తెలంగాణ
తెలంగాణ 

ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు

ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు ములుగు జిల్లా ప్రతినిధి, జులై 15 (భారత శక్తి) : ఆదివాసీలను అణిచివేసే కుట్రలో భాగంగా అడవులను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే ప్రభుత్వ విధానాలను ఖండించాలని ఏఐకేఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ప్రసాదన్న అన్నారు. 2023 అటవీ సంరక్షణ సవరణ చట్టం రద్దుకై పోరాడాలన్నారు. దేశవ్యాప్తంగా ఆదివాసీ తెగ లను అణచివేసి అక్కడి ఖనిజ సంపదను...
Read More...
తెలంగాణ 

పారిశ్రామిక వివాదాల చట్టం-1947, ఫ్యాక్టరీల చట్టం-1948

పారిశ్రామిక వివాదాల చట్టం-1947, ఫ్యాక్టరీల చట్టం-1948 సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 15:రాష్ట్రంలో వివిధ పరిశ్రమలలో భద్రత ప్రమాణాలపై ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ నిరంతరం తనిఖీలు చేపట్టాలని అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి కోరారు. హుజూర్ నగర్ పట్టణంలో వివిధ రంగాల...
Read More...
తెలంగాణ 

ములుగు పిఎసిఎస్ కు ఉత్తమ అవార్డు 

ములుగు పిఎసిఎస్ కు ఉత్తమ అవార్డు  ములుగు జిల్లా ప్రతినిధి, జులై 15 (భారత శక్తి) : హైదరాబాద్ లో జరిగిన నాబార్డ్ సంస్థ సదస్సులో ములుగు పిఎసిఎస్ సొసైటీకి ఉత్తమ అవార్డుకు ఎంపిక కాగా మంగళవారం హైదరాబాదులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిసిసిబి చైర్మన్, టెస్కా చైర్మన్ మార్నేని రవీందర్ రావు చేతుల మీదుగా ములుగు పిఎసిఎస్...
Read More...
తెలంగాణ 

హైదరాబాద్ మహానగరంలో ఏమి జరుగుతోంది..? 

హైదరాబాద్ మహానగరంలో ఏమి జరుగుతోంది..?  విచ్చలవిడిగా గంజాయి సరఫరా..?  యాంటీ నార్కోటిక్ సంస్థ కళ్లు గప్పుతున్న ఆగంతకులు..  గల్లీల్లో, పాన్ డబ్బాల్లో, కల్లు దుకాణాల్లో అమ్మకం..  'వీడ్' అంటూ గంజాయిని పిలుచుకుంటారు..  సిగరెట్స్ లో కూరుకొని బహిరంగంగానే వినియోగం..  పెద్దవాళ్ల హస్తం ఉన్నట్టు కొన్ని ఆధారాలు..  కోట్లలో జరుగుతున్న వ్యాపారం..  యువత నిర్వీర్యమై.. దేశ భవిష్యత్తు చీకటి అవుతోంది..  ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ  పరిశోధనలో వెలుగు చూసిన భయంకర వాస్తవాలు..  ప్రశ్నించే తత్వం యువతలో నిగూఢమై ఉంటుంది.. పోరాట స్ఫూర్తి నరనరానా నిబిడీకృతమై ఉంటుంది.. యువత మేల్కొంటే సమసమాజం స్థాపితమవుతుంది.. అందుకే ఓ యువతా మేలుకో అని పిలుపునిచ్చారు స్వామి వివేకానంద.. కానీ యువత నానాటికీ నిర్వీర్యమైపోతోంది.. పోరాట పఠిమ నీరుకారిపోతోంది.. దీనికి కారణం ఏమిటి..? యువత నిరాశా నిస్ప్రుహలకు గురికావడమే అన్నది మా పరిశోధనలో తేలింది.. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని మహాకవి శ్రీ శ్రీ అన్నదాంట్లో వాస్తవం లేకపోలేదు.. కానీ అలాంటి భయానక పరిస్థితులు కల్పించింది ఎవరు..? విస్తుపోయే వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే హృదయం ద్రవించకమానదు.. భారత శక్తి పాఠకులకోసం ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ అందిస్తున్న హృదయాంతరాళాలను తట్టి లేపే కథనం..  
Read More...
తెలంగాణ 

అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు

అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అమెరికా లో చదువుకుని వచ్చిన నీకు..ఎంఎల్ఏ లు చర్చలు ఎక్కడ చేయాలో తెలియదా! రోడ్డు మీద చర్చ చేయాలా అనే ఙ్ఞానం కూడా లేదా..? కేటీఆర్...నువ్వు రేవంత్ ను గోకుడు ఎందుకు.. తన్నించుకోవడం ఎందుకు..? సీఎం రేవంత్ నిధుల కోసం ఢిల్లీ వెళ్తే.. కేసీఆర్ కుటుంబం లిక్కర్ దందా కోసం ఢిల్లీ వెళ్లింది మా సీఎం రేవంత్ కేంద్రం చుట్టు  నిధుల కోసం తిరుగుతున్నారు.. కేటీఆర్ విదేశాల చుట్టూ తిరుగుతున్నారు కేటీఆర్ కి విదేశాల్లో పని ఏంది..? మా అనుభవం ముందు..నీ అనుభవం ఎంత..? కేటీఆర్..హరీష్ లు సవాల్ విసిరితే చర్చకు నేను ఏ క్లబ్ కి అయినా వస్తా కేటీఆర్ పై నిప్పులు చెరిగినా జగ్గారెడ్డి
Read More...
తెలంగాణ  క్రైమ్ 

చిన్నమ్మే చంపింది...

చిన్నమ్మే చంపింది... జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణ హత్యకు గురైన ఆకుల హితీక్ష అనే చిన్నారిని ఆ పాప చిన్నమ్మ మమతనే గొంతు కోసి హత్య చేసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చిన్నారి హితీక్ష కుటుంబానికి దక్కుతున్న గౌరవం తమకు దక్కడం లేదని ఈ ఘాతుకానికి మమత ఒడిగట్టినట్టు తెలిసింది. కుటుంబంలో గౌరవం దక్కడం లేదని మమత పగ...
Read More...
తెలంగాణ 

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోయినా పేదలకు ఆర్ధిక తోడ్పాటు

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోయినా పేదలకు ఆర్ధిక తోడ్పాటు ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూన్ 28: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అయినప్పటికీ వాటిని సరిచేసుకుంటూ ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు ఆర్ధిక తోడ్పాటు అందిస్తుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్...
Read More...
తెలంగాణ 

మందమర్రి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పివి నరసింహారావు జయంతి వేడుకలు

మందమర్రి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పివి నరసింహారావు జయంతి వేడుకలు మందమర్రి, జూన్ 28 (భారత శక్తి): మందమర్రిలో కార్మిక,గనుల శాఖ మంత్రివర్యులు చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలు మందమర్రి మార్కెట్ సంజయ్ గాంధీ విగ్రహం వద్ద శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది.మొదట యూత్ కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.యూత్ కాంగ్రెస్ నాయకులు చెన్నూరు నియోజక యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నేరటి వెంకటేష్,రాయబారపు కిరణ్,చిప్పకుర్తి శశిధర్ మాట్లాడుతూ పీవీ నరసింహారావు భారతరత్న అవార్డు గ్రహీత, తొలి తెలుగు ప్రధాని తెలంగాణ నుండి కూడా మొట్టమొదటి ప్రధాని మంత్రి అని బహుభాషా కోవిదుడు అని కొనియాడారు. ఆ మహనీయుని కి ఇదే ఘన నివాళి అని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రమేష్,చోటు,సూరజ్ కిరణ్,సతీష్,బాచి, చింటూ,శంకర్, రాజ్ కుమార్,రాజేష్,రాజు పాల్గొన్నారు.
Read More...
తెలంగాణ 

కాలానుగుణ వ్యాధుల నిర్మూలనకు ముందస్తు చర్యలు తీసుకోవాలి: అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్.

కాలానుగుణ వ్యాధుల నిర్మూలనకు ముందస్తు చర్యలు తీసుకోవాలి: అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 28: నిర్మల్ జిల్లాలో వర్షాకాలంలో వ్యాపించే కాలానుగుణ వ్యాధుల నియంత్రణకు వైద్యశాఖ పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో జిల్లా వైద్యాధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన, కాలానుగుణ వ్యాధుల నివారణ, టిబి వ్యాధి నిర్మూలన తదితర అంశాలపై సమీక్ష చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలంలో వ్యాధులు విస్తరించే ప్రమాదం ఉన్నందున ముందుగానే ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడినన్ని వ్యాధి నిర్ధారణ కిట్లు, ఔషధాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. టిబి వ్యాధిని నిర్మూలించేందుకు టిబి ముక్త భారత్ కార్యక్రమం పరిధిలో అధికారులు పూర్తిస్థాయిలో కృషి చేయాలని ఆదేశించారు. టిబి బాధితులకు సమయానికి వైద్య సేవలు అందించి, వారిని ఆరోగ్యవంతులుగా మార్చాల్సిన బాధ్యత వైద్యాధికారులదేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. రాజేందర్, డి.సి.ఎచ్ డా. సురేష్, వైద్య శాఖ అధికారులు రవీందర్, రాజా రమేష్, ఆశిష్ రెడ్డి, బోజా రెడ్డి. డాక్టర్ జాదవ్ విజయానంద్. తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
Read More...
తెలంగాణ 

