అంతర్జాతీయం
అంతర్జాతీయం 

అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. లాస్ వెగాస్‌లోని నెవాడా యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లో (UNLV) బుధవారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు. మరొకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని చెప్పారు. ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాల్పులకు తెగబడిన నిందితుడు కూడా మరణించాడని పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడా లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కాల్పుల్లో మరణించిన వారి వివరాలను అధికారులు ఇంకా గుర్తించలేదు. కాల్పుల ఘటన అనంతరం యూనివర్సిటీని పోలీసులు ఖాళీ చేయించారు. ‘యూనివర్సిటీలో ముగ్గురి మ‌ృతదేహాలను గుర్తించాం. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. అతని పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయినవారిలో కాల్పులు జరిపినట్టుగా అనుమానిస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడు.’’ అని లాస్ వెగాస్ మెట్రోపాలిటర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సంఘటన నేపథ్యంలో నెవాడా విశ్వవిద్యాలయం, అన్ని ఇతర దక్షిణ నెవాడా విద్యాసంస్థలను బుధవారం(స్థానిక కాలమానం) మూసివేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. విశ్వవిద్యాలయం సమీపంలోని పలు రహదారులను కూడా పోలీసులు మూసివేశారు. లాస్ వెగాస్ స్ట్రిప్‌కు తూర్పున రెండు మైళ్ల కంటే తక్కువ దూరంలో ఉన్న నెవాడా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో దాదాపు 25,000 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 8,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టరల్ విద్యార్థులున్నారు.
Read More...
అంతర్జాతీయం 

ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలు.. పెరిగిన మృతుల సంఖ్య.. ఇతరుల కోసం గాలింపు

ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలు.. పెరిగిన మృతుల సంఖ్య.. ఇతరుల కోసం గాలింపు ఈ ఘటన గురించి పడాంగ్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి అబ్దుల్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. ‘‘విస్ఫోటనం జరిగే సమయంలో ఆ అగ్నిపర్వత ప్రాంతంలో మొత్తం 75 మంది పర్వతారోహకులు ఉన్నట్లు మా వద్ద సమాచారం ఉంది. వీరిలో 13 మంది మృతి చెందారు. తొలుత ఆదివారం నాడు 11 మంది మృతదేహాలు లభ్యమవ్వగా.. సోమవారం మరో ఇద్దరి డెడ్ బాడీలు దొరికాయి. మేము 53 మందిని రక్షించగలిగాం. అయితే.. మరో 10 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మేము కాపాడిన పర్వతారోహకుల్లో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నాం. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయ బృందాలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి’’ అని తెలిపారు. అగ్నిపర్వత బూడిద కొండ దిగువ భాగానికి చేరుకుందని.. దీంతో సహాయక బృందాలకు సవాలుగా మారిందని అబ్దుల్ మాలిక్ పేర్కొన్నారు. కొండ పై భాగానికి చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయని.. అయితే అవి నీటారుగా, స్లిప్పరీగా ఉన్నాయని అన్నారు. వోల్గానిక్ యాక్టివిటీ, చెడు వాతావరణం కారణంగా.. రెస్క్యూ మిషన్‌కు ఆటంకం కలుగుతోందని ఆయన చెప్పారు. మరోవైపు.. విస్ఫోటనం సంభవించిన ఈ మౌంట్‌ మెరపి ప్రాంతంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అటువైపుకు ఎవ్వరూ రావొద్దని హెచ్చరించారు. పర్వతారోహకులు ట్రెక్కింగ్‌ చేసే సమయంలో ఈ విస్ఫోటనం చోటు చేసుకోవడంతో ప్రాణనష్టం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలావుండగా.. మౌంట్ మెరపి అంటే మౌంటైన్ ఆఫ్ ఫైర్. అంటే.. ఇది ఎల్లప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు, ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే.. దీనిని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా పరిగణిస్తారు. అలాగే.. టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొట్టుకునే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతానికి చేరువలోనే ఇండోనేషియా ఉంటుంది కాబట్టి ఇక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు చోటు చేసుకుంటుంటాయి.
Read More...
అంతర్జాతీయం 

హమాస్ ఆ తప్పు చేయడం వల్లే గాజాలో మళ్లీ బాంబులు.. ఆంటోనీ బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు

