న్యూ గడ్డిఅన్నారంలో సర్ ప్రక్రియలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ బద్దం

న్యూ గడ్డిఅన్నారంలో సర్ ప్రక్రియలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ బద్దం

ఎల్బీనగర్:

సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ) కార్యక్రమంలో భాగంగా గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని న్యూ గడ్డిఅన్నారం కాలనీలో అర్హులైన ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారమ్‌లను బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్లు సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓటర్లకు ఫారమ్‌ల ప్రాముఖ్యత, వాటిని సక్రమంగా నింపే విధానం గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో తన పేరును ధృవీకరించుకోవడం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన బాధ్యత. సర్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఎన్యుమరేషన్ ఫారమ్‌లను పూర్తి చేసి సమర్పించాలని అన్నారు. అలాగే ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా సంబంధిత బీఎల్ఓలను సంప్రదించి అవసరమైన సమాచారం పొందాలని సూచించారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఓటరు భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.

About The Author