క్రీడలు
క్రీడలు 

కరాటేతో ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది

కరాటేతో ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది వేములవాడ, జూన్ 11(భారత శక్తి) : కరాటేతో ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం‌ పెంపొందుతాయని పట్టణ సీఐ వీరప్రసాద్ అన్నారు. బుధవారం మహదేవ్ ఫంక్షన్ హాల్ లో ఓకినవా సీనియర్ కరాటే మాస్టర్ అబ్దుల్ మన్నన్ సమ్మర్ క్యాంప్ లో శిక్షణ పొందిన విద్యార్థులకు కరాటే గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని పలు రకాల బెల్ట్స్ సాధించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ పట్టణ సిఐ బి.వీరప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కరాటేలో శిక్షణ పొందడం వల్ల ధ్యానం, యోగ, ప్రాణాయామం వంటి అంశాల్లో ప్రభావితమై సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని వివరించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడం వల్ల వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వివరించారు.కరాటేకి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులతో పాటు గత 35 సంవత్సరాల నుండి రాజన్న జిల్లాలో విద్యార్థిని విద్యార్థులకు కరాటే శిక్షణ ఇస్తూ జాతీయ స్థాయి,అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులకు మెడల్స్ అందిస్తున్నా మన్నాన్ సేవలు అభినందనీయమని కొనియాడి, మాస్టర్ మన్నాన్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు మైలారం రాము మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం వల్ల విద్యార్థిని,విద్యార్థినీలు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని,అమ్మాయిలు తమను తాము రక్షించుకోవడానికి కరాటే ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.అలాగే పిల్లలకు ఉద్యోగాల్లో క్రీడా కోటలో రెండు శాతం రిజర్వేషన్ లభిస్తుందని తెలిపారు.ఈకార్యక్రమంలో కరాటే కోచ్లు లోలోపు రాజు, కనికరపు రాజశేఖర్, అనుగుల వర్షిత్, ప్రతాప రిషిక్ తేజ, గుడిసె సూర్య, జయచంద్ర పాల్గొన్నారు .
Read More...
క్రీడలు 

జాతీయ క్రీడల్లో రాణించిన మహిళ కానిస్టేబుల్‌ను అభినందించిన సిపి

జాతీయ క్రీడల్లో రాణించిన మహిళ కానిస్టేబుల్‌ను అభినందించిన సిపి ఉమ్మడి వరంగల్ బ్యూరో(భారత శక్తి)మే21: జాతీయ స్థాయి ఫెన్సింగ్‌ క్రీడలో రాణించిన ఆర్మూడ్‌ రిజర్వ్‌ మహిళా కానిస్టేబుల్‌ వరంగల్‌ పోలీస్ కమిషనర్ సన్‌ ప్రీత్‌ సింగ్‌ బుధవారం అభినందించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆర్మూడ్‌ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జి.స్పందన గత నెల పంజాబ్‌ రాష్ట్రం జలందర్‌ నిర్వహించిన మొదటి ఆల్‌ఇండియా పోలీస్‌ కబడ్డీ క్లస్టర్ 2024 – 25 క్రీడా పోటీల్లో ఫెన్సింగ్‌ క్రీడలో సినియాన్‌ వుమెన్స్‌ టీం ఫాయిల్‌ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ సందర్బంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలసిన స్పందనను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ క్రీడల్లో రాణించే పోలీస్‌ సిబ్బందికి పూర్తి సహాకారాన్ని అందించడం జరుగుతుందని. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే పోలీస్‌ క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సహకాలు వుంటాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు. ఈ కార్యక్రమములో పరిపాలన విభాగం అదనపు డిసిపి రవి, ఏ.ఆర్‌ ఏసిపి అంతయ్య పాల్గోన్నారు.
Read More...
క్రీడలు 

CSK vs RR Toss: టాస్ నెగ్గిన రాజస్థాన్.. మోత మోగించడం ఖాయం!