హమాస్ ఆ తప్పు చేయడం వల్లే గాజాలో మళ్లీ బాంబులు.. ఆంటోనీ బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ‘విరామం’ ముగియడానికి హమాస్ చర్యలే కారణమని.. అది నిబంధనల్ని ఉల్లంఘించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. దుబాయ్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ విరామం ఎందుకు ముగిసిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విరామం ముగియడానికి ముందే.. హమాస్ నిబంధనల్ని ఉల్లంఘించి, జెరూసలెంలో దారుణమైన ఉగ్రవాద దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు పౌరులు చనిపోగా.. అమెరికన్లతో పాటు ఇతరులు తీవ్ర గాయాలపాలయ్యారు. విరామం ముగిసేలోపే ఆ ఉగ్రసంస్థ రాకెట్లను కాల్చడం మొదలుపెట్టింది. కొంతమంది బందీలను విడుదల చేసే విషయంలో చేసిన కమిట్‌మెంట్స్‌ని కూడా విరమించుకుంది’’ అని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలనేదే అమెరికా ఉద్దేశమని.. ఇజ్రాయెల్ బందీల విడుదలపై యూఎస్ దృష్టి సారించిందని ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. హమాస్ వద్ద బందీలుగా ఉన్న ప్రతి ఒక్కరినీ తమతమ ఇంటికి చేర్చి, వారిని తమ కుటుంబాలతో తిరిగి కలిపేందుకు ఈ ఏడు రోజుల విరామ సమయంలో తాము చేయగలిగిందంతా చేశామన్నారు. ఈ ఏడు రోజుల్లో చాలామంది తిరిగి తమ కుటుంబాలతో కలిశారని చెప్పారు. అక్టోబర్ 7వ తేదీ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలకు తాము మద్దతు ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పౌరులను రక్షించడం, అవసరమైన వారికి మానవతా సహాయం అందేలా చూసుకోవడం ముఖ్యం కాబట్టి.. దానిపైనే దృష్టి పెడుతున్నామని, ఆ రెండు వ్యవహారాలను ఒకే సమయంలో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సంఘర్షణ మరింత వ్యాప్తి చెందకుండా, ఇతర ప్రదేశాల్లో పెరగకుండా సాధ్యమైనంత కసరత్తులు చేస్తున్నామన్నారు. ఇదిలావుండగా.. అక్టోబర్ 24వ తేదీన ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజాలో కాల్పుల విరమణ, బందీల బదిలీ ఒప్పందం కుదిరింది. దీంతో.. ఏడు రోజుల పాటు ఎలాంటి దాడులు చోటు చేసుకోలేదు. మొదట్లో ఈ ఒప్పందం నాలుగు రోజులకే కుదరగా.. బందీల విడుదల కోసం అదనంగా మరో మూడు రోజులు పొడిగించారు. శుక్రవారం ఈ గడువు ముగియడంతో.. మళ్లీ పరస్పర దాడులు మొదలయ్యాయి. ఈ ఒప్పందాన్ని హమాస్ ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తూ.. గాజాలో వైమానిక, భూతల దాడులకు దిగింది. ఈ దాడుల కారణంగా.. పాలస్తీనా ప్రజల ప్రాణాలు అన్యాయంగా గాల్లో కలిసిపోతున్నాయి.
Read More...
అంతర్జాతీయం 

