సినిమా
సినిమా 

శివుడు, విష్ణువుల అవతారం ఈ 'వీరమల్లు'

శివుడు, విష్ణువుల అవతారం ఈ 'వీరమల్లు' పవన్ కళ్యాణ్ నూతన చిత్రం 'హరి హర వీరమల్లు' తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా రూపొందించబడిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదు. ఈ చిత్రం నిజ జీవితంలోని ఏ ఒక్క నాయకుడి కథ ఆధారంగానూ తెరకెక్కలేదు. సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా...
Read More...
సినిమా 

హాస్య నటుడే రాజైతే..!

హాస్య నటుడే రాజైతే..! తెనాలి రామకృష్ణుడు, బీర్బల్, నస్రుద్దీన్, బస్టర్ కీటన్, ఎవరంటే ఠకీమని చెప్పగలం. కాని వారి వారి కాలంలోని ఏలికలు ఎవరంటే మాత్రం తలగోక్కోవాల్సిందే! “కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేరీ..!” అని వేడుకోవాల్సి ఉంటుంది మరి. నువ్వు నాకు అదనంగా ఏమిస్తావు? నేను నిన్నే ఎందుకు? పెళ్లాడాలని అమ్మాయి అడిగితే, “నవ్విస్తానన్నాడట!” ఆ ప్రేమికుడు. అతన్ని ఆ అమ్మాయి పెళ్ళాడిందో లేదో తెలియదు గాని, జీవితాంతం నవ్వుతూ బతకగలిగితే అంతకన్నా ఎవరికైనా మరేం కావాలి? “నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును..” అంటాడు జాషువా ‘నవ్వుతూ బతకాలిరా! తమ్ముడూ నవ్వుతూ చావాలిరా! అని కోరుకోనిది ఎవరు? నవ్వితే కడుపు ఉబ్బుతుంది. ఒక్కొక్కసారి పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వుతాం! నవ్వు విషయంలో ఇహ చాల్లే.. అనే మాట రాదు.. తలుచుకొని.. తలుచుకొని నవ్వుతాం! ఇది చాలదు? జీవితానికి మణులూ, మాన్యాలూ కావాలా..? వాటిని ఏం చేసుకుంటాం? :: అంతా నటించే వాళ్లే..! తూర్పు ఐరోపాలో నల్ల సముద్రం అంచున ‘ఉక్రెయిన్’ అని ఒక దేశం ఉంది. ఆ మధ్య ఆ దేశంలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అతిరథ మహారథ వీర శూర దేశాధ్యక్షుడు పెత్రో పొరోషెంకో ను ప్రజలు చిత్తుగా ఓడించారు. టీ.వీ. హాస్య నటుడు (కమెడియన్) వొలొదిమీర్ జిలెనిష్కీ 73 శాతం ఓట్లతో ఘనవిజయం సాధించాడు. ఇదేంటి? నేనే కమెడియన్ అనుకుంటే నన్ను మించిన కమెడి చేశారేంటి? ఈ జనం. అని, కావలసినంత విస్తు పోయి, బోలేడు బోలెడు ఆశ్చర్యపోయి, తనను తాను గిల్లి చూసుకొని, “కలయో వైష్ణవ మాయో..” అని, కాసేపు సందిగ్ధపడి, అంతలోనే తేరుకొని, నిజమేనని తెలుసుకొని, “నన్ను ఎన్నుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఏమాత్రం నిరాశ పరచను.” అని, దేశ ప్రజలకు జలవిష్కి దేశ ప్రజలకు తొలి సందేశాన్ని ఇచ్చాడు. నిజమైన హామీనే ఇచ్చాడు అతడు. సినిమాల్లో, టీ.వీ. సీరియల్ లో అతడు జనాన్ని ఏనాడు నిరాశ పరచలేదు. మన సార్లలా కాదు. చెప్పిందే చేస్తాడు. చెప్పనివీ చేసి చూపిస్తాడు. ఆసక్తి కలిగిన వారు ఆయన యూట్యూబ్లో చూసి తెలుసుకోవచ్చు. పదవిలోకి వచ్చాక కూడా నటిస్తారా? అని ఓ విలేకరి అడిగితే, చిరునవ్వుతో.. నటించనిది ఎవరు? చెప్పండి. నేను నటిస్తానని నర్మగర్భంగా సమాధానం ఇచ్చాడట! పదవిలో నటిస్తాడో పదవిలో ఉండి (మన సీనియర్ ఎన్టియార్ గారి) లాగా సినిమాల్లో నటిస్తాడో సెలవియ్యలేదు. కానీ అంతా నటించే వాళ్లే అనే సత్యం మాత్రం చక్కగా చెప్పాడు. కలకాలం చల్లగా ఉండదగినవాడు సత్యాలు చెప్పేవారు ఎవరుంటారు? చెప్పండి. అలా చెప్పి జిలెనిష్కీలా గెలవగలరా? ఈ ప్రపంచాన్ని నానావిధ వంశాలు పరిపాలించాయి కదా! మన దేశాన్ని బానిస వంశస్థులు కూడా పరిపాలించారు. కానీ ఏ దేశాన్ని ఇప్పటిదాకా ఓ కమెడియన్ (హాస్య నటుడు) పరిపాలించిన దాఖలాలు లేవనే చెప్పాలి. కానీ తూర్పు ఐరోపాలో మాత్రం జిలెనిష్కీ రూపంలో ఆపొద్దు పొడిచిందనే చెప్పవచ్చు. :: కమెడియన్ రాజైతే ఆ మజాయే వేరు:: ఋషి కాని వాడు రాజు కాజాలడు అన్నారు పెద్దలు. ఆ భావన దేహం నిండా నిండి ఋషులు రాజులూ, రాజులు ఋషులూ , రాజ ఋషులూ, రుషి రాజులూ అవుతున్నారు. (రూపబభేదాలను పట్టించుకోవాల్సిన పనిలేదని ధర్మశాస్త్రం చెబుతుంది.) కానీ హాస్యగాళ్లూ, కమెడియన్లూ, జగ్లర్లూ రాజ్యం చేస్తే అదో అద్భుత లోకంలా విలసిల్లుతుందని మాత్రం ఘంటాపథంగా చెప్పగలం. ఆ ఆలోచనే సుందరంగా ఆనందంగా అగుపిస్తుంది. “ఏమిస్తావంటే? నవ్విస్తానని చెబుతారుగా.. కనీసం! కామెడీ చేసిన, చేస్తున్న ప్రభువులు కోకొల్లలు. తాము చేసే కామెడీ సరిపోవట్లేదనుకుంటే బీర్బల్ లాంటి, తెనాలి రామకృష్ణుడు లాంటి కమెడియన్లను నియమించి, ఆనందింపజేసిన రారాజులకు కొదువే లేదు. అంతేగాని నేరుగా కమెడియన్ ప్రభువైపోతే ఆ మజాయే వేరప్ప! “పేరయ్య గారెల్లి రాజంటా పేరెల్లి సరసనా రాణంటా” అని పాడుకోవచ్చు. అంటాం గానీ మన దగ్గర మాత్రం హాస్య పాత్రలు లేని ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి. ఉంటే కార్టూన్స్, హాస్య రచయితలు బతికి బట్టకట్టేవారా? వాళ్లు ఎవరినేది? స్థల కాలాలను బట్టి మీరే ఊహించుకోవాలి. ఒకప్పుడు రాజ్ నారాయణ్ (గుర్తున్నాడా జనతా పార్టీ), లాలు ప్రసాద్ యాదవ్ (గడ్డి కుంభకోణం) అలా పరంపర కొనసాగుతూనే ఉంది. లేకుంటే పాలన దేశం నిస్సారమైపోయేది. వేదనాభరితమైపోయేది. ఇక మన తెలుగు రాష్ట్రానికి వస్తే, టంగుటూరి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి మీద ఎన్నో జోకులు వినపడేవి. వారి మాటలే హాస్యభరితంగా ఉండేవి. ఇప్పటికీ ప్రజల నాలుకల మీద వారి హాస్యక్తులు తొణకిస లాడుతూనే ఉంటాయి. :: కమెడియన్లు వర్ధిల్లాలి:: కామెడీ ప్రభుత్వం పై కామెడీ కథలు కూడా మన సాహిత్యంలో నిండా ఉన్నాయి. పరిపాలనలో హాస్యం తగ్గితే కష్టం. నవ్వులాట లేకపోతే వ్యవహారం సీరియస్ గా మారుతుంది. జనం సీరియస్ విషయాల గురించి సీరియల్ గానే అడుగుతారు. “మడిశన్నాక కూసింత కలాపోసణ ఉండాల” అన్నట్లు సర్కారులకు ఉండాలి. లేకుంటే కష్టమైపోతుంది. కమెడియన్లు ఉండాలి. ఇంత పెద్ద దేశం మనది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కనుక మరెంతోమంది కమెడియన్లు మన దగ్గర వర్ధిల్లాలి. ఒక ఉక్రెయిన్ లో మాత్రమే ఎందుక? అమెరికాలో ఎలాగూ (డోనాల్డ్ ట్రంప్) ఉన్నాడనుకోండి. కులాలకు, మతాలకు, మహిళలకు లెక్కలు వేసి మరీ ప్రాతినిథ్యం కల్పిస్తున్నట్లుగానే, మన దగ్గర కూడా కమెడియన్లకు తగిన ప్రాధాన్యతనివ్వాలి. అలా చేస్తే వారి గెలుపు గ్యారెంటీ..! మానిఫెస్టోలను సైతం కమెడియన్లతో రాయిస్తే మంచిది. ఇంతకన్నా హాస్య భరితంగా తయారుచేస్తే లక్ష కాపీలు గ్యారంటీగా అమ్ముడుపోతాయి. ఎవరి షోలు వాళ్లే ఏర్పాటు చేసుకొని బాగా రక్తి కట్టిస్తారు జనాలను లారీల్లో తోలుకొచ్చే పని ఉండదు. కమెడియన్ల షో అంటేనే జనాలు తండోపతండాలుగా విరగబడి వస్తారు. కాని సీరియస్ మొఖాలను ఎవరు చూస్తారు? జనం వచ్చాక కమెడియన్ షో ఎంత దాకా ఉంటుందో, అంతసేపే సభలో జనం కూర్చుంటారు. అంతేకాదు. గెలిచాక కమెడియన్స్ ఏమేం చేస్తారో జనానికి స్పష్టంగా తెలిసే ఉంటుంది. కనుక ఎంత ఆశ పెట్టుకోవాలో అంతే ఆశ పెట్టుకుంటారు. పదే పదే ఫిర్యాదులు ఉండవు. నిజమే కమీడియన్స్ తామెంత కష్టపడినా సరే తమ ప్రేక్షకులను మాత్రం నిరాశపరచరు. ఇది చాలదా! అందుకే కమెడియన్లు వర్ధిల్లాలంటాను. (“సాహిత్య కళా విభూషణ”స్వర్ణ నంది పురస్కార గ్రహీత చౌడూరి నరసింహారావు పత్రికారచయిత, సామాజిక విశ్లేషకులు)
Read More...
సినిమా 