CSK vs RR Toss: టాస్ నెగ్గిన రాజస్థాన్.. మోత మోగించడం ఖాయం! చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మొదలైపోయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ నెగ్గిన రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. దీంతో ధోని సేన మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ఇతర మైదానాలతో పోల్చుకుంటే అరుణ్ జైట్లీ స్టేడియంలో బౌండరీ సైజ్ తక్కువ. కాబట్టి చేజింగ్ చేయాలనే ఉద్దేశంతో సంజూ మొదట బౌలింగ్ ఎంచుకోవచ్చు. కానీ బిగ్ స్కోర్ సెట్ చేసి ఇస్తే సీఎస్‌కేను మరింత ఒత్తిడిలోకి నెట్టేందుకు అవకాశం ఉండేది. అసలే ఈ సీజన్ మొత్తం చేజింగ్‌లో ఇబ్బందులు పడుతూ వచ్చింది ధోని సేన. సరైన ఫినిషర్లు లేకపోవడం, ఉన్న బ్యాటర్లూ ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడటంలో ఫెయిల్ అవడం ఆ టీమ్‌కు మైనస్‌గా మారింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ బౌలింగ్ చేయాలని డిసైడ్ అవడం కొంత ఆశ్చర్యకరమనే చెప్పాలి. దంచి కొడతారా? టాస్ ఓడిన చెన్నైకి తమ బ్యాటింగ్ పవర్‌ను నిరూపించేందుకు ఇదే బెస్ట్ చాన్స్ అని చెప్పాలి. ఓపెనర్లు ఆయుష్ మాత్రే, డెవిన్ కాన్వే దగ్గర నుంచి శివమ్ దూబె వరకు బిగ్ నాక్స్ ఆడాల్సిన సమయమిది. సీజన్ ఎలాగూ పోయింది కాబట్టి ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఫియర్‌లెస్ అప్రోచ్‌తో ఆడాలి. బౌండరీ సైజ్ చిన్నదే కాబట్టి భారీ షాట్లతో విరుచుకుపడాలి. ఒకవేళ ఎల్లో ఆర్మీ గనుక చెలరేగి ఆడితే మ్యాచ్ రసవత్తరంగా మారొచ్చు. ఎందుకుంటే ప్రత్యర్థి జట్టులో సూర్యవంశీ దగ్గర నుంచి హిట్‌మెయిర్ వరకు చాలా మంది పించ్‌‌హిట్టర్లు ఉన్నారు. మరి.. సీఎస్‌కే ఎలా బ్యాటింగ్ చేస్తుందో చూడాలి.
Read More...
క్రీడలు 

Ayush Mhatre: రాజస్థాన్‌ను భయపెట్టిన మాత్రే.. ఏం బాదాడు భయ్యా!

Ayush Mhatre: రాజస్థాన్‌ను భయపెట్టిన మాత్రే.. ఏం బాదాడు భయ్యా! రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనర్ ఆయుష్ మాత్రే చెలరేగిపోయాడు. ఆకాశమే హద్దుగా బౌండరీల మీద బౌండరీలు కొడుతూ ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టాడీ 17 ఏళ్ల బ్యాటర్. 20 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు మాత్రే. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. 215 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన ఆయుష్.. తుషార్ దేశ్‌పాండే, యుధ్‌వీర్ సింగ్‌ను చావబాదాడు. చెత్త బంతుల్ని శిక్షించడమే గాక మంచి డెలివరీస్‌ను కూడా బౌండరీకి తరలించాడతను. అయితే మాత్రే ఔట్ అవడంతో సీఎస్‌కే ఇన్నింగ్స్‌ పేకమేడను తలపించింది. పెవిలియన్‌కు క్యూ! ఆరంభంలో డెవిన్ కాన్వే, ఉర్విల్ పటేల్ ఇద్దరూ త్వరగానే ఔట్ అయ్యారు. 12 పరుగులకే వీళ్లు పెవిలియన్ చేరారు. అయినా భయపడకుండా సీనియర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (13) సాయంతో హిట్టింగ్‌కు దిగాడు ఆయుష్ మాత్రే. అయితే అతడు ఔట్ అవడంతో చెన్నై బ్యాటింగ్ భారీ కుదుపునకు లోనైంది. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (1)తో పాటు అశ్విన్ వెంటవెంటనే ఔట్ అయ్యారు. దీంతో 2 వికెట్లకు 67 పరుగులతో ఉన్న టీమ్ కాస్తా 5 వికెట్లకు 78 పరుగులతో తీవ్ర కష్టాల్లో పడింది. ప్రస్తుతం డెవాల్డ్ బ్రేవిస్ (9 నాటౌట్), శివమ్ దూబె (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరూ ఎంత సేపు క్రీజులో ఉంటారనే దాన్ని బట్టే సీఎస్‌కే భారీ స్కోరు ఆశలు ఆధారపడి ఉన్నాయి. కెప్టెన్ ధోని ఇంకా బ్యాటింగ్‌కు రాలేదు. చివర్లో మాహీ హిట్టింగ్‌కు దిగక తప్పదు. మరి.. చెన్నై ఎంత స్కోరు చేస్తుందో చూడాలి.
Read More...
క్రీడలు 

LSG vs PBKS: లక్నోను కట్టడి చేసిన పంజాబ్ కింగ్స్.. స్కోర్ ఎంత చేశారంటే..