ఎనిమిది కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ వింత విజ్ఞప్తి

ఎనిమిది కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ వింత విజ్ఞప్తి వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో రష్యా జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని దేశ మహిళలను కోరారు. పాత తరం ప్రజలు నలుగురు లేదా ఐదుగురు పిల్లల్ని కనడం వల్లనే మన సమాజం బలంగా ఏర్పడిందని అన్నారు. అమ్మమ్మలు, నానమ్మలకు ఏడు, ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కలిగి ఉండేవారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని కాపాడుకుందామని.. దాన్ని పునరుజ్జీవింపజేద్దామని పిలుపునిచ్చారు. పెద్ద కుటుంబాలు రష్యా ప్రజలందరికీ కట్టుబాటు, జీవన విధానంగా మారాలన్నారు. కుటుంబం అనేది కేవలం సమాజానికి పునాది మాత్రమే కాదని.. ఆధ్యాత్మికతకు, నైతికతకు నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాల వారు రష్యా జనాభాను సంరక్షించడం, పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని.. తద్వారా ప్రపంచంలో రష్యా మరింత బలోపేతం అవుతుందని పుతిన్ చెప్పుకొచ్చారు. ఇదిలావుండగా.. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యన్స్ మరణించిన సంఖ్య సుమారు 3,00,000 దాడి ఉంటుందని యూకే రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే.. 8,20,000 నుంచి 9,20,000 మంది వరకు రష్యన్ పౌరులు దేశం విడిచి పారిపోయి ఉంటారని ‘రష్యా పాలసీ గ్రూప్‌’ పేర్కొంది. దీనికితోడు.. ఉక్రెయిత్‌తో యుద్ధం కారణంగా పలు పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో, రష్యా తీవ్రమైన కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి కారణమవుతోందని అంతర్జాతీయ ఆర్థిక రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే.. దేశ జనాభాను పెంచడంలో ఆ దేశం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని మహిళలకు పిలుపునిస్తోంది. 2023 జనవరి 1న రష్యా జనాభా 146,447,424గా ఉంది. 1999లో పుతిన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ఆ సంఖ్య తగ్గుతూ వస్తోందని ఓ నివేదిక వెల్లడించింది.
Read More...
అంతర్జాతీయం 

గురుపత్వంత్ హత్యకు కుట్ర కేసు.. భారత్ దర్యాప్తుపై అమెరికా కీలక వ్యాఖ్యలు

గురుపత్వంత్ హత్యకు కుట్ర కేసు.. భారత్ దర్యాప్తుపై అమెరికా కీలక వ్యాఖ్యలు Antony Blinken: అమెరికా గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ని హత్య చేసేందుకు కుట్ర పన్నారని, దీనిని తాము భగ్నం చేశామని ఇటీవల అమెరికా అధికారులు భారత్‌కు తెలియజేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్రలో భారత ప్రభుత్వ అధికారి ప్రమేయం ఉందన్న ఆరోపణలను వాషింగ్టన్ తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో ఉన్న బ్లింకెన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఆంటోనీ మాట్లాడుతూ.. ఈ కేసు సబ్ జ్యూడీస్ (న్యాయపరమైన పరిశీలన పెండింగ్‌లో ఉండటం) అయినందున తాను వివరింగా వ్యాఖ్యానించలేనని అన్నారు. అయితే.. పన్నూన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై భారత ప్రభుత్వం ప్రారంభించిన దర్యాప్తును తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. ఈ అంశాన్ని తాము చాలా సీరియస్‌గా తీసుకున్నామన్న ఆయన.. గత వారంలోనే దీని గురించి భారత ప్రభుత్వంతో నేరుగా లేవనెత్తామని పేర్కొన్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వం దీనిపై విచారణ జరుపుతున్నట్లు ప్రకటించిందని.. ఇది మంచి పరిణామమని.. ఈ దర్యాప్తుని భారత ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందో చూసేందుకు ఉత్సుకతతో ఉన్నానని చెప్పుకొచ్చారు. భారతదేశం ఒక వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగుతోందని.. దానిని మరింత మెరుగుపరిచేందుకు, బలోపేతం చేసేందుకు తాము భారత్‌తో కలిసి పని చేస్తూనే ఉంటామని ఆంటోనీ బ్లింకెన్ స్పష్టం చేశారు. అంతకుముందు.. వైట్‌హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ కూడా పన్నూన్ హత్యకు కుట్ర కేసుపై భారత్ ప్రారంభించిన దర్యాప్తుపై స్పందించారు. భారత్ కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని, దీనిపై దర్యాప్తు ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. కాగా.. పన్నూన్ హత్యకు విఫలమైన కుట్రలో భారత పౌరుడు నిఖిల్ గుప్తా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడం గమనార్హం.
Read More...
అంతర్జాతీయం 

అంజు కేసులో కొత్త ట్విస్ట్.. భర్త బయటపెట్టిన సంచలన రహస్యాలు.. మరో రెండు రోజుల్లో..

