క్రైమ్
తెలంగాణ  క్రైమ్ 

చిన్నమ్మే చంపింది...

చిన్నమ్మే చంపింది... జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణ హత్యకు గురైన ఆకుల హితీక్ష అనే చిన్నారిని ఆ పాప చిన్నమ్మ మమతనే గొంతు కోసి హత్య చేసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చిన్నారి హితీక్ష కుటుంబానికి దక్కుతున్న గౌరవం తమకు దక్కడం లేదని ఈ ఘాతుకానికి మమత ఒడిగట్టినట్టు తెలిసింది. కుటుంబంలో గౌరవం దక్కడం లేదని మమత పగ...
Read More...
క్రైమ్ 

జిల్లాలో శృతి మించుతున్న పంచాయతీ సెక్రటరీల వ్యవహారం

జిల్లాలో శృతి మించుతున్న పంచాయతీ సెక్రటరీల వ్యవహారం భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 28: నిర్మల్ జిల్లా ఉద్యోగులుగా చట్టాలు, నిబంధనలకు లోబడి పని చేయాల్సిన కొందరు అధికారులు, సిబ్బంది తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కాసులకు కక్కుర్తి పడి అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆశయాలకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. మొన్ననే దస్తురాబాద్ మండలంలోని ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలన చిక్కి సస్పెండ్ అయ్యాడు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఒత్తిడి తెస్తున్నారంటూ బుకాయిస్తూ తమ చర్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి నెలా ప్రజలు చెల్లించే పన్నులతో లక్షలాది రూపాయలు వేతనాల రూపంలో తీసుకుంటూనే అడ్డగోలు సంపాదనకు తెరలేపుతున్నారు. అక్కడక్కడ పట్టుబడిన సంఘాలు, యూనియన్ల పేరుతో హడావుడి చేస్తూ పై స్థాయిలో పలుకుబడి ఉపయోగించి చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రం కాలనీలో పని చేసిన ఇరువురు సెక్రటరీలను ఇంటి నంబర్లు కేటాయింపు, ఇతర అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన జిల్లా ఉన్నతాధికారి సస్పెండ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారాన్ని బయటికి పొక్కకుండా ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు గుట్టుగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. మరొక అధికారి కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చినట్లు బుకాయిస్తున్నారు. ఇలా సిబ్బంది తప్పులను కప్పి పుచ్చుతూ పై నుంచి కింది స్థాయి వరకు వాటాలు చేతులు మారుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల దస్తురాబాద్ మండలం గోడిసెర్యాల గ్రామ పంచాయతీ సెక్రెటరీ శివకృష్ణ ఏసీబీకి చిక్కారు. ఏకంగా రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత ఖానాపూర్. రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ జరుపుతున్న దాడుల్లో అధికారులు వరుసగా పట్టుబడుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా దాస్తురాబాద్ మండలం గోడిసెర్యాల గ్రామ పంచాయతీ సెక్రెటరీ శివకృష్ణ ఏసీబీకి చిక్కారు. వాటర్ ప్లాంట్ నిర్మాణానికి అనుమతి కోసం రాజేశం అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి గాను పంచాయతీ కార్యదర్శి రూ. 12వేలు అంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.అధికారులు పక్కా ప్లాన్తో బాధితుడి నుంచి శివకృష్ణ రూ.12 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం పంచాయతీ సెక్రెటరీని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కోర్టుకు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. ప్రభుత్వం పేరు బదలాయింపులు నిలుపుదల చేసినప్పటికీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన ఇందిర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి మ్యుటేషన్ నిర్వహించారు. పైగా ఏజెన్సీ ప్రాంతంలో ఇటువంటి చర్యలకు పాల్పడటం సెక్రటరీల దూక సడుకు అద్దం పడుతోంది. ప్రస్తుత కొందరు సెక్రటరీలు కేవలం ఆఫ్లైన్లోనే రికార్డు చేశామని బుకాయిస్తుండటం గమనార్హం. అయితే ఆన్లైన్లో కాని, ఆఫ్లైన్లో కాని నమోదు చేయడం చట్ట రీత్యా నేరమైనప్పటికీ ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
Read More...
క్రైమ్ 

నకిలీ విత్తనాలపై నజర్‌ ఏది ? -రైతులకు పంటల సీజన్ సమీపిస్తున్న తరుణంలో నాణ్యమైన విత్తనాలు ఏవి?

