గాయత్రి నగర్ గ్రంథాలయ భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

గాయత్రి నగర్ గ్రంథాలయ భవనాన్ని  పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

ఎల్బీనగర్:

మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్ గాయత్రి నగర్‌లో నిర్మాణంలో ఉన్న గ్రంథాలయ భవనాన్ని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి నేడు సందర్శించి పరిశీలించారు.2023 సంవత్సరంలో రూ.98 లక్షల నిధులతో ఈ గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేయగా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు నేటికీ పూర్తికాక అసంపూర్తిగా మిగిలిపోయాయి. త్వరలో గ్రంథాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, గ్రంథాలయ ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ కార్యదర్శిని పిలిపించి, గ్రంథాలయానికి అవసరమైన ఫర్నిచర్, పుస్తకాలు, కంప్యూటర్లు, విద్యుత్, తాగునీరు, పరిశుభ్రతతో పాటు అన్ని మౌలిక సదుపాయాలను అత్యవసరంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైన ఏర్పాట్లు పూర్తయిన వెంటనే గ్రంథాలయాన్ని ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో అర్కల భూపాల్ రెడ్డి, దీప్లాల్ చౌహాన్, అర్కల కామేష్ రెడ్డి, దిండు భూపేష్ గౌడ్, శ్రీను నాయక్, బాల్ రాజ్, మాధవి తదితరులు పాల్గొన్నారు.

About The Author