అంజు కేసులో కొత్త ట్విస్ట్.. భర్త బయటపెట్టిన సంచలన రహస్యాలు.. మరో రెండు రోజుల్లో.. Anju Pakistan: రాజస్థాన్‌కు చెందిన అంజు అనే మహిళ గుర్తుందా? అదేనండి.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన నస్రుల్లా అనే వ్యక్తి కోసం భర్త, పిల్లల్ని వదిలేసి పాకిస్తాన్‌కి వెళ్లింది. మొదట్లో అతడు కేవలం స్నేహితుడు మాత్రమేనని చెప్పిన అంజు, ఆ తర్వాత అతడ్ని పెళ్లి చేసుకుంది. అప్పుడే ఇస్లాం మతంని స్వీకరించి, ఫాతిమాగా మారింది. అప్పటి నుంచి ఫాతిమా, నస్రుల్లా దాంపత్య జీవితం సజావుగానే సాగింది. ఇప్పుడు వీరి వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. మరో రెండు రోజుల్లో ఫాతిమా అలియాస్ అంజు తిరిగి భారతదేశానికి రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త నస్రుల్లా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అంతేకాదు.. తానే అంజును భారత సరిహద్దు వద్ద దింపబోతున్నట్టు తెలిపాడు. ఇంకా మరెన్నో విషయాల్ని బయటపెట్టాడు. ఓ పాకిస్తానీ యూట్యూబర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నస్రుల్లా మాట్లాడుతూ.. తనకు, అంజుకి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడిందని, ఆమ్‌వే (Amway) కంపెనీ ఉత్పత్తికి సంబంధించి తమ మధ్య తొలి సంభాషణ ప్రారంభమైందని అన్నాడు. అప్పటి నుంచి క్రమంగా తమ సంభాషణ సాగిందని.. ఈ క్రమంలోనే తామిద్దరం ప్రేమలో పడ్డామని పేర్కొన్నాడు. మొదట్లో తానే తన ప్రేమని అంజుకి వ్యక్తపరిచానని, ఆమె వెంటనే అంగీకరించిందని తెలిపాడు. తన కోసం అంజు రావల్పిండికి వచ్చిందని.. తాను ఆమెని పికప్ చేసుకోవడానికి వెళ్లానని చెప్పాడు. సీమా హైదర్‌ను అంజుతో ఏమాత్రం పొల్చవద్దని కోరాడు. సీమా అక్రమంగా భారత్‌కు వెళ్లగా.. అంజు మాత్రం పర్యాటక వీసాతో పాకిస్తాన్‌కు వచ్చిందని వివరించాడు. ప్రస్తుతం అంజు విడాకుల కోసం భర్తతో గొడవ పడుతోందని, అతడు మాత్రం విడాకులపై సంతకాలు చేయడం లేదని వెల్లడించాడు. అంజు ఒక క్రిస్టియన్ అని, తన ప్రేమ కోసం ఆమె మతాన్ని త్యాగం చేసి ఇప్పుడు ఫాతిమాగా మారిందని చెప్పుకొచ్చాడు. తమ ప్రేమకథ గురించి తెలిసి పాకిస్తానీయుల వద్ద నుంచి ఎన్నో బహుమతులు వచ్చాయని, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయని నస్రుల్లా తెలిపాడు. ఇండియాలో అంజుకి ఇద్దరు పిల్లలు ఉన్నారని, కేవలం వారి కోసమే అంజు భారత్‌కి వెళ్తోందని చెప్పాడు. ఈ నెలాఖరున అంజు ఇండియాకి వెళ్తుందని, అందుకు సంబంధించిన పత్రాలు సిద్ధంగా ఉన్నాయని అన్నాడు. పిల్లల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది అంజుకే వదిలేశానన్నాడు. తమ ప్రేమ కరోనా కంటే ముందే మొదలైందని, గత నాలుగేళ్లుగా తాను అంజుని ప్రేమిస్తున్నానని నస్రుల్లా స్పష్టం చేశాడు. అటు.. అంజు సైతం తనపై వచ్చిన ప్రతి ఆరోపణకు భారతదేశానికి వచ్చి సమాధానం ఇస్తానని క్లారిటీ ఇచ్చింది.
Read More...
అంతర్జాతీయం 

మసీదులను కూల్చివేయాలన్న స్వీడిష్ నాయకుడి ప్రకటనపై వివాదం.. ప్రధానికి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి

మసీదులను కూల్చివేయాలన్న స్వీడిష్ నాయకుడి ప్రకటనపై వివాదం.. ప్రధానికి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఒక హోదాలో ఉన్న నాయకులు అప్పుడప్పుడు తమ నోటికి పని చెప్తుంటారు. సున్నితమైన విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసి, సరికొత్త వివాదాలకు తెరలేపుతుంటారు. ముఖ్యంగా.. మతపరమైన అంశాల జోలికి వెళ్లి, లేనిపోని రాద్ధాంతాలు సృష్టిస్తుంటారు. తాజాగా స్వీడెన్‌కి చెందిన జిమ్మీ అకెసన్ అనే నాయకుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రజాస్వామ్య వ్యతిరేక, స్వీడిష్ వ్యతిరేక, యూదు వ్యతిరేక ప్రచారాన్ని వ్యాప్తి చేసే మసీదులను ఆక్రమించుకొని.. వాటిని కూల్చివేయాలని కుండబద్దలు కొట్టాడు. దీంతో.. ఈ వ్యాఖ్యలకు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపాయి. చివరికి.. ఆ దేశ ప్రధాని దిగొచ్చి, దీనిపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న స్వీడన్ డెమొక్రాట్స్ (ఎస్‌డి) పార్టీ నాయకుడు జిమ్మీ అకెసన్ నవంబర్ 26వ తేదీన జరిగిన పార్టీ వార్షిక కాంగ్రెస్‌లో ఆ వ్యాఖ్యలు చేశాడు. ప్రజాస్వామ్య వ్యతిరేక, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే మసీదుల్ని స్వాధీనం చేసి.. వాటిని పడగొట్టడం మనం ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తారాస్థాయిలో వివాదం నెలకొనడంతో.. స్వీడన్ ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఒక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. ఆ ప్రకటనలో జిమ్మీ చేసిన వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండించారు. తన భావాలను వ్యక్తీకరించడం అవమానకరమైన మార్గాని తాను భావిస్తున్నానని అన్నారు. ఇలాంటి ప్రకటనలు అంతర్జాతీయ ముప్పుకి దారి తీస్తాయని.. స్వీడన్ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఎక్స్ వేదికగా కూడా స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అకెసన్ ప్రకటన తర్వాత ఇతర దేశాల నుండి వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని.. ‘‘స్వీడన్‌లో మేము ప్రార్థనా స్థలాలను నాశనం చేయం. ఒక సమాజంగా మనం హింసాత్మక తీవ్రవాదంతో పోరాడాలి. దాని ప్రాతిపదిక ఏదైనప్పటికీ.. ప్రజాస్వామ్య, ఉదారవాద రాజ్యం చట్రంలో మనం అలా చేయాలి’’ అని పోస్టులో రాసుకొచ్చారు. మరోవైపు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన జిమ్మీ అకెసన్‌ వ్యాఖ్యలను అధికారికంగా ఖండించాలని, మంత్రివర్గంలో పనిచేస్తున్న స్వీడన్ డెమొక్రాట్స్ సభ్యుల్ని తొలగించాలని ప్రధాని క్రిస్టర్సన్‌ను మాజీ ప్రధాని మాగ్డలీనా ఆండర్సన్ డిమాండ్ చేశారు.
Read More...
అంతర్జాతీయం 