నకిలీ విత్తనాలపై నజర్‌ ఏది ? -రైతులకు పంటల సీజన్ సమీపిస్తున్న తరుణంలో నాణ్యమైన విత్తనాలు ఏవి? భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 27: రైతులకు పంటల సీజన్ సమీపిస్తున్న తరుణంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసే దుకాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన వ్యవసాయ అధికారులు ఆ వైపున కన్నెత్తి చూడడం లేదు. పుట్టగొడుగుల వెలుస్తున్న ఫర్టిలైజర్ పెస్టిసైడ్ దుకాణాలలో నిలువ చేస్తున్నటువంటి ఎరువులను విత్తనాలను దుకాణపు యజమానులు మార్కెట్...
Read More...
క్రైమ్ 

ప్రైవేట్‌ బడి.. అంతులేని దోపిడీ

ప్రైవేట్‌ బడి.. అంతులేని దోపిడీ భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 27: నిర్మల్ జిల్లాలో విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసే దిశగా పనిచేయాల్సిన ప్రైవేట్ పాఠశాలలు అక్రమార్జనకు పాల్పడుతున్నాయి. ఫీజుల పేరుతో వేల రూపాయలు వసూళ్లు చేస్తూ దందా సాగిస్తున్నాయి. వీటితో పాటు బట్టల వ్యాపారం కూడా మొదలు పెట్టి విద్యావ్యవస్థల పరువు తీస్తున్నారు. ఏ దశలో దేని వదలకుండా అక్రమ సంపాదన కై అడ్డదారులు వెతుకుతున్నారు. దీంతో అన్ని విధాలుగా విద్యార్థుల నుంచి డబ్బు వసూళ్లు చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఫీజుల భారం మోపుతున్నారు. ప్రతి ఏడాది ఇదే తంతు జరుగుతున్న ప్రైవేట్ ఆగడాలను నియంత్రించడంలో ప్రభత్వ విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. బడిలో బట్టల వ్యాపారం.. పాఠశాలలో యాజమాన్యమే బట్టల వ్యాపారం మొదలు పెట్టింది. విద్యా ప్రమాణాలు అందివ్వాల్సిన ప్రైవేట్ పాఠశాలలు అదనంగా అక్రమంగా సంపాదించే వనరుల పై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లా పరిధిలో సుమారు 80 పైచిలుకు ప్రైవేట్ పాఠశాల వరకు ఉన్నాయి. వీటిలో కార్పొరేట్ పాఠశాలలుగా చెప్పుకుంటున్న, పాఠశాల యాజమాన్యాలు స్కూల్ డ్రస్ లను విక్రయిస్తున్నారు. మార్కెట్లో అనేక స్కూల్ డ్రస్ ల దుకాణాలు ఉన్నప్పటికీ అక్కడ కొనుగోలు చేస్తే అనుమతించలేమని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులు చేసేదేమీ లేక యాజమాన్యం చెప్పిన ధరలకే స్కూల్ లో డ్రస్ లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవే డ్రస్సులు బయట దుకాణాల్లో ఒక జత రూ.500 ఉంటే ఆ పాఠశాలలో రూ. 1000 నుంచి 1500 వరకు ధర ఉంది. పట్టణంలో ఉన్న ఓ పాఠశాలలో ఒక్క యూనిఫామ్ కు రూ. 4500 లకు విక్రయిస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో వసూలు చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వివిధ పేర్లతో బురిడీ కొట్టిస్తున్న విద్యా సంస్థలు.. ప్లే, ఒలంపియాడ్, టెక్నో, సీబీఎస్ఈ, ఐఐటీ, కార్పొరేట్ స్థాయిలో విద్యనందిస్తామని తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నారు. అనుమతులు అడ్డగోలుగా ఇవ్వడం వలన రకరకాల పేర్లతో నిర్వహణ చేస్తూ అధిక ఫీజులను వసూలు చేస్తున్నారు. బరువులు మోయలేని నర్సరీ ఎల్కేజీ విద్యార్థులకు అధిక మొత్తంలో పుస్తకాలు కొనిపించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఎల్కేజీ విద్యకే సుమారు అర లక్ష ఖర్చు అవుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రమాణాలు పాటించకుండా విద్యా సంస్థలు నిర్వహిస్తూ కనీస సౌకర్యాలు కూడా సమకూర్చడం లేదు. చాలా పాఠశాలల్లో క్రీడా స్థలాలు, వాష్ రూమ్లు, తాగునీరు వంటి వసతులు సక్రమంగా ఉండటం లేదని ఆరోపణలు ఉన్నాయి. మాముళ్ల మత్తులో అధికారులు.. ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోయిన విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అటువైపే వెళ్లకపోవడంతో యథేచ్ఛగా అధిక ఫీజులు, యూనిఫామ్ దందా చేస్తున్నారు. ఈ సమయంలో ప్రైవేట్ యాజమాన్యాల నుంచి అధికారులకు లక్షల రూపాయాల మామ్ముళ్ల అందజేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పలుకుబడి గల వ్యక్తుల ఒత్తిడి మేరకు చర్యలు తీసుకోవడం ఇబ్బందికరంగా ఉన్నదని అధికారులు చర్చించుకుంటున్నారు. జిల్లా ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Read More...
క్రైమ్ 