War2: ఎన్టీఆర్‌ను.. డామినేట్‌ చేసిన కియారా! నేష‌న‌ల్ వైడ్ ట్రెండింగ్‌

War2: ఎన్టీఆర్‌ను.. డామినేట్‌ చేసిన కియారా! నేష‌న‌ల్ వైడ్ ట్రెండింగ్‌ జూనియ‌ర్ ఎన్టీఆర్ (Jr NTR) జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఆయ‌న అభిమానులు హంగామా చేస్తూ వివిధ కార్య‌క్ర‌మాలు చేస్తూ బ‌ర్త్‌డేను వైభ‌వంగా జ‌రుపుకుంటున్నారు. ఈక్ర‌మంలోఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీలు జూనియ‌ర్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ సోష‌ల్ మీడియా మారు మ్రోగుతోంది. అదేవిధంగా ఆయ‌న ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రాల లుక్స్‌తో పాటు బాలీవుడ్ ఆరంగేట్ర చిత్రం వార్‌2 (War2 Teaser) నుంచి ఓ టీజ‌ర్ కూడా రిలీజ్ చేశారు. అయితే వీట‌న్నింటిలో వార్‌2 టీజ‌ర్ (War2 Teaser) ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ టీజ‌ర్ సోష‌ల్‌ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోండ‌గా దేశ వ్యాప్తంగా మిక్స్‌డ్ టాక్‌ ద‌క్కించుకుంటోంది. YRF స్పై యూనివ‌ర్స్‌లో (YRF Spy Universe)లో భాగంగా ఈ సినిమాను బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిలింస్ (Yash Raj Films) నిర్మించ‌గా బ్ర‌హ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖ‌ర్జీ (Ayan Mukerji) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌రోవైపు ఇటు ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యాన్స్ , అటు హృతిక్ (Hrithik Roshan) ఫ్యాన్స్ తమ హీరోలకు ఇచ్చిన ఎలివేషన్ గురించి ప్రమోట్ చేసుకుంటున్నారు. ఓ పక్క హీరోల పర్సనాలిటీ ని కంపైర్ చేస్తూ ట్రోలింగ్ కూడా నడుస్తొంది. అయితే.. ఇదంతా ఇలా ఉంటే అటు హృతిక్ రోష‌న్‌ను కాద‌ని, ఎన్టీర్‌ను కాద‌ని టీజ‌ర్‌లో రెండు మూడు సెక‌న్లు మాత్ర‌మే మెరుపు తీగ‌లా క‌నిపించి మాయ‌మైన కియరా అద్వానీ (Kiara Advani) వీడియోపై ఇప్పుడు అంద‌రి దృష్టి ప‌డి దానిపైనే ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. టూ పీస్‌ బికినీలో కియారా అద్వాని (Kiara Advani) హట్ లుక్ మాత్రం అదిరిపోయిందంటూ.. ఆమె ఫోటోలను, వీడియోను అదే ప‌ని ఒక‌టికి రెండు సార్లు రిపీట్ చేసి చూస్తూ ఆస్వాదిస్తున్నారు నెటిజన్స్. ఇప్పుడు కియారేనే సామాజిక మాధ్య‌మాల్లో నేష‌న‌ల్ వైడ్‌గా టాప్‌లో ట్రెండ్ అవుతుంది. దీంతో జూనియ‌ర్ (Jr NTR) జ‌న్మ‌దినం నాడు వార్‌2 టీజ‌ర్ దుమ్ములేపి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ట్రీట్ ఇస్తుంద‌నుకుంటే అది కాస్త రివ‌ర్స్ అయి వార్‌2 (War2 Teaser)ను డామినేట్ చేస్తూ కియారా హైలెట్ అయింది. ఇదిలాఉంటే.. ఇప్ప‌టికే తెలుగులో మ‌హేశ్‌బాబుతో భ‌ర‌త్ అనే నేను, రామ్ చ‌ర‌ణ్‌తో విన‌య‌విధేయ రామ‌, గేమ్ చేంజ‌ర్ చిత్రాల్లో న‌టించిన కియారా (Kiara Advani) తెలుగు వాళ్ల‌కు సుప‌రిచిత‌మే. అర్జున్ రెడ్డి హిందీ రిమేక్ క‌బీర్‌తో బాలీవుడ్‌లో బిజీ అయిన కియారా అక్క‌డ వ‌రుస చిత్రాల‌తో దూసుకుపోయింది. రెండేండ్ల క్రితం త‌న స‌హా న‌టుడు ఆగ్ర హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాను వివాహం చేసుకుని సెటిల్ అయింది. ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తిగా ఉన్న‌ కియారా త్వ‌ర‌లో త‌ల్లిగా ప్ర‌మోష‌న్ పొంద‌నుంది.
Read More...
సినిమా 

Rana Naidu 2: ‘రానా నాయుడు 2’ ఇప్పుడు అంతకు మించి

Rana Naidu 2: ‘రానా నాయుడు 2’ ఇప్పుడు అంతకు మించి విక్టరీ వెంకటేష్(Venkatesh), రానా దగ్గుబాటి (Rana) నటించిన క్రేజీ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌గా ఈ ప్రాజెక్టు రూపొందింది. మొదటి సీజన్‌కు మిశ్రమ స్పందన వచ్చినా నెట్ ఫ్లిక్ ఓటీటీలో టాప్ రేంజ్ లో ప్రేక్షకాదరణ పొందింది. ఆ అద్భుతమైన స్పందనతో రెండో సీజన్‌ (RANA NAIDU 2) ను అంతకు మించి అనేలా రూపొందించారు. ఇప్పుడు రెండో సీజన్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘రానా నాయుడు సీజన్ 2’ జూన్ 13 నుంచి నెట్ ఫ్లిక్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ సిరీస్‌ను కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేశారు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు 
Read More...
సినిమా 

Naga Vamsi: సినిమాలు ఆడితేనే ఉంటారు.. లేదా ఇంటికెళ్లాల్సిందే

Naga Vamsi: సినిమాలు ఆడితేనే ఉంటారు.. లేదా ఇంటికెళ్లాల్సిందే వెబ్‌ మీడియా, రివ్యూలు, సోషల్‌ వీడియాలో నెగటివ్‌ పోస్ట్‌లు పెడుతున్న వారిపై నిర్మాత నాగవంశీ (Naga Vamsi) మండిపడ్డారు. సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రోత్సహించరని ప్రశ్నించారు. నా సినిమాల్ని బ్యాన్‌ చేయండి.. నా సినిమాలకు రివ్యూలు రాయకండి.. ఇంటర్వ్యూలు తీసుకోకండి.. అసలు నా సినిమాలకు కవరేజ్‌ ఇవ్వకండి. నా సినిమాను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో నాకు తెలుసు’ అంటూ విరుచుకుపడ్డారు. ‘మ్యాడ్‌ స్వ్కేర్‌’లో కంటెంట్‌ ఉంది కాబట్టే, హిట్‌ అయిందని నిర్మాత నాగవంశీ (Naga Vamsi fire on web Media) అన్నారు. పెంచిన టికెట్‌ ధరలను మంగళవారం నుంచి సాధారణ స్థాయికి తీసుకువచ్చామని చెబుతూ మంగళవారం ఆయన విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ‘‘కంటెంట్‌ లేకపోయినా సీక్వెల్‌ కాబట్టి సినిమా ఆడుతోందని కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ఎలా ఉన్నా చూడటానికి ‘బాహుబలి2’, ‘పుష్ప2’, ‘కేజీఎఫ్‌2’ కాదు కదా! సినిమా ఆశించినంత లేకపోయినా చూడటానికి ఇందులో నటించిన వాళ్లేమీ పెద్ద హీరోలు కాదు. ‘కోర్టు’ బాగుంది కాబట్టి చూశారు. పక్క సినిమా బాగోలేక దాన్ని చూడలేదు. అలాగే ‘మ్యాడ్‌ ేస్క్వర్‌’ బాగుంది కాబట్టి చూస్తున్నారు. వేరే మూవీలు బాగోలేవని దీన్ని చూడటం లేదు. ఇది అందరూ తెలుసుకోవాలి. ‘స్వాతిరెడ్డి’ పాటపైనా కామెంట్లు చేశారు. కంటెంట్‌ లేదు. సెకండాఫ్‌ పండలేదని అంటున్నారు. నేను థియేటర్‌లో చాలాసార్లు సినిమా చూశా. ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది. జనాలకు తెలిసినంత బాగా రివ్యూలు రాసేవాళ్లకి తెలియడం లేదా’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘సినిమా విడుదలై రివ్యూలు వచ్చిన తర్వాత కూడా ప్రెస్‌మీట్‌ పెట్టాను. అయితే వాటిపై నేనేమీ మాట్లాడలేదు. వాళ్ల పని వాళ్లు చేశారు. కానీ, ఆ రివ్యూల మీద సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మీరు, మేమూ కలిసి పనిచేయాలి. నేను సినిమాలు తీసి విడుదల చేేస్తనే మీ వెబ్‌సైట్స్‌ రన్‌ అవుతున్నాయి. నేను ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ యూట్యూబ్‌ ఛానళ్లు పనిచేస్తున్నాయి. మేము ప్రకటనలు ఇస్తేనే మీ సైట్స్‌ నడుస్తాయి. సినిమాను చంపకండి. సినిమా ఆడుతున్నప్పుడు కూడా ‘కంటెంట్‌ లేని మూవీ ఎందుకు ఆడుతుందో తెలియదు’ అంటూ తీర్పులివ్వకండి. సినిమాలు ఆడితేనే మీరూ ఉంటారు. లేకపోతే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి?’’ అని నాగవంశీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More...
సినిమా 

