వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఏ ఐ ఎస్ ఎఫ్ , పి డి ఎస్ యు,ఏ ఐ వై ఎఫ్,

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మలక్పేట్:

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల  ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త బందు పిలుపులో భాగంగా జూలై 10న హైదరాబాద్ జిల్లా మలక్పేట్ నియోజకవర్గ  కేంద్రంలోని ప్రభుత్వ,  ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతంగా సాగిందని _ఏ ఐ ఎస్ ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు అనిల్ కుమార్,చైతన్య యాదవ్ , పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి నవీన్ ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు, నెర్లకంటి శ్రీకాంత్ బాలకృష్ణ  తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధానాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఎంఈఓలు, డీఈఓలు, లెక్చరర్లు తదితర విద్యాశాఖ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యకు తగిన నిధులు కేటాయించి, మధ్యాహ్న భోజన పథకాన్ని స్థానిక మహిళా సంఘాల ద్వారా సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజులను నియంత్రించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. విద్యార్థుల హక్కులను కాపాడే చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ఈ బంద్ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొంటూ, మలక్పేట్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ, మరియు ప్రైవేట్ పాఠశాలలు , కళాశాలాలు  బంద్‌ విజయవంతం జరిగింది.  విద్యార్థులకు తల్లిదండ్రులకు వామపక్ష విద్యార్థి సంఘాలు _ఏ ఐ ఎస్ ఎఫ్, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో _ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జోసెఫ్ భాను ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్ జిల్లా నాయకులు సుమన్ (ఓ యు ) రామ్ చరణ్,కరుణాకర్,కిషోర్, నాగరాజు పి డి ఎస్ యు ,, తదితరులు పాల్గొన్నారు

About The Author