షాపుర్‌నగర్‌ మహిళ హత్య కేసులో నిందితుల అరెస్టు

షాపుర్‌నగర్‌ మహిళ హత్య కేసులో నిందితుల అరెస్టు హైదరాబాద్, భారత శక్తి ప్రతినిధి, జూన్ 25: సైబరాబాద్‌ షాపుర్‌నగర్‌లోని న్యూ ఎల్‌బి నగర్‌లో నివసిస్తున్న 39 ఏళ్ల శ్రీమతి సట్ల అంజలి హత్యకు పాల్పడిన నిందితులను జీడిమెట్ల పోలీసులు విజయవంతంగా గుర్తించి పట్టుకున్నారు. ఈ నేరాన్ని ఆమె సొంత కుమార్తె, చట్ట విరుద్ధ బాలుడు (సిసిఎల్)-1, ఆమె ప్రియుడు ఎ-1: పగిల్లా శివ కుమార్ మరియు మరొక సిసిఎల్-2 బాలుడితో కలిసి కుట్ర పన్ని అమలు చేసింది. పోలీసులు ఈ కేసును సమగ్ర దర్యాప్తు మరియు వేగవంతమైన చర్యతో ఛేదించారు, ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు.కేసు వివరాలు:24-06-2025న మధ్యాహ్నం 01:55 గంటలకు, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, కొంపల్లి, గుండ్లపోచంపల్లికి చెందిన శ్రీమతి తంగెల్లపల్లి శోభ, తన చెల్లెలు శ్రీమతి సట్ల అంజలి, షాపూర్‌నగర్‌లోని న్యూ ఎల్‌బి నగర్‌లోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని ఫిర్యాదు చేశారు. ఆమె శరీరం వంటగదిలో వెక్కిరిసిన స్థితిలో పడి ఉందని, మెడ చుట్టూ లిగేచర్ గుర్తులు ఉన్నాయని, ఇది గొంతు కోసినట్లు సూచిస్తుంది. మృతుడి చిన్న కుమార్తెతో ప్రాథమిక విచారణలో వాస్తవాలు వెల్లడయ్యాయి, మృతుడి పెద్ద కుమార్తె (సిసిఎల్-1), 16 సంవత్సరాలు, ఎ -1: ​​పగిల్లా శివ కుమార్ (డీజే ఆపరేటర్) తో సంబంధం కలిగి ఉంది, దీనిని మృతుడు వ్యతిరేకించాడు. దీని ఫలితంగా తరచుగా గొడవలు మరియు హెచ్చరికలు జరిగాయి, ఫలితంగా బాలుడు ఎ -1 మరియు సిసిఎల్-2 లతో కలిసి తన తల్లిని చంపడానికి కుట్ర పన్నాడు. 23-06-2025 సాయంత్రం, సిసిఎల్ -1 వ్యూహాత్మకంగా తన చెల్లెలిని బయటకు పంపించి, ఎ -1 మరియు సిసిఎల్-2 లను ఇంట్లోకి పిలిపించింది. నిందితుడు తెల్లటి నైలాన్ చున్నీని ఉపయోగించి మృతుడి గొంతు కోసి చంపి, మరణాన్ని నిర్ధారించేందుకు తలకు గాయం చేశాడు. హత్య తర్వాత సి సి ఎల్ -1, ఇంటికి తాళం వేసి, ఆమె చెల్లెలిని మాట్లాడవద్దని హెచ్చరించింది. అయితే, ఆ చిన్నారి ఫిర్యాదుదారు అయిన తన అత్తకు సమాచారం అందించడంతో నేరం బయటపడింది.