Koratala Siva: ఆ పాత్రకు అర్హుడు ఎన్టీఆర్ మాత్రమే…

Koratala Siva: ఆ పాత్రకు అర్హుడు ఎన్టీఆర్ మాత్రమే… మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) అంటే ప్రతి దర్శకుడికి ప్రేమ, గౌరవం కూడా. బాల్యం నుండి తాతయ్య నందమూరి తారక రామారావు (NT Ramarao) నుండి నటనను ఒంటబట్టించుకున్నాడు జూ. ఎన్టీఆర్. పెద్దాయన దర్శకత్వంలో హిందీలో రూపుదిద్దుకున్న ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో బాల భరతుడిగా నటించాడు. అలానే బాల్యంలోనే బుల్లితెరలో ‘భక్త మార్కండేయ’ గా చేసి మెప్పించాడు. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో అందరూ పిల్లలతో తెరకెక్కిన ‘రామాయణం’ (Ramayanam) గురించి చెప్పక్కర్లేదు. రాముడి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ నటించిన ‘దేవర-1’ (Devara -1) జపాన్ లో రిలీజ్ అవుతున్న సందర్భంగా అక్కడి ప్రజలతో ఎన్టీఆర్, ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివ ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడ ఒకానొక సందర్భంలో కొరటాల శివ తన మనసులో మాటను బయటపెట్టాడు. తెలుగువారు, ఆ మాట కొస్తే భారతీయులు గర్వించదగ్గ దర్శకుడు కె. విశ్వనాథ్ (K. Vishwanadh) గురించి ఆయన చెప్పారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేలా సినిమాలు తీశారని తెలిపారు. ఆయన రూపొందించిన క్లాసిక్ మూవీస్ లో ‘సాగర సంగమం’ (Sagara Sangamam) కూడా ఒకటి అని అన్నారు. కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా నటించిన ఆ సినిమాను ఇవాళ తమ తరం దర్శకులు ఎవరైనా రీమేక్ చేయాలనుకుంటే అందుకు ఒకే ఒక్క ఛాన్స్ ఎన్టీఆర్ అని కితాబిచ్చారు కొరటాల శివ. జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్న పొటన్షియాలిటీ మామూలు కాదని, ‘సాగర సంగమం’ వంటి శాస్త్రియ నృత్య ప్రధానమైన చిత్రంలో చేసే సత్తా, సత్తువ ఎన్టీఆర్ కే ఉన్నాయని అన్నారు. బేసికల్ గా ఎన్టీఆర్ సంప్రదాయ నృత్యం చేసుకున్న వ్యక్తి కావడంతో ఆ పాత్రకు సంపూర్ణ న్యాయం చేయగలడని చెప్పారు. కె. విశ్వనాథ్‌ గురించి కొరటాల శివ మాట్లాడుతుంటే ఎన్టీఆర్ సైతం హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీ సినిమా ‘వార్ -2’ తో పాటు, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబోలో ‘దేవర -2’ సెట్స్ పైకి వెళ్ళొచ్చు!
Read More...
సినిమా 

Kannappa Team: ‘కన్నప్ప’ టీమ్‌ కష్టాన్ని అర్థం చేసుకోండి.

Kannappa Team: ‘కన్నప్ప’ టీమ్‌ కష్టాన్ని అర్థం చేసుకోండి. ‘కన్నప్ప’ (kannappa) ప్రీమియర్‌ వేశారంటూ వచ్చిన వార్తలను చిత్ర బృందం ఖండించింది. ఆన్‌లైన్‌ వేదికగా ప్రచారమవుతున్న సమాచారాన్ని కొట్టిపడేసింది. ఈ మేరకు టీమ్‌ (Kannappa Team) ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘మార్చి 31న ‘కన్నప్ప’ ప్రీమియర్‌ వేశారంటూ ఆన్‌లైన్‌ వేదికగా వస్తున్న వార్తల్లో నిజం లేదు. వీఎఫ్‌ఎక్స్‌ విభాగానికి సంబంధించి 15 నిమిషాల ఫుటేజ్‌ క్వాలిటీని సమీక్షించాం. ‘కన్నప్ప’ ఫస్ట్‌ కాపీని సిద్థం చేసే పనులు నడుస్తున్నాయి. ఈ సినిమాకు వీఎఫ్‌ఎక్స్‌ పరిధి ఎక్కువ. అందుకే ప్రతి క్వాలిటీగా తీర్చిదిద్దుతుండటంతో మరింత సమయం అవసరమైంది. అభిమానులు, మీడియా అవాస్తవాలను వార్తలుగా రాయవద్దు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. ‘కన్నప్ప’ టీమ్‌ కష్టాన్ని అర్థం చేసుకుంటూ సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు’’ -టీమ్‌ కన్నప్ప మోహన్‌బాబు, మంచు విష్ణు నడుచుకుంటూ వస్తున్న పలు వీడియోలు నెట్టింట వైరల్‌ కావడంతో ‘కన్నప్ప’ ప్రివ్యూ వేశారంటూ పోస్టులు దర్శనమిచ్చాయి. దీనిపై చిత్ర బృందం వివరణ ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 25న విడుదల చేయాలని భావించినా, వీఎఫ్‌ఎక్స్‌ పనుల కారణంగా వాయిదా వేశారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మంచు విష్ణు చెప్పారు.
Read More...
సినిమా 

