జిల్లా న్యాయ సేవా సంస్థ చొరవతో బంధిత కార్మికుడి సురక్షిత రక్షణ

జిల్లా న్యాయ సేవా సంస్థ చొరవతో బంధిత కార్మికుడి సురక్షిత రక్షణ

ఎల్బీనగర్:

రంగారెడ్డి  జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ ఎ.కర్ణ కుమార్ మరియు కార్యదర్శి శ్రీమతి జి. అనూష ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రత్యేక రక్షణ చర్యలో బంధిత కార్మికుడు కోట శ్రీనివాస్‌ను సురక్షితంగా రక్షించారు.దివ్య దిశ స్వచ్ఛంద సంస్థ (NGO) అందించిన సమాచారం మేరకు బాధితుడు కోట శ్రీనివాస్ (తండ్రి: కృష్ణారావు) గత నాలుగు సంవత్సరాలుగా కృష్ణ, రాము అనే కాంట్రాక్టర్ల వద్ద బంధిత కార్మికుడిగా పని చేస్తున్నట్లు తెలిపాడు. కుటుంబ అవసరాల నిమిత్తం రూ.1,60,000 అడ్వాన్స్ తీసుకున్న అనంతరం ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు బలవంతంగా పని చేయించడంతో పాటు రోజుకు కేవలం రూ.100 మాత్రమే చెల్లించేవారని వాంగ్మూలంలో పేర్కొన్నాడు. పని చేయడానికి నిరాకరించినా లేదా ప్రశ్నించినా తనపై దాడులు చేయించేవారని తెలిపాడు.అలాగే తన భార్యను మరో సంస్థలో పని చేయించి ఆమెకు రావలసిన వేతనాలను అడ్వాన్స్‌పై వడ్డీగా జమ చేస్తున్నట్లు చూపించేవారని, అప్పుకు సంబంధించిన రికార్డులను ధ్వంసం చేసి మరింత డబ్బు తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ బలవంతంగా పని చేయించారని వివరించాడు. ఇటీవల తనను స్వగ్రామానికి పంపించి, తన భార్యను సుమారు నెల రోజుల పాటు అక్రమంగా నిర్బంధించగా, అనంతరం ఆమెను రక్షించి తిరిగి తీసుకువచ్చినట్లు తెలిపాడు.దివ్య దిశ స్వచ్ఛంద సంస్థ (NGO) అందించిన సమాచారం మేరకు సమాచారం మేరకు హఫీజ్‌పేట్‌ లోని ప్రేమ్‌నగర్‌లో ఉన్న నిర్మాణ స్థలంలో పని చేస్తున్న శ్రీనివాస్‌ను సురక్షితంగా రక్షించి భద్రమైన ప్రదేశానికి తరలించారు. అనంతరం ఆయన భార్య, కుమార్తెను కూడా వారి నివాసానికి తరలించారు.అదేవిధంగా బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.ఈ రక్షణ చర్యలో జిల్లా న్యాయ సేవా సంస్థ, మండల రెవెన్యూ అధికారులు మరియు లేబర్ అధికారులు మరియు కార్మిక శాఖ అధికారులు దివ్య దిశ స్వచ్ఛంద సంస్థ (NGO) పాల్గొన్నారు.

About The Author