విశ్వసనీయ సమాచారం మరియు ఇన్‌స్పెక్టర్ జీడిమెట్ల జి. మల్లేష్ నేతృత్వంలోని పోలీసు బృందం చేసిన నిరంతర ప్రయత్నాల ఆధారంగా, నిందితులను గుర్తించి 24-06-2025న అరెస్టు చేశారు. విచారణ సమయంలో, వారు ఈ దారుణమైన చర్యలో తమ పాత్రలను అంగీకరించారు. జ్యుడీషియల్ కస్టడీకి పంపడానికి నిందితులను సమర్థ అధికారుల ముందు హాజరుపరిచారు. అరెస్టు చేయబడిన నిందితుల వివరాలు: 1. ఎ -1: ​​పగిళ్ల శివ కుమార్ అలియాస్ శివ, వయస్సు 19 సంవత్సరాలు, నివాసం. నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థి. 2. సి సి ఎల్ -1: బాధితురాలు/మరణించిన కుమార్తె. 3. సి సి ఎల్ -2: ఎ 1-బ్రదర్.బాధితురాలు తన కుమార్తె సంబంధానికి వ్యతిరేకత వ్యక్తం చేయడం వల్లే ఈ హత్య ముందస్తు ప్రణాళికతో జరిగిందని, ప్రేరేపించబడిందని దర్యాప్తులో తేలింది. బాలానగర్ డివిజన్‌కు చెందిన క్లూస్ టీం నేరం జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. ఫోరెన్సిక్ నమూనాలను సేకరించి, నేర దృశ్యాన్ని ఛాయాచిత్రాల ద్వారా నమోదు చేసింది. శవపరీక్ష కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు, ఇది గొంతు కోసి చంపడం వల్ల మరణించినట్లు నిర్ధారించింది. బాలానగర్ డిసిపి కె. సురేష్ కుమార్, ఐపిఎస్., ప్రత్యక్ష పర్యవేక్షణలో మరియు వీరి నిరంతర ప్రయత్నాలతో ఈ కేసును గుర్తించారు: నరేష్ రెడ్డి, బాలానగర్ డివిజన్ ఏసీపీ,జి. మల్లేష్, పోలీస్ ఇన్స్పెక్టర్, జీడిమెట్ల పిఎస్,ఎస్.కనకయ్య, డీఐ, జీడిమెట్ల పీఎస్. కె. నాయుడు ఎం. సత్యనారాయణ ఎస్ ఐ, జీడిమెట్ల పి ఎస్. కానిస్టేబుళ్లు నరేష్, రవి నాయక్, వెంకటేష్, జీడిమెట్ల పి.ఎస్.ఈ అధికారులు మరియు సిబ్బంది కీలకమైన ఆధారాలను సేకరించడం, డిజిటల్ ఆధారాలను విశ్లేషించడం మరియు ఒప్పుకోలు రాబట్టడం ద్వారా ఆదర్శప్రాయమైన దర్యాప్తు నైపుణ్యాలను ప్రదర్శించారు, తద్వారా హత్యను గంటల్లోనే ఛేదించి, తదుపరి పరిణామాలను నిరోధించారని బాలానగర్ జోన్ డిసిపి కె. సురేష్ కుమార్, ఐపీఎస్ తెలిపారు.
Read More...
క్రైమ్ 

మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ

మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 25: నిర్మల్ జిల్లా లో జూన్ 26 అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు సాగిన ఈ ర్యాలీలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలపై వ్యతిరేక నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ అధికారి ఎం.ఎ. రజాక్ మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాల వైపు ఆకర్షితమవకుండా వారిలో చైతన్యం కల్గించాల్సిన అవసరం ఉందన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా కుటుంబం, సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అబ్కారీ శాఖ సిబ్బంది, పలువురు అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More...
క్రైమ్ 

గంజాయి నిర్మూలన మన అందరి బాధ్యత – కూకటి వేళ్ళతో తొలగించండి!”

గంజాయి నిర్మూలన మన అందరి బాధ్యత – కూకటి వేళ్ళతో తొలగించండి!” భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జులై 25:నిర్మల్ జిల్లా మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా అధికారులకు జిల్లా ఎస్పీ డా:జి.జానకి షర్మిల దిశా నిర్దేశం చేశారు. మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా బుధవారం నిర్మల్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అధికారులతో జిల్లా ఎస్పీ,నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.జిల్లాలో అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, మిస్సింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అండగా ఉండాలని, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో ఉండాలని సూచించారు. అత్యాచార, పొక్సో కేసులలో ధర్యాప్తును వేగవంత చేయాలని, నిర్ణిత గడువులో దోషులను న్యాయస్థానం ముందు ఉంచాలని అన్నారు. లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ఈ కేసుల ఛేదనకు సర్కిల్ పరిధిలో స్పెషల్ టీం లను ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ఉక్కుపాదంతో ముందడుగు వేయాలని,జిల్లాలో గంజాయి సరఫరా మరియు వినియోగం పై కఠిన చర్యలు తీసుకోవాలని, మిషన్ గంజా గస్తీ ప్రోగ్రాం ను పక్కాగా అమలు చేయాలని ముఖ్యంగా యువత ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా చూడాలని,అన్ని స్థాయిల పోలీసు అధికారులకు ఈ గంజాయి వ్యసనాలకు బారిన పడిన వారిపై ఉక్కుపాదంతో దాడి చేసి అరికట్టాలని సూచించారు.ప్రజలు మాదక ద్రవ్యాల సంబంధిత అనుమానాస్పద కార్యకలాపాలను గమనించినప్పుడు వెంటనే 8712659599 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.మాదక ద్రవ్యాల వలలో యువత పడకుండా రక్షించడమే తమ శాఖ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ దిశగా నిఘా చర్యలు మరియు చట్ట కార్యాచరణ నిరంతరం కొనసాగుతాయని హామీ ఇచ్చారు. అంతేకాకుండా జిల్లాలో నేరాల సంఖ్యను తగ్గించేందుకు,నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న రౌడీ షీటర్లను ముందస్తుగా గమనించి వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక నిఘా అవసరమని జిల్లా ఎస్పీ డా. జానకి శర్మిల. అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ మోసాలు, డ్రగ్ దుర్వినియోగం మరియు ట్రాఫిక్ రూల్స్ పై జిల్లా ప్రజలలో, విద్యాసంస్థలలో అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని యస్.హెచ్.ఒ లకు సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆన్లైన్ లో వీడియో కాల్స్ చేసి, పోలీసు అధికారులం అంటే నమ్మరాదని, ఏ పోలీస్ అధికారి వీడియో కాల్స్ చేయరని గుర్తించాలని అన్నారు. డిజిటల్ అరెస్ట్ లు ఉండవు, ఫిజికల్ అరెస్ట్ మాత్రమే ఉంటుందన్నారు. సైబర్ స్లేవరీ పేరుతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఇతర దేశాలకు పంపి ఇబ్బందులకు గురిచేస్తారని అన్నారు. జిల్లా ప్రజలు ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ మోసాలకు గురి అయినట్లైతే మొదటి గంట (గోల్డెన్ అవర్) లోపు 1930కు కాల్ చేసి లేదా యన్.సి.ఆర్.పి. https://www.cybercrime.gov.in/ పోర్టల్ నందు నమోదు ఫిర్యాదు నమోదు చేయాలని అన్నారు. దొంగతనం,ఆస్తి సంభందిత నేరాలకు సంబంధించి పాత నేరస్తులపై నిఘా ఉంచాలని కొత్తగా వచ్చిన అంబిస్ టెక్నాలజీని వినియోగించి, ఛాన్స్ ప్రింట్ ద్వారా కేసులను ఛేదించాలని అన్నారు. యన్.డి.పి.యస్. కేసులలో నేరస్తులపై హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయాలని,రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లు గా గుర్తించి, సైన్ బోర్డు లను ఏర్పాటు చేయించాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా ప్రతి రోజు సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు చేస్తూ, మద్యం తాగి వాహనాలను నడిపే వాహన దారీలపై కేసులు నమోదు చేయాలని సూచించారు. ఫేక్ నెంబర్ ప్లేట్స్, నెంబర్ ప్లేట్స్ మార్పు పై ప్రత్యేక దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అన్నారు. సిసి కెమెరాల ప్రాధాన్యతను వివరిస్తూ అన్నీ కుల మతాలకు చెందిన పవిత్ర స్థలాలలో మరియు పరిశ్రమలలో తదితర ముఖ్యమైన ప్రాంతాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా వివిధ సంఘాల పెద్దలకు అవగాహన కల్పించాలని యస్.హెచ్.ఒ లకు సూచనలు చేశారు. అధికారులు సిబ్బంది పవవిసు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని, ఇబ్బందులతో పోలీసు స్టేషన్ కు వచ్చే వారికి వారిలో ధైర్యాన్ని నింపాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఏ.ఎస్పీ అవినాష్ కుమార్ ఐపిఎస్, రాజేష్ మీన, ఇన్స్పెక్టర్లు గోవర్ధన్ రెడ్డి ఖానాపూర్, నైలు భైంసా రూరల్, గోపీనాథ్ బైంసా టౌన్ ,గోవర్ధన్ రెడ్డి సోన్ ,ప్రవీణ్ కుమార్ నిర్మల్ టౌన్,కృష్ణ నిర్మల్ రూరల్, మల్లేష్ ముధోల్ ,సమ్మయ్య డి ఎస్ బి, ఆర్ ఐ లు రామ క్రిష్ణ, రమేష్, అన్ని స్టేషన్ల ఎస్ హెచ్ ఓ లు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Read More...
క్రైమ్ 

గంజాయి రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం: మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్