ఎత్తుకెళ్లి పోవాలా నా సామిరంగా

ఎత్తుకెళ్లి పోవాలా నా సామిరంగా ప్రముఖ కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్ని దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నా సామిరంగా’. అశికా రంగనాథ్‌ కథానాయిక. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తుది దశ చిత్రీకరణ జరుగుతోంది. ‘నా సామిరంగా’ చిత్రం నుంచి తొలిగీతం ‘ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తోంది’ త్వరలో విడుదలవనుంది. ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్‌లో రైతు గెటప్‌లో నాగార్జున ఆకట్టుకున్నారు. పొలంలో ట్రాక్టర్‌పై కాలు ఉంచి బీడీ కాలుస్తూ సరికొత్త లుక్‌లో కనిపించారు. ప్రసన్నకుమార్‌ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
Read More...
సినిమా 

‘పుష్ప’ నటుడు జగదీశ్ అరెస్ట్.. అసలు విషయం ఏంటంటే..?

‘పుష్ప’ నటుడు జగదీశ్ అరెస్ట్.. అసలు విషయం ఏంటంటే..? పుష్ప’ (Pushpa) సినిమాలో అల్లు అర్జున్‌ (Allu Arjun) పక్కనే ఉండే కేశవ (Keshava) పాత్ర పోషించిన నటుడు జగదీశ్.. ఒక మహిళ ఆత్మహత్య కేసులో అరెస్టయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన ఓ మహిళకు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొద్దిరోజుల తర్వాత విడాకులు తీసుకుని నగరానికి వచ్చింది. సోమాజిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. సినీ పరిశ్రమలో ఆర్టిస్టుగా, చిన్న చిన్న డాక్యుమెంట్లు తీస్తున్న క్రమంలో ఆమెకు జగదీశ్(31)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారి మధ్య సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి కొద్దిరోజులు ఉన్నారు. వివాహం చేసుకుందామని ఆమె అనుకుంది. కానీ, జగదీశ్ (Jagadeesh Prathap Bandari) వేరే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలియగానే ఆమె అతడిని దూరం పెట్టింది. అయితే, ఆమెను మరిచిపోలేని జగదీశ్ తరచూ ఆమె ఉండే అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లేవాడు. అయినా ఆమె అతడిని పట్టించుకోలేదు. అదే సమయంలో మరో యువకుడితో ఆమెకు ఏర్పడిన పరిచయం సన్నిహిత సంబంధానికి దారి తీసింది. కిందటి నెల 27వ తేదీన.. రాత్రి ఆమె తన ఫ్లాట్‌లోనే ఆ యువకుడితో అర్ధనగ్నంగా ఉండగా వంటింటి కిటికీలో నుంచి జగదీశ్ తన సెల్‌ఫోన్‌లో వారి ఫొటోలు తీశాడు. కొద్దిసేపటి తరువాత తలుపులు కొట్టడంతో ఆమె తలుపులు తెరిచింది. జగదీశ్ తాను తీసిన ఫొటోలను ఆమెకు చూపగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆమెతో ఉన్న యువకుడు జగదీశ్‌ను వారించడమే కాక.. పోలీసులకు ఫోన్‌ చేస్తానని హెచ్చరించడంతో అతడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. తర్వాత రెండు రోజులూ జగదీశ్ ఆ మహిళకు.. తాను తీసిన ఫొటోలు వాట్సాప్‌లో పంపించాడు. తన మాట వినకపోతే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె ఆందోళనకు గురై 29న తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జగదీశ్‌పై అనుమానం ఉందని వారు తెలపడంతో.. అతడి కోసం గాలింపు ప్రారంభించారు. మృతురాలి ఫోన్‌ నంబర్‌ ఆధారంగా.. ఆమె మరణించడానికి ముందు ఎవరెవరు ఫోన్‌ చేశారు? ఆమె ఎవరితో మాట్లాడిందో తెలుసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు రోజు వరకూ ఆమెతో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు 27వ తేదీ రాత్రి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఆమె మృతికి ప్రధాన కారకుడిగా భావించి జగదీశ్‌పై ఐపీసీ 354(సి), 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.
Read More...
సినిమా 