LSG vs PBKS: లక్నోను కట్టడి చేసిన పంజాబ్ కింగ్స్.. స్కోర్ ఎంత చేశారంటే.. ఐపీఎల్ 2025లో 13వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ క్రమంలో ఆటకు దిగిన లక్నో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బాటింగ్‌లో కష్టాలు లక్నో జట్టు మొదటి వికెట్ కోల్పోయి ప్రారంభించినప్పటికీ, తరువాత పరిస్థితి అంత సులభంగా కనిపించలేదు. మిచెల్ మార్ష్ మొదటి ఓవర్లోనే అవుట్ కావడం, జట్టును కొంత ఇబ్బంది పెట్టింది. ఆ క్రమంలో 3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి, లక్నో స్కోరు 20 పరుగుల వద్ద నిలిచింది. ఇక, ఐడెన్ మార్క్రమ్ 18 బంతుల్లో 28 పరుగులు చేసి ఔట్ అవ్వడంతో, మరోసారి లక్నోకు ఎదురుదెబ్బ తగిలింది. రిషబ్ పంత్ కూడా 5 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవడం, లక్నో జట్టుకు మరో షాక్ ఇచ్చింది. హెల్ప్‌ఫుల్ ఇన్నింగ్స్ అయినా నికోలస్ పూరన్ తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టును నిలబెట్టాడు. 30 బంతుల్లో 44 పరుగులతో, పూరన్ ఆకట్టుకున్నప్పటికీ, నికోలస్ పూరన్ 4వ వికెట్‌గా ఔట్ అయ్యాడు. లక్నో స్కోరు 91/4గా నిలిచింది. ఈ క్రమంలో 15 ఓవర్లకు ముగిసే సమయానికి, లక్నో జట్టు 4 వికెట్ల నష్టంతో 116 పరుగులు చేసింది. అదే క్రమంలో లక్నోకు ఐదవ దెబ్బ తగిలింది. డేవిడ్ మిల్లర్ 19 పరుగులు చేసిన తర్వాత మార్కో జెన్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సమద్ కూడా.. ఆయుష్ బడోని రూపంలో లక్నోకు ఆరో షాక్ తగిలింది. ఆయుష్ బడోని 41 పరుగులు చేసిన తర్వాత అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత అబ్దుల్ సమద్ రూపంలో లక్నో ఏడవ దెబ్బను ఎదుర్కొంది. 27 పరుగులు చేసిన తర్వాత అబ్దుల్ సమద్‌ను అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేశాడు. దీంతో లక్నో చివరకు 20 ఓవర్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇక పంజాబ్ తరఫున అర్షదీప్ సింగ్ 3 వికెట్లు, ఫెర్గూసన్, మ్యాక్సెవెల్, జాన్సల్, చాహల్ తలో వికెట్ తీశారు. కలయిక
Read More...
క్రీడలు 

IPL 2025, PBKS vs LSG: పంజాబ్ సూపర్ విక్టరీ.. లఖ్‌నవూపై సునాయాస విజయం

IPL 2025, PBKS vs LSG: పంజాబ్ సూపర్ విక్టరీ.. లఖ్‌నవూపై సునాయాస విజయం పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లో (IPL 2025) తన హవా కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ తాజా మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై (PBKS vs LSG) సునాయాస విజయం సాధించింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69) మెరపు అర్థశతకం సాధించడంతో వార్ వన్‌సైడ్‌గా మారిపోయింది. వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా శ్రేయస్ అయ్యర్ (52 నాటౌట్) అర్ధశతకం సాధించాడు. నేహల్ వధేరా (43 నాటౌట్) కూడా సమయోచితంగా రాణించడంతో ఈ సీజన్‌లో పంజాబ్ వరుసగా రెండో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రేయస్ అయ్యర్ నమ్మకాన్ని నిలబెడుతూ పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. నికోలస్ పూరన్ (44), ఆయుష్ బదోనీ (41) చెప్పుకోదగ్గ స్కోరు సాధించారు. మార్‌క్రమ్ (28), అబ్దుల్ సమద్ (27) విలువైన పరుగులు చేశారు. దీంతో లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (2) మరోసారి విఫలమయ్యాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. ఫెర్గూసన్, మ్యాక్స్‌వెల్, జాన్సన్, ఛాహల్ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ ఆరంభంలోనే ప్రియాంశ్ ఆర్య (8) వికెట్ కోల్పోయింది. అయితే ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ అద్భుత హాఫ్ సెంచరీలతో పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చారు. చివర్లో నేహల్ వధేరా వేగంగా ఆడాడు. దీంతో పంజాబ్ 16.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దిగ్వేశ్ సింగ్ రెండు వికెట్లు తీశాడు.
Read More...
క్రీడలు 

బ్యాడ్మింటన్ కాంస్య పతకం సాధించిన పల్లెం రాజాలింగు.