గంజాయి రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం: మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ మందమర్రి, జూన్ 23 (భారత శక్తి ): యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాలలో భాగంగా సోమవారం మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన పలు కార్యక్రమాలకు మంచిర్యాల జిల్లా డెప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ఏ. భాస్కర్, ఐపీఎస్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో డీసీపీ మాట్లాడుతూ, “విద్యార్థి దశ మీ జీవితానికి అత్యంత కీలకమైన పునాది. ఈ సమయంలో తెలియని ఆకర్షణలకు లోనై గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడితే మీ భవిష్యత్తు అంధకారమయమవుతుంది .ఇది కేవలం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మీ కుటుంబాన్ని, మీ కలలను కూడా నాశనం చేస్తుంది. పోలీసులు మీ శ్రేయోభిలాషులు. ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ చాలా కఠినమైనది, ఒకసారి ఈ కేసులో చిక్కుకుంటే జీవితాంతం దాని పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి, మీరంతా చైతన్యవంతులై, మీ స్నేహితులను కూడా ఈ వ్యసనం వైపు వెళ్లకుండా కాపాడాలి” అనితెలిపారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా, గంజాయి దుష్ప్రభావాలను కళ్ళకు కట్టినట్లు చూపే దృశ్యరూపక వీడియోలను ప్రదర్శించి, వారిలో బలమైన అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక చైతన్యం పెంపొందించుకోవాలి అని తెలిపారు మంచిర్యాల జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు పోలీస్ శాఖ అహర్నిశలు శ్రమిస్తోందని, ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతిరోజూ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని డీసీపీ తెలిపారు. ప్రజల చైతన్యం, సహకారంతోనే గంజాయిని పూర్తిగా నిర్మూలించగలమని, తద్వారా నేరరహిత సమాజాన్ని స్థాపించగలమని ఆయన గట్టిగా విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ శశిధర్ రెడ్డి, మందమర్రి తహసిల్దార్ శ్రీ సతీష్ కుమార్, మందమర్రి ఎంపీడీవో, కస్తూర్బా స్కూల్స్ జిల్లా కోఆర్డినేటర్, కస్తూర్బా, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్, మందమర్రి ఎస్సై శ్రీ రాజశేఖర్, అదనపు ఎస్ఐ శ్రీ శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
Read More...
క్రైమ్ 

మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో భాగంగా గీతంలో మొక్కలు నాటిన డీఎస్పీ, సీఐ

మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో భాగంగా గీతంలో మొక్కలు నాటిన డీఎస్పీ, సీఐ పటాన్‌చెరు, జూన్ 23 (భారత శక్తి): పర్యావరణ స్పృహను పెంపొందించడంతో పాటు మాదకద్రవ్యాల దుర్వినియోగ ప్రమాదాల గురించి అవగాహన పెంచడంలో భాగంగా పటాన్ చెరు పోలీసు విభాగం సోమవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. డీఎస్పీ ఎస్. ప్రభాకర్, పటాన్ చెరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ వినాయకరెడ్డిల నేతృత్వంలో, దాదాపు 30 మంది పోలీసు సిబ్బంది గీతం ప్రాంగణంలో మొక్కలు నాటారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత సమాజాన్ని సూచిస్తూ రాష్ట్ర హరితీకరణకు దోహదపడటం లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ, మాదకద్రవ్య దుర్వినియోగం యొక్క తీవ్రమైన పరిణామాలను ప్రస్తావిస్తూ, మాదకద్రవ్య, సైకోట్రోపిక్ పదార్థాల హానికరమైన ప్రభావాలను వివరించారు. విద్యార్థులు, యువత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా ఉండాలని, మాదకద్రవ్య రహిత దేశాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉంటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గీతం నాయకత్వం కూడా చురుకుగా పాల్గొంది. గీతం, హైదరాబాదు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఈఈసీఈ విభాగం అధ్యాపకులు ప్రొఫెసర్ కె.మంజునాథాచారి, ప్రొఫెసర్ పి.త్రినాథరావు; ఎస్టేట్ అధికారి డీవీఏ మోహన్ తదితరులు ఉన్నారు. పర్యావరణ, సామాజిక సమస్యలను పరిష్కరించడంలో చట్ట అమలు సంస్థలు, విద్యా సంస్థలు, సమాజం మధ్య భాగస్వామ్య బాధ్యతగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
Read More...
క్రైమ్ 