అమెరికాకి గ్రీన్ సిగ్నల్.. కెనడాకి రెడ్ సిగ్నల్.. అందుకు భారత్ ప్రతీకారం

అమెరికాకి గ్రీన్ సిగ్నల్.. కెనడాకి రెడ్ సిగ్నల్.. అందుకు భారత్ ప్రతీకారం India-Canada Row: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య చెలరేగిన దౌత్యపరమైన వివాదం.. నానాటికీ పెరుగుతూనే ఉంది. నిజ్జర్ హత్యలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిరాధార ఆరోపణలు చేయడం, ఈ ఆరోపణల్ని నిరూపించే ఎలాంటి ఆధారాలు ఇవ్వకపోవడం, భారత దౌత్యాధికారిని ఉన్నపళంగా బహిష్కరించడం వల్లే.. ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి తరుణంలో.. కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ కెనడాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము గురుపత్వంత్ హత్యకు కుట్ర కేసులో అమెరికాకి పూర్తి సహకారం ఇస్తాం గానీ.. నిజ్జర్ హత్య కేసులో కెనడా దర్యాప్తుకు భారత్ ఏమాత్రం సహకరించబోందని కుండబద్దలు కొట్టారు. ఈ భిన్న వైఖరికి గల కారణాలేంటో కూడా ఆయన వివరించారు. కెనడాలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. ‘‘నిజ్జర్ హత్య కేసులో మా ప్రధాన దౌత్యవేత్తల్లో ఒకరిని బహిష్కరించడం వల్ల మేము కెనడాపై ప్రతీకార చర్యల్ని మొదలుపెట్టాం. ఏ పని చేసినా, దానికి కచ్ఛితంగా రియాక్షన్ ఉంటుంది. అందుకే.. న్యూఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తలను దేశం విడిచి వెళ్లాలని కోరాం. జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేసిన తర్వాత భారత్‌లో భావోద్వేగాలు దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్య కేసులో ఎలాంటి విచారణ చేపట్టకుండానే భారత్‌ని కెనడా దోషిగా నిలబెట్టింది. ఇదేనా చట్టబద్ధత? కెనడాలో ఏదైనా ఖచ్చితమైన సాక్ష్యం ఉంటే.. అది మాకు చెప్పాలని, దానిపై మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని మేము చెప్తూనే వస్తున్నాం. కానీ.. కెనడా నుంచి ఎలాంటి నిర్దిష్టమైన సమాచారం అందలేదు. అలాంటప్పుడు ఆ కేసుపై మేమెలా స్పందించగలం? ఈ కేసుకి సంబంధించిన సమాచారం ఇవ్వనంతవరకూ కెనడా దర్యాప్తుపై మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేం’’ అని ఆయన చెప్పుకొచ్చారు ఇక గురుపత్వంత్ హత్యకు కుట్ర కేసులో అమెరికా అధికారులు నిర్దిష్టమైన సమాచారాన్ని భారత్‌తో పంచుకున్నారని సంజయ్ కుమార్ తెలిపారు. అమెరికాలో గ్యాంగ్‌స్టర్లు, మాదక ద్రవ్యాల రవాణదారులు, ఉగ్రవాదుల గురించి ఆ అగ్రరాజ్యం కీలక సమాచారాల్ని అందజేసిందని.. గురుపత్వంత్ హత్య కుట్రకు భారత్‌లో ఉన్నవారికి సంబంధం ఉండొచ్చని అమెరికా భావించిందని అన్నారు. న్యాయపరంగా ఆ సమాచారం సమర్థించదగినది కావడంతో.. అమెరికా దర్యాప్తుకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు. కానీ.. కెనడా మాత్రం అలాంటి కచ్ఛితమైన ఆధారాలు ఇవ్వలేదన్నారు. నిజ్జర్ హత్యలో భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదని మరోసారి పునరుద్ఘాటించిన ఆయన.. కెనడియన్ భూమిని భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. కెనడాలో చాలామంది ఉగ్రవాదులు ఖలిస్తానీ మనస్తత్వానికి చెందిన వారేనని, కొందరు భారత్‌లో ముఠాలు నడుపుతున్నారని పేర్కొన్నారు.
Read More...
అంతర్జాతీయం 

