నిరుద్యోగులపై పోలీసుల లాఠీ చార్జీ

సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

నిరుద్యోగులపై పోలీసుల లాఠీ చార్జీ

ఎల్బీనగర్:

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 వేల పోలీస్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, "5000 వద్దు – 19000 ముద్దు" అనే నినాదంతో దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగ యువత భారీ మహాధర్నా నిర్వహించారు.రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లను శాంతియుతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా నిరుద్యోగులపై లాఠీచార్జీ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును గౌరవించాలని, ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నాలు మానుకుని నిరుద్యోగ యువత సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, కిరణ్ నిరుద్యోగులను అరెస్టు చేసిన నాగోల్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి వారికీ సంఘీభావం ప్రకటించి మద్దతు తెలపడం పట్ల నిరుద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ పోస్టులతో పాటు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా, వేగవంతంగా భర్తీ చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల జేఏసీ నాయకులు ఇంద్రా నాయక్, ఆకాష్, శంకర్, శింబు కుమార్ నాయక్, సింధూ రెడ్డి, రమేష్, చెర్రీ, ప్రవీణ్ కుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.WhatsApp Image 2026-07-16 at 19.20.08 (1)

About The Author