భాకరాపేట అటవీ ప్రాంతంలో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

భాకరాపేట అటవీ ప్రాంతంలో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు తిరుపతి, భారత శక్తి ప్రతినిధి, జూన్ 23: భాకరాపేట-కళ్యాణీ అటవీ ప్రాంతంలో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి, ఆరు ఎర్రచందనం దుంగలతో పాటు, ఒక మోటారు సైకిల్ ను టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి ప్రత్యేక కార్యాచరణలో భాగంగా, టాస్క్ ఫోర్సు ఎస్పీశ్రీ, పీ.శ్రీనివాస్ గారి అధ్వర్యంలో డీఎస్పీ శ్రీ జె. బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఏఆర్ఎస్ఐ కే.మహేశ్వరనాయుడు టీమ్ శనివారం రాత్రి స్థానిక ఎఫ్బీఓ సి.రవితో కలసి నాగపట్ల ఫారెస్టు బీటు పరిధిలో కూంబింగ్ చేపట్టారు. ఆదివారం ఉదయం భాకరాపేట-కళ్యాణీ అటవీ మార్గంలో ఒక మోటారు సైకిల్ తో పాటు, ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వీరిని సమీపించడంతో పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే వారిని పట్టుకుని చుట్టుపక్కల పరిశీలించగా, ఆరు ఎర్రచందనం దుంగలు లభించాయి వారిలో ఒకరు నెల్లూరు జిల్లా, మరొకరు తమిళనాడుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారిని దుంగలతో సహా తిరుపతిలోని టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో అప్పగించారు.
Read More...
క్రైమ్ 

ప్రైవేట్ పైనాన్స్‌ రికవరీ ఏజెంట్ల దాష్టీకం.. అవ్వా తాతలను గెంటేసి.. ఇంటికి తాళం

ప్రైవేట్ పైనాన్స్‌ రికవరీ ఏజెంట్ల దాష్టీకం.. అవ్వా తాతలను గెంటేసి.. ఇంటికి తాళం సింగరాయకొండ, భారత శక్తి ప్రతినిధి, జూన్ 23: అవసరం ఉన్నా, లేకున్నా రుణం ఇస్తామంటూ ప్రైవేట్ ఫైనాన్స్‌ కంపెనీ ఏజెంట్లు వెంటపడతారు. ఎలాంటి పత్రాలు లేకున్నా వెంటనే నిమిషాల్లో రుణం మంజూరు చేసేస్తారు. షూరిటీలు లేకున్నా పర్వాలేదంటారు. తీరా రుణం తీసుకున్న తరువాత ఒక నెల వాయిదా లేటయినా వెంటనే ఇంటి మీద పడిపోతారు. నలుగురిలో పరువు తీసేస్తారు. నానా దుర్భాషలాడుతూ దౌర్జన్యాలకు దిగుతారు. ఇటీవల కాలంలో ప్రైవేటు ఫైనాన్స్‌ రికవరీ ఏజెంట్ల బెదిరింపులకు తట్టుకోలేక కొంతమంది బాధితులు ఆత్మహత్యలు కూడా చేసుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. సాధారణ బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాలంటే సవాలక్ష సవాళ్ళు ఎదురవుతుండటంతో ఈజీగా డబ్బులు ఇచ్చే ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీల బారిన పడి రుణగ్రహీతలు ఇళ్ళు, ఒళ్ళు గుల్లచేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామంలోని ఎస్‌టి కాలనీలో ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీ రికవరీ ఏజెంట్లు దౌర్జన్యానికి దిగారు. అప్పు కట్టలేదన్న సాకుతో ఇంట్లోని వారందర్నీ బయటకు పంపి ఇంటికి తాళం వేశారు. ఫైవ్ స్టార్ ప్రైవేట్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ల నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. బింగినపల్లి ఎస్‌టి కాలనీలో ఉంటున్న పొట్లూరి వెంకటరాజా కుటుంబ అవసరాల నిమిత్తం ఫైవ్ స్టార్ ఫైనాన్స్ దగ్గర ఇల్లు తాకట్టు పెట్టి, 2.50 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. ఫైనాన్స్ వాళ్లకు నెలనెలా డబ్బులు జమ చేస్తూ వచ్చాడు. అయితే తీసుకున్న రూ. 2.50 లక్షల్లో 1.70 లక్షల రూపాయలు మాత్రమే కట్టారంటూ ఫైనాన్స్‌ కంపెనీ రికవరీ ఏజెంట్లు గత కొన్ని రోజులుగా వెంకటరాజా వెంటపడుతున్నారు. నెలనెలా వాయిదాల పద్ధతిలో డబ్బులు కట్టుకుంటూ వస్తున్న సమయంలో తలెత్తిన ఆర్ధిక ఇబ్బందుల కారణంగా కొంత జాప్యం జరిగిందని, త్వరలోనే తీర్చేస్తానని వెంకటరాజా వేడుకున్నాడు. అయితే రికవరీ ఏజెంట్లు వెంకటరాజా మాటలను వినకుండా దౌర్జన్యానికి దిగారు. ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులను బయటకు పంపించి ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయారు. మధ్య ఆర్థిక ఇబ్బందుల వలన ఒక్క నెల డబ్బులు కట్టలేదని ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు ఇంటికి తాళం వేయడం అన్యాయమంటూ వెంకటరాజా తల్లిదండ్రులు పొట్లూరి వెంకటేశ్వర్లు, వెంకాయమ్మ వృద్ధ దంపతులు వాపోతున్నారు. ఇంటికి తాళం వేయడంతో దిక్కుతోచని స్థితిలో ఇంటి ముందు కూర్చుని రోదిస్తున్నారు. కుమారుడు హైదరాబాద్‌లో బేల్దారు పని చేసుకుంటూ.. డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. ఒక్క నెల డబ్బులు పంపించలేక పోయారేసరికి ఫైవ్‌స్టార్‌ కంపెనీ రికవరీ ఏజెంట్లు బలవంతంగా ఇంట్లో నుంచి బయటికి నెట్టేసి ఇబ్బందులకు గురి చేశారని గోడు వెళ్ళబోసుకున్నారు. ఇంటికి తాళం వేశారని, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు.
Read More...
క్రైమ్ 