ప్రేమించుకోండి, పిల్లల్ని కనండి.. సౌత్ కొరియా ప్రభుత్వం కొత్త ప్రయోగం

ప్రేమించుకోండి, పిల్లల్ని కనండి.. సౌత్ కొరియా ప్రభుత్వం కొత్త ప్రయోగం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. 20 నుంచి 30 ఏళ్ల మధ్య రిలేషన్‌షిప్ లేని సింగిల్స్ మధ్య ప్రేమ చిగురించడమే. ఎవరైతే ఒంటరిగా ఉంటూ ప్రేమ కోసం పరితపిస్తున్నారో.. వాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అప్లై చేసుకోవాలి. ఇలా దరఖాస్తులు చేసుకున్న వారిని ఒక హోటల్‌లో ప్రవేశపెడతారు. ప్రతి ఒక్కరికీ నేమ్ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. పురుషులు, మహిళల్ని పక్కపక్కనే నిల్చోబెడతారు. ఇంతలో రిలేషన్‌షిప్ కోచ్ అక్కడికి వచ్చి.. అందరినీ పలకరిస్తాడు. అనంతరం ‘రాక్-పేపర్-సిజర్’ ఆటని ప్రారంభిస్తాడు. ఈ ఆటలో భాగంగానే.. పరిచయాలు పెరగడం, జంటల మధ్య ప్రేమ చిగురించడం జరుగుతుంది. ఈ ఒక్క ఆట మాత్రమే కాదు.. మరెన్నో క్రీడలు నిర్వహిస్తారు. వారికి రెడ్ వైన్స్‌తో పాటు చాక్లెట్స్, ఉచిత మేకప్ సర్వీసులు కూడా అందజేస్తారు. వీలైతే.. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం తనిఖీ చేసి, ఫలానా వ్యక్తులు మంచివారా? కాదా? అనేది కూడా స్థానిక ప్రభుత్వమే నిర్ధారిస్తుంది. ఈ సంవత్సరంలో మొత్తం ఐదు ఈవెంట్లు నిర్వహించగా.. 460 మంది పాల్గొన్నారు. అందులో 198 మంది ‘జంటలు’గా ఈవెంట్ నుండి నిష్క్రమించారు. సిటీ గవర్నమెంట్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల లీ యు-మి ఈ ఈవెంట్ గురించి మాట్లాడుతూ.. తాను ఈ ఈవెంట్‌లో పాల్గొనడానికి మూడు సార్లు దరఖాస్తు చేశానని, చివరికి తనకు మూడోసారి స్పాట్ కన్ఫమ్ అయ్యిందని తెలిపారు. సెప్టెంబర్‌లో ఈ ఈవెంట్‌లో పాల్గొన్న హ్వాంగ్ డా-బిన్ మాట్లాడుతూ.. ఇతర సామాజిక ఈవెంట్‌లలో చేరడానికి లేదా ప్రొఫెషనల్ డేటింగ్ ఏజెన్సీలకు సైన్ అప్ చేయడానికి అయ్యే ఖర్చును ఇది ఆదా చేసిందని చెప్పారు. తాము నిజమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం చేయగలిగినదంతా చేయాలని, ఇది కూడా ఒక మంచి కార్యక్రమమే అని కొనియాడారు. అయితే.. ఇదొక అర్థంలేని కార్యక్రమమని, దీని ద్వారా జననాల రేటు పెరుగుతుందని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని కొందరు విమర్శిస్తున్నారు. ఇదిలావుండగా.. దక్షిణ కొరియా సంతానోత్పత్తి రేటు గత సంవత్సరం రికార్డు స్థాయిలో 0.78కి పడిపోయింది. అంటే.. ఒక మహిళకు కనీసం ఒక పిల్ల కూడా లేదని అర్థం. దీంతో.. ప్రతి స్త్రీకి ప్రపంచంలోనే అతి తక్కువ సంఖ్యలో పిల్లలను కలిగి ఉన్న దేశంగా దక్షిణ కొరియా భయంకరమైన రికార్డ్‌ని నమోదు చేసింది. అందుకే.. జననాల రేటుని పెంచేందుకు ఈ రకమైన ‘మ్యాచ్-మేకింగ్’ కార్యక్రమాలకు దక్షిణ కొరియా శ్రీకారం చుట్టింది. ఇక అమెరికాలో జననాల రేటు 1.66 (2021), జపాన్‌లో 1.3గా ఉంది.
Read More...
అంతర్జాతీయం 

అమెరికాలో కాల్పులు.. ప్రాణాలు కోల్పోయిన భారతీయ విద్యార్థి

అమెరికాలో కాల్పులు.. ప్రాణాలు కోల్పోయిన భారతీయ విద్యార్థి వాషింగ్టన్‌: అమెరికాలో(America) గన్ కల్చర్(Gun Culture) మళ్లీ పెచ్చుమీరుతోంది. తాజాగా భారతీయ విద్యార్థి వెళ్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తి తుపాకితో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో విద్యార్థి విగతజీవిగా మారాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ కి చెందిన ఆదిత్య(26) అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాట్‌ మెడికల్ స్కూల్‌లో చదువుతున్నాడు. వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో కారు డ్రైవ్ చేస్తున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్తస్రావం అవుతున్న అతన్ని పోలీసులు యూసీ మెడికల్ సెంటర్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. దుండగుడ్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అతని మృతిపై అతను చదువుతున్న కాలేజీ యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఉత్తర భారత్‌కు చెందిన ఆదిత్య 2018లో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఓ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ చదివాడు. 2020లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు. అనంతరం వైద్య విద్యలో ఉన్నత చదువుల నిమిత్తం యూఎస్ వెళ్లిపోయాడు. కాల్పుల ఘటన నిందితుడు ఇంకా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Read More...
అంతర్జాతీయం 

