సరూర్‌నగర్ డివిజన్‌లో సర్ ప్రక్రియను పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్ సి. సుధాకర్

సరూర్‌నగర్ డివిజన్‌లో సర్ ప్రక్రియను పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్ సి. సుధాకర్

ఎల్బీనగర్:

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) – 2026 కార్యక్రమాన్ని సరూర్ నగర్ డివిజన్ స్పెషల్ ఆఫీసర్ సి. సుధాకర్ బుధవారం సరూర్‌నగర్ డివిజన్‌లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, ఇంటింటి సర్వే, దరఖాస్తుల స్వీకరణ, నమోదు పనులు, హెల్ప్ డెస్క్‌ల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.అర్హులైన ప్రతి ఓటరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారదర్శకంగా, వేగవంతంగా సర్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ, వచ్చిన ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ తనిఖీల్లో సంబంధిత ఎన్నికల అధికారులు,ఎన్నికల సిబ్బంది, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

About The Author