యావరేజ్‌ టాక్‌ తో హాయ్‌… నాన్న

యావరేజ్‌ టాక్‌ తో హాయ్‌… నాన్న హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 ’దసరా’ విజయం తర్వాత నేచురల్‌ స్టార్‌ నాని నటించిన సినిమా ‘హాయ్‌ నాన్న’. దసరా మాస్‌ అయితే… హాయ్‌ నాన్న క్లాస్‌! ఈ సినిమాలో ‘సీతారామం’ ఫేమ్‌ మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. ‘బేబీ’ కియారా ఖన్నా కీలక పాత్రలో నటించింది. మనసుకు హాయినిచ్చేలా ప్రచార చిత్రాలు, పాటలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ రోజు సినిమా విడుదలైంది. నాని ముంబైలో ఫ్యాషన్‌ ఫోటోగ్రాఫర్‌. అతని ఆరేళ్ళ కుమార్తె పేరు మహి (’బేబీ’ కియారా ఖన్నా). పాపకు కథలు చెప్పడం తండ్రి అలవాటు. అమ్మ కథ చెప్పమని ప్రతిసారీ అడుగుతూ ఉంటుంది. క్లాస్‌ ఫస్ట్‌ వస్తే చెబుతానని మదర్‌ ప్రామిస్‌ చేస్తాడు విరాజ్‌. మహి ఫస్ట్‌ వస్తుంది. కానీ, అమ్మ కథ చెప్పడు. తెల్లారిన తర్వాత తండ్రికి చెప్పకుండా మహి బయటకు వెళుతుంది. ఆ చిన్నారిని ఓ ప్రమాదం నుంచి యష్ణ (మృణాల్‌ ఠాకూర్‌) కాపాడుతుంది. ఇద్దరు కలిసి కాఫీ షాపులో కూర్చుంటారు. అక్కడికి విరాజ్‌ వస్తాడు. కంపల్సరీ అమ్మ కథ చెప్పాలని పట్టుబట్టడంతో మరో దారి లేక చెప్పడం మొదలు పెడతాడు. విరాజ్‌ పెద్ద ఫోటోగ్రాఫర్‌ కాకముందు… అతడికి వర్ష (ఆ పాత్రలో యష్ణను మహి ఊహించుకుంటుంది ` అంటే మృణాల్‌ ఠాకూర్‌) పరిచయం అవుతుంది. అది ప్రేమగా మారుతుంది. వర్ష సంపన్నురాలు. విరాజ్‌ మిడిల్‌ క్లాస్‌. తల్లి చెబుతున్నా వినకుండా విరాజ్‌ ఇంటికి వస్తుంది. పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళకు ఓ అందమైన పాప జన్మిస్తుంది. విరాజ్‌ కథ చెబుతుంటే అతడు ప్రేమించిన అమ్మాయి పాత్రలో తనను తాను ఊహించుకుంటుంది యష్ణ. విరాజ్‌ను ప్రేమిస్తుంది. అసలు… పాప జన్మించిన తర్వాత ఏమైంది? విరాజ్‌, వర్ష ఎందుకు విడిపోయారు? వర్ష ఎక్కడికి వెళ్ళింది? వర్ష కుటుంబ నేపథ్యం ఏమిటి? తల్లిదండ్రులు ఎవరు? ఓ వారంలో అరవింద్‌ (అంగద్‌ బేడీ)తో పెళ్లి పెట్టుకుని విరాజ్‌తో ప్రేమలో పడిన యష్ణ… అతడికి తన మనసులో మాటను చెప్పిందా? లేదా? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తండ్రి కుమార్తె అనుబంధం, ఇద్దరి మధ్య ప్రేమ నేపథ్యంలో తెలుగు తెరకు కొత్త కాదు. తల్లి లేని కుమార్తెను ఎంతో ప్రేమగా చూసుకునే తండ్రిని చూసి మనసు ఇచ్చిన అమ్మాయిల కథలు కూడా కొత్త కాదు. ఆల్రెడీ వచ్చిన కథల మధ్య ‘హాయ్‌ నాన్న’ను కొత్తగా నిలబెట్టిన అంశం ఏది? అని చూస్తే… తల్లి పాత్ర!’హాయ్‌ నాన్న’లో కథానాయకుడు, కుమార్తె కంటే తల్లి పాత్ర చాలా కీలకమైనది. ఆ పాత్రకు ఇచ్చిన ట్విస్ట్‌, ఆ ట్విస్ట్‌ చుట్టూ నడిచే సీన్లు కూడా! బహుశా… నానికి కూడా ఆ పాయింట్‌ నచ్చి కథ ఓకే చేశారేమో!? అయితే… ఆ ట్విస్ట్‌ వచ్చే వరకు నడిచే ప్రేమకథ రెగ్యులర్‌ డ రొటీన్‌ అనిపిస్తుంది. ఒక దశలో ‘సారొచ్చారు’ ఛాయలు సైతం కనిపిస్తాయి. మధ్యలో పాటలు కాస్త ఉపశమనం ఇస్తాయి. ఒక్కసారి ట్విస్ట్‌ రివీల్‌ అయ్యాక గుండె రaల్లుమంటుంది. ట్విస్ట్‌ రివీల్‌ చేసిన తర్వాత నుంచి ముగింపు వరకు కాస్తో కూస్తో ఆసక్తిగా కథను నడిపాడు దర్శకుడు. ప్రేమ, హీరో హీరోయిన్ల మానసిక సంఘర్షణ. మన మనసులో బాధను, ప్రేమను అన్నిసార్లూ బయటకు వ్యక్తం చేయలేం. అలాగని, దాచుకోలేం. అటువంటి పరిస్థితిని తెరపై ఆవిష్కరించడానికి శౌర్యువ్‌ ట్రై చేశారు. మానసిక సంఘర్షణను హృద్యంగా ఆవిష్కరించిన దర్శకుడు… ప్రేక్షకులు సైతం ఆ ప్రేమను ఫీలయ్యేలా తీయడంలో ఫెయిల్‌ అయ్యారు. ఒక్కసారి ట్విస్ట్‌ రివీల్‌ అయ్యాక… హీరో కథ విని హీరోయిన్‌ ప్రేమలో పడిరదని తెలిశాక… తర్వాత జరిగే సన్నివేశాలను ఊహించడం పెద్ద కష్టం ఏవిూ కాదు. క్లైమాక్స్‌ కోసం వెయిట్‌ చేయడం తప్ప చేసేది ఏవిూ ఉండదు.శౌర్యువ్‌ కథకు, సన్నివేశాలకు హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం ప్రాణం పోసింది. పాటల కంటే నేపథ్య సంగీతం ఎక్కువ బలంగా నిలిచింది. ప్రతి సన్నివేశం ఓ అందమైన పెయింటింగ్‌ ఉన్నట్లు ఉంది. సాను జాన్‌ వర్గీస్‌ సినిమాటోగ్రఫీ సూపర్బ్‌. అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైన్‌ కూడా! నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదు. ప్రతి సన్నివేశంలో ఆ ఖర్చు కనిపించింది.నటీనటులు ఎలా చేశారంటే: స్టైలిష్‌ డ హ్యాండ్సమ్‌ నాని స్క్రీన్‌ విూద కనిపించారు. ఇప్పటివరకు నాని చేసిన సినిమాల్లో ‘హాయ్‌ నాన్న’ ది బెస్ట్‌ లుక్‌ అని చెప్పవచ్చు. నటన వస్తే… భావోద్వేగభరిత సన్నివేశాల్లో జీవించారు. ఆయనను చూసి భార్య, కుమార్తె అంటే ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఎమోషనల్‌ అవుతారు. సహజ నటనతో నాని మరోసారి ఆకట్టుకున్నారు.వర్షగా ప్రేమ కథలో కంటే… యష్ణగా ప్రజెంట్‌ కథలో మృణాల్‌ ఠాకూర్‌ లుక్‌ డ స్టైలింగ్‌ బావున్నాయి. మృణాల్‌ సైతం కొన్ని సన్నివేశాల్లో ఏడిపిస్తారు. చిన్మయి డబ్బింగ్‌ కూడా అందుకు ఓ కారణం అని చెప్పాలి. అంత సహజంగా చెప్పారు. ‘బేబీ’ కియారా ఖన్నా నటన ముద్దొస్తుంది. అంత చిన్న వయసులో ఎమోషనల్‌ సీన్‌ చేసిన ఆమె ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేం. జయరామ్‌ నటన, ఆయన ఇమేజ్‌ వల్ల తండ్రి పాత్రకు హుందాతనం వచ్చింది. పతాక సన్నివేశాలకు బలం చేకూరింది. హీరో స్నేహితుడిగా ప్రియదర్శి మధ్యలో కాస్త నవ్వించారు. హిందీ నటుడు అంగద్‌ బేడీకి తొలి తెలుగు చిత్రమిది. అరవింద్‌ కృష్ణ పాత్రలో సెటిల్డ్‌ పెర్ఫార్మన్స్‌ చేశారు. ఆయన సోదరుడిగా ‘బేబీ’ ఫేమ్‌ విరాజ్‌ అశ్విన్‌ రెండు మూడు కీలక సన్నివేశాల్లో కనిపించారు. పాటలో శృతి హాసన్‌ డ్యాన్స్‌, ఆ గ్రేస్‌ సూపర్బ్‌. రితికా నాయక్‌ ఓ పాటలో ఓ పాటలో సందడి చేశారు. నేహా శర్మ ఓ సన్నివేశంలో తళుక్కున మెరిశారు. చివరగా చెప్పేది ఏంటంటే: ‘హాయ్‌ నాన్న’ ఓ ఎమోషనల్‌ జర్నీ! ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సంథింగ్‌ డిఫరెంట్‌ డ కొత్తగా ఉంది. ట్విస్ట్‌ తీసి చూస్తే… ఇదొక రొటీన్‌ సినిమా.ఈ కథను నమ్మి ప్రాణం పెట్టి నటించిన మృణాల్‌ ఠాకూర్‌ డ నానికి… సంగీతంతో కథకు ప్రాణం పోసిన హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ కు రియల్లీ హ్యాట్సాఫ్‌. వాళ్ళ కోసం అయితే ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా ఓసారి థియేటర్లకు వెళ్లే ప్రయత్నం చేయండి. ఇంకో విషయం గుర్తు పెట్టుకోండి… సినిమా చాలా నిదానంగా ముందుకు వెళుతుంది.
Read More...
సినిమా 