సిపిఐ 25 వ కడప జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని వాల్ పోస్టర్లు విడుదల

సిపిఐ 25 వ కడప జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని వాల్ పోస్టర్లు విడుదల పోరుమామిళ్ల, భారత శక్తి ప్రతినిధి, జూన్ 28: భారతదేశంలో ఆనాటి స్వాతంత్ర ఉద్యమం నుండి ఈనాటి వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని పేద బడుగు బలహీన వర్గాల కోసం , విద్యార్థి యువజన విద్యార్థి యువజన శ్రామిక ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, లు ఆటోలకు ఫ్లెక్సీ పోస్టర్లు అంటించి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రాజెక్టుల సాధన కోసం పోరాటానికి జిల్లా మహాసభలో బద్వేల్ పట్టణంలో వేదిక కానున్నాయి ఈ మహాసభలకు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, ఓబులేసు, జగదీష్, శివారెడ్డి, జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు ,కౌన్సిల్ సభ్యులు పార్టీ సభ్యులు, కార్మిక,కర్షక, పేద బడుగు బలహీన వర్గాల కు చెందిన ప్రజలు జిల్లా వ్యాప్తంగా నలుమూల నుంచి అధిక సంఖ్యలో బద్వేల్ పట్టణంలో జరుగు భారీ ర్యాలీ,బహిరంగ సభకు రావాలని కోరుమామిళ్ల మండల సమితిగా వాల్ పోస్టర్లు విడుదల చేశారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కేశవ, చెన్నయ్య, కలసపాడు మండల కార్యదర్శి సునీల్, ఆటో నాయకులు చంద్ర, జయన్న, మౌలాలి తదితరులు పాల్గొన్నారు
Read More...
తెలంగాణ 

మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి : జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి : జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ (భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జూన్ 28: పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి పాఠశాలలో తరగతి గదులను పరిశీలించి పదవ తరగతి విద్యార్థులకు కాసేపు గణితం బోధించారు. విద్యార్థులచే బోర్డు మీద లెక్కలు చేయించారు. పదవ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రతి విద్యార్థి ప్రత్యేక దృష్టి సాధించి కష్టపడి చదవాలని సూచించారు. పాఠశాల మైదానం పరిశీలించి శారీరకంగా మానసికంగా, ఆరోగ్యంగా ఎదిగేందుకు చదువుతోపాటు ప్రతి విద్యార్థి క్రీడలలో తప్పక పాల్గొనాలని సూచించారు. ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులకు హాజరుకావాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని, అలాగే సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాఠశాల పరిసర ప్రాంతాలను, టాయిలెట్స్ కూడా శుభ్రంగా ఉంచాలని తెలిపారు. అలాగే పాఠశాలలోని అందరి విద్యా ర్థులు స్కూల్ యూనిఫామ్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తదితరులు పాల్గొన్నారు.
Read More...
తెలంగాణ 

మరణించిన బిఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి 2,లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

మరణించిన బిఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి 2,లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు (భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జూన్ 28: బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కార్యకర్తల కొరకు ( ఎల్ ఐ సి ) ప్రమాదబీమా పాలసీ కట్టడం ద్వారా ప్రమాదంలో మరణించిన వర్ని మండలం జాకోరా గ్రామంలో ప్రమాదవశత్తు మరణించిన బిఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి 2,లక్షల ప్రమాద బీమా చెక్కును ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ బాద్యులు మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అదేశాల మేరకు చెక్కు ఇవ్వడం జరిగింది. పార్టీ ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటుందని ధైర్యాన్ని కల్పించిన అనంతరం కీ.శే ఏందుగుల దత్తు బార్య ఏందుగుల లక్ష్మి కి, బిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎం కె. ముజిబోద్దిన్, చెక్కు అందజేసారు. ఈ కార్యక్తమంలో బాన్సువాడ మునిసిపల్ వైస్ చైర్మన్ జుబేర్,వర్ని మాజీ కో ఆప్షన్ సభ్యులు ఏజాజ్, కామారెడ్డి మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు హఫీజ్ బెగ్. గెరిగంటి లక్ష్మినారాయణ, జాకోరా గ్రామ అధ్యక్షులు గైని లక్మన్, నాయకులు,ఆసీఫ్,జీషన్, ఫహీమ్, ఆనంద్ గౌడ్, ప్రవీణ్ యాదవ్, ఉస్మాన్, మధు, మహేందర్ రెడ్డి, సాయితేజ, సతీష్,సంతోష్, జాకోరా గ్రామ బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read More...