చదువుకునే వయసులో.. పెద్ద కష్టం

చదువుకునే వయసులో.. పెద్ద కష్టం

ఎల్బీనగర్:

సంగారెడ్డి జిల్లా రామచంద్రా పురంకు చెందిన 16 సంవత్సరాల హేమిమాకి చదువుకునే వయసులో చాలా పెద్ద కష్టం వచ్చింది. తన కుడి వైపు కిడ్నీ పూర్తిగా ఇన్ఫెక్షన్ తో పని చేయట్లేదు.ఇప్పుడు ఇన్ఫెక్షన్ అయిన కిడ్నీ తొలగించక పోతే ప్రాణాలకే ప్రమాదంగా మారింది. నిరుపేద కుటుంబానికి చెందిన  హేమిమా కుటుంబ సభ్యులు  దాతలు కోసం ఎదురు చూస్తున్నారు. విషయం తెలుసుకున్న సురక్ష సేవా సంఘం దాతలు ద్వారా విరాళాలు సేకరించి సురక్ష రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్ ఆదేశాలు మేరకు సంగారెడ్డి జిల్లా ఇంచార్జి శ్రీమతి హారతి ఆసుపత్రికి చేరుకుని 10 వేల రూపాయలు బాధితులకు అందించడం జరిగింది.

About The Author