బాధితురాలికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్:
గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని తిరుమల నగర్ నందు నివాసం ఉండే మంజుల వెన్నుముక సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో వారి యొక్క కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని సంప్రదించారు. వెంటనే స్పందించిన సుధీర్ రెడ్డి వారి చికిత్సకు అవసరమైన వివరాలను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా దరఖాస్తు చేయించారు. దానికి గాను రూ.2 లక్షల ఎల్.ఓ.సీ. (LOC) మంజూరు కాగా, ఆ చెక్కును బాధితురాలు అన్న రాజుకి అందజేశారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజలకు సేవ చేయడం తమకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక మంది పేద కుటుంబాలకు సహాయం చేసే అవకాశం లభించిందన్నారు.అనంతరం బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమ అక్క ఆరోగ్య సమస్య విషయంలో సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని సహాయం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మా అక్క చికిత్స కోసం చెక్కు అందించడంలో ఆయన చూపిన మద్దతు జీవితాంతం మరువలేమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, ముద్ద కళ్యాణ్,ప్రదీప్, యాద శంకర్ తదితరులు పాల్గొన్నారు.