బ్యాడ్మింటన్ కాంస్య పతకం సాధించిన పల్లెం రాజాలింగు. మందమరి టౌన్, మార్చ్ 26 (భారత శక్తి): ఇటీవల గోవాలో జరిగిన జాతీయ వెటరన్ బ్యాడ్మింటన్ పోటీలలో మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన పల్లెం రాజలింగు మాజీ సింగరేణి కార్మికుడు పాల్గొని కాంస్య పతకం సాధించారు. 75 సంవత్సరాల విభాగం డబుల్స్ పోటీలో విజేతగా నిలిచి కాంస్య పతకం అందుకున్నారు. జాతీయ స్థాయిలో గెలుపొందిన పల్లెం రాజాలింగు వచ్చే నెల అంతర్జాతీయ స్థాయిలో థాయిలాండ్ లో జరుగనున్న పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజలింగు మాట్లాడుతూ గతంలో రెండుసార్లు అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యారని 75ఏళ్ల వయస్సులో ఆడే అవకాశం సత్తా ఉన్న ఆర్ధిక స్థోమత లేక వెళ్ళకపోయినట్లు తెలిపారు.
Read More...
క్రీడలు 

క్రీడాకారులను మెడల్స్ తో అభినందించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్

క్రీడాకారులను మెడల్స్ తో అభినందించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్, ఫిబ్రవరి 28(భారత శక్తి): ఆల్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీలు బెంగుళూరులో జరుగగా తెలంగాణ రాష్టం నుండి ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్ నగరానికి చెందిన షేక్ జియా హుస్సేన్, మహమ్మద్ సజ్జాద్ టైటిల్, బ్లాక్ బెల్టు సాధించగా శుక్రవారం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారిని శాలువాలతో సత్కరించారు. ఇటీవల బెంగుళూరులో జరిగిన జూనియర్ మిస్టర్ ఇండియా టైటిల్ ను షేక్ జియ హుస్సేన్ గెల్చుకోగా, హైదరాబాదులో జరిగిన ఆల్ ఇండియా కరాటే పోటీల్లో మహమ్మద్ సజ్జాద్ బ్లాక్ బెల్ట్ సాధించారు. శుక్రవారం కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, మాజీ కార్పొరేటర్లు వాల రమణారావు, దిండిగాల మహేష్, తోట రాములు, బోనాల శ్రీకాంత్, నాయకులు గందె మహేష్, కర్ర సూర్య శేఖర్, ఆసిమ్ తదితరులు ఉన్నారు.
Read More...
క్రీడలు 

ప్రారంభమైన రాష్ట్రస్థాయి కరాటే పోటీలు

ప్రారంభమైన  రాష్ట్రస్థాయి కరాటే పోటీలు మందమర్రి టౌన్, ఫిబ్రవరి 23(భారత శక్తి) పట్టణంలోని సిఐఎస్ఎఫ్ బ్యారెక్స్ లో తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ఆదివారం రోజు ప్రారంభం కావడం జరిగింది. పోటీలను మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, దారా రవి సాగర్ రజిని దంపతులు పాల్గొని ప్రారంభించడం జరిగింది. రెండవ రోజు పోటీలకు వివిధ జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు . ఈ పోటీలను ఉద్దేశించి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ఎదుగుదలకు క్రీడలు ముఖ్యమని ప్రతి ఒక తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు అ రానున్న బిజెపి ప్రభుత్వంలో ప్రతి పాఠశాలలో కరాటేను తప్పనిసరి చేస్తామని తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రంగు శ్రీనివాస్ మాయ రమేష్ బిజెపి నాయకులు ధారా రవి సాగర్ దంపతులు రజనీష్ జైన్, అక్కల రమేష్ దుర్గం అశోక్ దీక్షితులు. సప్పిడి నరేష్ కరాటే మాస్టర్లు హరికృష్ణ. భూమయ్య. సంతోష్ పోచంపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.
Read More...
క్రీడలు 

రాష్ట్రస్థాయి కేలో ఇండియా ఉషూ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన పోడకంటి పవిత్ర చారి.

