బడంగ్‌పేట్‌లో వైభవంగా జగన్నాథ రథయాత్ర
శ్రీ సాయి బాలాజీ ఫేస్-2 కమ్యూనిటీ హాల్‌లో ఆధ్యాత్మిక శోభ
*బడంగ్‌పేట్:
మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ పరిధిలో గల బడంగ్‌పేట్ శ్రీ సాయి బాలాజీ ఫేస్-2 కమ్యూనిటీ హాల్‌లో జగన్నాథ రథయాత్ర వైభవంగా ప్రారంభమైంది. శ్రీశ్రీ చైతన్య నితాయ్ జగన్నాథ్ మందిర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొని రథయాత్రను ప్రారంభించారు.
*కోలాహలంగా సాగిన రథోత్సవం
సాయి బాలాజీ కాలనీ నుండి ప్రారంభమైన ఈ రథయాత్ర గాయత్రి హిల్స్, బడంగ్‌పేట్ - బాలాపూర్ మెయిన్ రోడ్డు, శ్రీ విద్యా టౌన్ షిప్ మీదుగా సాయి బాలాజీ ఫేస్-1 వరకు సాగింది. భక్తుల కోలాహలం, హరినామ స్మరణల మధ్య రథం ముందుకు కదిలింది.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో శ్లోక ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ జైపాల్ రెడ్డి, ఆధ్యాత్మిక గురువు చంద్ర దాస్ సహా స్థానిక కాలనీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్నాథుని రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడటంతో బడంగ్‌పేట్ పరిసర ప్రాంతాలు భక్తి శ్రద్ధలతో మురిసిపోయాయి.
About The Author
17 Jul 2026