ఓటిటి ప్రభావం, ఆగిపోయిన రవితేజ సినిమాలు

ఓటిటి ప్రభావం, ఆగిపోయిన రవితేజ సినిమాలు ఓటిటి ప్రభావం అప్పుడే తెలుగు సినిమా మీద పడింది అని పరిశ్రమలో అంటున్నారు. ఇంతకుముందులా ఓటిటి హక్కులు ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకోకపోవడంతో నిర్మాతలు ముందుగానే జాగ్రత్తపడి సినిమా బడ్జెట్ తగ్గించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే రవితేజతో లైనప్ లో వున్న కొన్ని సినిమాలు ఆగిపోయాయి అని టాక్. ఇప్పుడు తెలుగు సినిమా మీద ఓటిటి ప్రభావం బాగా పడుతోంది అని వినిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం నిర్మాత సుధాకర్ రెడ్డి ఓటిటి ప్రభావం గురించి మాట్లాడుతూ నిర్మాతలు అందరూ చాలా జాగ్రత్తగా సినిమాలు తీయాలని, లేకపోతే చాలా కష్టం అని చెప్పారు. అందుకని ఇప్పుడు నిర్మాతలు సినిమా ఖర్చులు తగ్గించే పనిలో వున్నారని పరిశ్రమలో ఒక టాక్ వినపడుతోంది. ఇందులో భాగంగానే రవితేజతో రావలసిన కొన్ని సినిమాలు ఆలోచనలో పడ్డాయి అని అవి వస్తాయో రావో చెప్పడం కష్టం అని చెపుతున్నారు పరిశ్రమలో. మైత్రి మూవీ మేకర్స్, గోపీచంద్ మలినేని (GopichandMalineni), రవితేజ (RaviTeja) కాంబినేషన్ లో ఒక సినిమా ప్రకటించారు, అది అధికారికంగా కూడా ప్రారంభం అవుతోంది అని కూడా మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ సినిమా దాదాపు ఆగిపోయినట్టే అని అర్థం అవుతోంది. ఎందుకంటే రవితేజ పారితోషికం చాలా ఎక్కువ అడిగారని, అంత పారితోషికం ఇచ్చి సినిమా బడ్జెట్ పెంచుకుంటే, ఆ సినిమా థియేట్రికల్ రెవిన్యూ అంత రాదని చెప్పి, ఆ సినిమా ఆపెయ్యడం మంచిదని అందుకని ఆపేశారని చెపుతున్నారు. ఇంతకుముందు ఓటిటి, శాటిలైట్ హక్కులు అమ్ముకొని సినిమాలు చేసేవారు, ఇప్పుడు అవి పడిపోవటంతో ఇంత బడ్జెట్ పెట్టడం కష్టం అని చెపుతున్నారు. భగవంత్ కేసరి’ #BhagavanthKesari తో పెద్ద హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి (AnilRavipudi), తదుపరి సినిమా రవితేజ తో ఉంటుంది అని వార్తలు చక్కర్లు కొట్టాయి, అయితే ఈ సినిమా కూడా ఉండకపోవచ్చు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఇది కూడా ఓవర్ బడ్జెట్ అవుతుందని, అంతంత బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే థియేట్రికల్ గా ఆడకపోతే కష్టం అని ఈ సినిమా కూడా డ్రాప్ అయినట్టుగా చెపుతున్నారు. రవితేజ పారితోషికం బాగా పెంచేశారని, అతని మీద అంత పెద్ద వ్యాపారం అవదు అని తెలిసి అతనితో చేసే రెగ్యులర్ నిర్మాతలు ఇప్పుడు కొంచెం వెనక్కి తగ్గుతున్నారని భోగట్టా. ఈ రెండే కాకుండా రవితేజతో చెయ్యబోయే ఇంకో సినిమా కూడా ఆగిపోయినట్టుగా పరిశ్రమలో టాక్ వినపడుతోంది. నిర్మాతలు అందరూ ఇప్పుడు ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. ఒక్క రవితేజ విషయంలోనే కాకుండా మిగతా సినిమా నిర్మాతలు కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా పరిశ్రమలో అంటున్నారు. రవితేజ పారితోషికం తగ్గించి చేస్తే నిర్మాతలు ఈ సినిమాలు తీయడానికి ముందుకు రావచ్చు అని కూడా తెలుస్తోంది.
Read More...
సినిమా 