11 లక్షల విలువ గల 8 తులాల బంగారం,250 గ్రా.వెండి, 2.20 లక్షల విలువ గల బైక్, 60 వేల విలువ గల మూడు సెల్ ఫోన్స్ సీజ్

11 లక్షల విలువ గల 8 తులాల బంగారం,250 గ్రా.వెండి, 2.20 లక్షల విలువ గల బైక్, 60 వేల విలువ గల మూడు సెల్ ఫోన్స్ సీజ్ సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూన్ 19: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడుతూ కోదాడ పట్టణంలో 11 లక్షల విలువ గల 8 తులాల బంగారం,250 గ్రా.వెండి, 2.20 లక్షల విలువ గల బైక్, 60 వేల విలువ గల మూడు సెల్ ఫోన్స్ సీజ్ చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు కోదాడ పట్టణంలో 4 కేసులు, మునగాల 1 కేసు, నల్గొండ జిల్లాలో నిడమానూరు పోలీస్ స్టేషన్ నందు కేసు, వేములపల్లి పి ఎస్ 1 కేసు డిటెక్ట్ చేసి స్వాదినం చేసుకోవడం జరిగినదన్నారు.కోదాడ పట్టణంలో దొంగతనం కేసులో వచ్చిన నగదుతో ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన ఏ1 ఫణి చెంద్ పై ఉమ్మడి జిల్లాలో 17 దొంగతనం కేసులు ఉన్నాయని వెల్లడించారు. నిందితుల వివరాలు -ఏ1 ఇటికాల ఫణి చంద్, వయస్సు 19 సం.లు, కూలి పని, నివాసం: హుజూర్ నగర్, ప్రస్తుతం కోదాడ టౌన్.ఏ2 చేకూరి నాగేంద్రబాబు 25 సంవత్సరాలు వృత్తి ఎలక్ట్రిషన్ నివాసము కోదాడ టౌన్. ఏ3 మరియు ఏ4 మైనర్ లుఐనందున పేర్లు వెల్లడించలేదురాత్రిపూట తాళం వేసి ఉన్న ఇండ్లని టార్గెట్ చేసి ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి విలువైన బంగారు వెండి ఆభరణములు దొంగలించుకు వెళ్తూ, ఒంటరిగా ఉన్న వృద్ధులను, ఒంటరిగా వాహనంపై ప్రయాణిస్తున్న మహిళలను టార్గెట్ చేసి మహిళలపై గల బంగారు ఆభరణాలు లాక్కొని చైన్ స్నాచింగ్ చేస్తున్నారు. గత నెలలో కోదాడ పట్టణంలో ఒంటరిగా ఉన్న మహిళ వద్ద చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. అలాగే మునగాల పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు, కోదాడ ఇన్స్పెక్టర్, మునగాల ఇన్స్పెక్టర్ అధ్వర్యంలో కేసులు దర్యాప్తు చేసినారు. ఇవి రెండు కూడా ఖరీదైన కెటిఎమ్ బైక్ పై చేసినట్లు గుర్తించామన్నారు. పోలీసు ప్రయత్నాలు చేస్తుండగా నమ్మదగిన సమాచారం పై కోదాడ, హుజూర్ నగర్ పట్టణాలకు చెందిన 4 గురు నిందితులను కోదాడ లో కోదాడ పట్టణ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకోవడం జరిగినది. వారిని విచారించగా దొంగతనాలకు పాల్పడుతునట్లు ఒప్పుకున్నారు. ఇందులో ఇద్దరు మైనర్ బాలురు ఉండడంతో జూవెనల్ కోర్టుకు హాజరు పరుస్తామన్నారు ఈ కార్యక్రమంలో కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ శివ శంకర్, ఏఎస్ఐ హానుమ నాయక్, పోలీసు సిబ్బంది. కేసు చేదనలో బాగా పని చేసిన సిబ్బందిని ఎస్పి అభినందించి రివార్డ్ లు అందించారు.
Read More...