రాష్ట్రస్థాయి కేలో ఇండియా ఉషూ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన పోడకంటి పవిత్ర చారి. ఖమ్మం బ్యూరో, భారత శక్తి, ఫిబ్రవరి 21: తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉషు పోటీలు అదిలాబాద్ జిల్లా ఇందిరా ప్రియదర్శిని ఇండోర్ స్టేడియం నందు జరిగిన కేలో ఇండియా ఉమెన్స్ లీగ్ సీనియర్ విభాగంలో ఖమ్మం జిల్లాకు చెందిన పోడకంటి పవిత్ర చారి మొదటి బహుమతి గోల్డ్ మెడల్ సాధించినది అని కోచ్ పి పరిపూర్ణాచారి తెలిపారు. పోడకండి పవిత్ర చారి నాన్- దావో ఈవెంట్ లో గోల్డ్ మెడల్ సాధించిన పవిత్ర చారి ఇండియా జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున అర్హత సాధించడం జరిగింది. గోల్డ్ మెడల్ సాధించిన పవిత్ర చారిని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి టి సునీల్ కుమార్ రెడ్డి, ఉషూ జాతీయస్థాయి కోచ్ పరిపూర్ణ చారి అభినందనలు తెలిపారు.
Read More...
క్రీడలు 

తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు.

తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు. మందమర్రి టౌన్, ఫిబ్రవరి 20(భారత శక్తి): మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు జరగనున్నాయి. పట్టణంలోని సిఐఎస్ఎఫ్ బ్యారెక్స్ లో ఈనెల 22 & 23 తేదీలలో తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రంగు శ్రీనివాస్ గురువారం రోజు ఒక ప్రకటనలో తెలిపారు ఈ పోటీలకు తెలంగాణలోని 33 జిల్లాల నుంచి 600 మంది క్రీడాకారులు పాల్గొంటారని వారికి భోజన వసతి కూడా సమకూరుస్తున్నట్లు తెలపడం జరిగింది. పోటీ నిర్వాహకులు మాస్టర్ రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడాకారులలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి వాళ్లను మరింత ప్రోత్సహించడానికి ఇలాంటి పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ కరాటే మాస్టర్ హరికృష్ణ పాల్గొన్నారు.
Read More...
క్రీడలు 

క్రీడా స్ఫూర్తితో ముగిసిన స్మార్ట్ కిడ్జ్ స్పోర్ట్స్ మీట్. స్మార్ట్ కిడ్జ్ విజేతలకు బహుమతులు అందించిన ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసులు

క్రీడా స్ఫూర్తితో ముగిసిన స్మార్ట్ కిడ్జ్ స్పోర్ట్స్ మీట్.  స్మార్ట్ కిడ్జ్ విజేతలకు బహుమతులు అందించిన ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసులు ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 08: స్మార్ట్ కిడ్జ్ పాఠశాల మైదానంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న స్మార్ట్ కిడ్జ్ స్పోర్ట్స్ మీట్ శనివారం సాయంత్రం తో ముగిశాయి. రెండవ రోజు విద్యార్థులకు కబడ్డీ, కోకో, హార్దిల్స్, టెన్నికాయిడ్ తదితర క్రీడాంశాలలో విద్యార్థులు పొటా పోటీగా తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య పర్యవేక్షణలో జరిగిన స్పోర్ట్స్ మీట్ బహుమతి ప్రధానోత్సవ సభకు ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు గెలుపు ఓటములను క్రీడా స్ఫూర్తితో తీసుకొని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని కోరారు. పాఠశాల విద్యార్థులందరూ క్రీడా పోటీలలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటి చెప్పడం అభినందనీయం అన్నారు. విద్యార్థులకు మైదానంలో క్రీడా పోటీలు నిర్వహించి ప్రోత్సహించడం పట్ల పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. క్రీడలు మానసిక, శారీరక దృడత్వాన్ని పెంచి చదువుల్లోనూ ,ఇతర వ్యవహారాల్లోనూ చురుకుగా ఉంచేలా చైతన్యం చేస్తాయన్నారు. పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి విద్యార్థి క్రీడా పోటీల్లో నూ పాల్గొనేలా ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ తో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బహుమతి ప్రధానోత్సవం అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి, జానపద, సాంప్రదాయ నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.
Read More...