ప్రపంచ శాంతికి హిందుత్వ విలువలే స్ఫూర్తి : థాయ్ ప్రధాని

ప్రపంచ శాంతికి హిందుత్వ విలువలే స్ఫూర్తి : థాయ్ ప్రధాని బ్యాంకాక్: శాంతిని ప్రబోధించే హిందూ జీవన విలువలతోనే ప్రపంచ శాంతి సాధ్యమని థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి స్రెట్టా థావిసిన్‌ కొనియాడారు. ప్రపంచం కల్లోల పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు అహింస, సత్యం, సహనం, సామరస్యం వంటి హిందూ విలువలను స్ఫూర్తిగా తీసుకోవాలని, అప్పడు మాత్రమే ప్రపంచంలో శాంతి సాధ్యమని అన్నారు. బ్యాంకాక్‌లో శుక్రవారంనాడు మూడవ ప్రపంచ హిందూ మహాసభలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలకు థాయ్‌లాండ్ ఆతిథ్యం ఇస్తోంది. ప్రారంభ సదస్సులో కారణాంతరాల వల్ల స్రెట్రా థావిసిన్ హాజరుకానప్పటికీ, ఆయన తన సందేశాన్ని పంపారు. ప్రధాని సందేశాన్ని సభలో వినిపించారు. హిందూయిజం సిద్ధాంతాలు, విలువలపై ఏర్పాటు చేసిన ప్రపంచ హిందూ మహా సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తన సందేశంలో పేర్కొన్నారు. శాంతియుత సహజీవనాన్ని వేదాలు తెలియజేస్తున్నాయని, శాంతియుత విధానాలకు ఈ సిద్ధాంతాలే మూలమని అన్నారు. మూడవ ప్రపంచ హిందూ మహాసభలకు మాతా అమృతానందమయి, భారత్ సేవాశ్రమ్ సంఘ్‌కు చెందిన స్వామి పూర్ణాత్మానంద్, ఆర్ఆర్ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహనరావు భగవత్, సర్‌కార్యవహ్ దత్తాత్రేయ హోసబలె, వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే, ఫౌండర్ ఫెలిసిటేటర్ ఆఫ్ ది ప్రోగ్రాం స్వామి విజ్ఞానంద్ హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. 61 దేశాలకు చెందిన 2200 మంది ప్రతినిధులను ఈ మహాసభలకు ఆహ్వానించారు. 25 దేశాలకు చెందిన ఎంపీలు, మంత్రులు హాజరవుతున్నారు. థాయ్‌లాండ్‌లో ఉంటున్న 10 లక్షల మంది భారత సంతతి ప్రజలు ఇందులో పాల్గోనున్నారు. ఈనెల 24 నుంచి 26 వరకూ మూడురోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి.
Read More...
అంతర్జాతీయం 

12 మంది థాయ్, 13 మంది ఇజ్రాయెల్ బందీలు విడుదల

12 మంది థాయ్, 13 మంది ఇజ్రాయెల్ బందీలు విడుదల న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన సంధి ఆచరణలోకి వచ్చింది. 12 మంది థాయ్‌లాండ్ బందీలను హమాస్ విడుదల చేసింది. ఈ విషయాన్ని థాయ్‌లాండ్ ప్రధాని థావిసిన్ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. హమాస్ చెర నుంచి విడుదలైన బందీలను తీసుకొచ్చేందుకు ఎంబసీ అధికారులు వెళ్తున్నారని ఆయన వివరించారు. ఈ విషయాన్ని థాయ్‌లాండ్ భద్రతా విభాగం, విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించాయని చెప్పారు. ఎంబసీ అధికారులు త్వరలోనే బందీలను రిసీవ్ చేసుకోనున్నారని, వారి పేర్లు, వివరాలు త్వరలో వెల్లడికానున్నాయని థావిసిన్ తెలిపారు. గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణ సంధిలో భాగంగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 39 మంది పాలస్తీనియన్ ఖైదీలను పొరుగున ఉన్న ఈజిప్ట్‌కు అప్పగించనుండగా.. 13 మంది ఇజ్రాయెలీ బందీల సమూహాన్ని ఇజ్రాయెల్‌కు అప్పగించనున్నారు. కాగా బందీలను రెడ్‌క్రాస్‌కు అప్పగించనున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కొంతమంది ఇజ్రాయెలీ బందీలను వారి దేశానికి అందించడంలో భాగంగా అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీకి అప్పగించినట్టు హమాస్‌కు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయని అంతర్జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య 4 రోజులపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం
Read More...