తెలుగు సినిమా పరిశ్రమ పరువు తీసిన సురేష్ కొండేటి: టి.ఎఫ్.సి.సి

తెలుగు సినిమా పరిశ్రమ పరువు తీసిన సురేష్ కొండేటి: టి.ఎఫ్.సి.సి కొన్ని రోజుల క్రితం గోవా వేదికగా సంతోషం ఫిలిం అవార్డుల పండగ జరిగింది. సంతోషం సురేష్ గా పేరు గాంచిన సురేష్ కొండేటి ఈ అవార్డులను గత కొన్ని సవంత్సరాలుగా ఇస్తున్నాడు. ఒక్క తెలుగు నటీనటులకు కాకుండా, దక్షిణాదిలో ఉన్న తమిళం, కన్నడ, మలయాళ భాషల నటీనటులకు కూడా ఈ సంతోషం అవార్డులు ఇస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం గోవాలో జరిగిన వేడుకల్లో సురేష్ కొండేటి తెలుగు సినిమా పరిశ్రమ పరువుతీసే పనులు చెయ్యడమే కాకుండా, అక్కడకి వచ్చిన సినిమా సెలబ్రిటీస్ ని పట్టించుకోకుండా మధ్యలోనే వెళ్ళిపోయినట్టుగా తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ (TFCC) అధికారికంగా ఒక ప్రకటన ఇచ్చింది. అందుకని అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా అతను వున్న అన్ని అస్సోసియేషన్స్ కి లెటర్స్ పంపింది. ఎక్కువగా హైదరాబాదులో నిర్వహించే ఈ అవార్డుల వేడుక ఈసారి గోవాలో నిర్వహించాడు సంతోషం సురేష్. ఆ వేడుకకి రామ్ చరణ్ వస్తున్నారు, ఇంకా చాలామంది తెలుగు అగ్ర నటులు వస్తున్నారు అని బాగా ప్రచారాలు చేయించాడు. అయితే రామ్ చరణ్ ఈ వేడుకకి రాలేదు, రానని చెప్పారని కూడా భోగట్టా. కానీ సంతోషం సురేష్ రామ్ చరణ్ పేరుని ఇలా వాడుకున్నట్టుగా పరిశ్రమలో చెపుతున్నారు. గోవాలో ఒక స్టేడియం లో ఈ అవార్డులు వేడుక జరిగింది. మూడు గంటలకి మొదలవ్వాల్సి వేడుక, రాత్రి 8 గంటలకి మొదలైందని, మలయాళం అవార్డులు ఇచ్చిన తరువాత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడే సమయానికి, లైట్లు, మైక్ ఆపేశారని తెలిసింది. అప్పుడు అల్లు అరవింద్, దామోదర ప్రసాద్ ఏమైందని వాకబు చేస్తే, సురేష్ కొండేటి ఆర్గనైజర్లుకి డబ్బులు కట్టలేదని తెలిసింది. అల్లు అరవింద్ వాళ్ళతో మాట్లాడి అరగంటలో మళ్ళీ ఏర్పాట్లు చేసినట్టుగా కూడా చెపుతున్నారు. నాలుగు భాషల నటీనటులను ఆహ్వానించటమే కాకుండా, వారిని జాగ్రత్తగా మళ్ళీ వెనక్కి పంపే బాధ్యత కూడా ఆర్గనైజర్ గా సురేష్ కొండేటి బాధ్యత, కానీ అతను ఇవన్నీ చూడకుండా తెల్లవారుజామున ఎవరికీ చెప్పా పెట్టకుండా గోవా నుండి హైదరాబాద్ వచ్చేసాడు అని ఆ ప్రకటనలో చెప్పారు. అక్కడ సెలబ్రిటీస్ వున్న హోటల్ కి కనీసం డబ్బులు కట్టలేదు, వాళ్ళకి వసతులు సరిగ్గా ఉన్నాయో లేదో, వాళ్ళ బాగోగులు, ముఖ్యంగా ఆడవాళ్ళకి కనీస భద్రత కూడా చూపించకుండా సురేష్ అన్నీ వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చేసాడని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడని, తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర ప్రసాద్ చెప్పారు. అల్లు అరవింద్, దామోదర ప్రసాద్ లు తమ సొంత డబ్బుతో కొంతమందిని జాగ్రత్తగా ఇంటికి పంపినట్టుగా కూడా చెపుతున్నారు. గోవాలో సురేష్ కొండేటి, తాను మెగాస్టార్ చిరంజీవికి పీఏ అని, చిత్ర పరిశ్రమలో ముఖ్యమైన వ్యక్తిని అని చెప్పి చాలా పనులు చేసుకున్నట్టుగా తెలిసింది. గోవా ముఖ్యమంత్రి కూడా ఈ వేడుకకు వస్తున్నట్టుగా సురేష్ కొండేటి అక్కడున్న అందరికీ తప్పుడు సమాచారం చెప్పడంతో చాలామంది మలయాళం సెలబ్రిటీస్ అది నిజమే అనుకోని ఈ వేడుకకు వచ్చినట్టుగా అర్థం అవుతోందని తెలిసింది. అదీ కాకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమ పేరు కూడా వాడుకోవటంతో, ఈ అవార్డుల వేడుక మధ్యలో వదిలేసి సురేష్ వెళ్లిపోవటంతో, కన్నడ, తమిళ పరిశ్రమకి చెందిన చాలామంది సెలబ్రిటీస్ తెలుగు సినిమా పరిశ్రమ మీద విమర్శలు చేశారు. చిరంజీవి పీఏ అందరినీ చీట్ చేసాడని సాంఘీక మాధ్యమాల్లో వీడియోలు పెట్టడంతో తెలుగు పరిశ్రమలోని పెద్దలు దీనిమీద చాలా సీరియస్ గా చర్య తీసుకోవాలని భావించారు.
Read More...