్తును నిబంధనలకు అనుగుణంగా పరిశీలించాలని సూచించారు. ఓటరు జాబితాల ఖచ్చితత్వాన్ని పెంపొందించడమే ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
అనంతరం,రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లలో రికార్డులు, దరఖాస్తుల నిర్వహణ విధానం, సిబ్బంది పనితీరును పరిశీలించిన ఈఆర్‌వో/ఆర్‌డీఓ, సర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న అధికారులను అభినందించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ పి. వేణుగోపాల్ ఏఈఆర్ఓ శ్రీనివాస్ రావు, నర్సింగ్ రావు,సూపర్ వైజర్ ప్రవీణ్, బీఎల్ఓలు పాల్గొన్నారు.WhatsApp Image 2026-07-12 at 19.17.44 (1)

About The Author