ఎల్బీనగర్ చింతలకుంటలో భారీ అక్రమ నిర్మాణం!

  • *నిబంధనలు తుంగలో తొక్కి వాణిజ్య సముదాయం ఏర్పాటు.
  • ఆక్యుపెన్సి సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత మదనపు ఫ్లోర్లు..
  • *రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ బిల్డింగ్.. వంద శాతం డివియేషన్
  • *టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల తీవ్ర ఆగ్రహం

ఎల్బీనగర్ చింతలకుంటలో భారీ అక్రమ నిర్మాణం!

*ఎల్బీనగర్:

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్, పెద్ద అంబర్‌పేట్-నాగోల్ సర్కిల్-11 పరిధిలో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఒక భారీ అక్రమ నిర్మాణం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. చింతలకుంట, ఆగమయ్య నగర్ కాలనీ (ప్లాట్ నంబర్ 54), అకిమబాద్ కాలనీ పరిసరాల్లో ఉన్న 'పండుగ సరస్వతి ఆర్కేడ్' (బచ్పన్ కిడ్స్ వేర్) వాణిజ్య భవన నిర్మాణంలో నిబంధనలను నిలువునా పాతరేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గృహ నిర్మాణ (రెసిడెన్షియల్) అనుమతులు పొంది, నివాస ప్రాంతంలో ఏకంగా భారీ వాణిజ్య (కమర్షియల్) సముదాయాన్ని నిర్మిస్తుండటం గమనార్హం.

*నిబంధనలు శూన్యం.. ప్రమాదాలకు రహదారి!
సదరు నిర్మాణదారుడు మున్సిపల్ చట్టాలను ఏమాత్రం లెక్కచేయకుండా వంద శాతం నిబంధనల ఉల్లంఘనకు (డివియేషన్) పాల్పడినట్లు స్పష్టమవుతోంది.
 *ఇల్లీగల్ సెల్లార్: ఎలాంటి అనుమతులు లేకుండా ప్రమాదకరంగా సెల్లార్ నిర్మించారు.
 సెట్‌బ్యాక్స్ మృగ్యం: భవనం చుట్టూ వదలాల్సిన కనీస స్థలాన్ని (సెట్‌బ్యాక్స్) పూర్తిగా వదిలేశారు.

 *ఫైర్ సేఫ్టీకి తిలోదకాలు: అత్యవసర సమయాల్లో అగ్నిమాపక వాహనాలు తిరిగేందుకు కూడా స్థలం లేకుండా నిర్మించడంతో భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ప్రాణ, ఆస్తి నష్టాలకు బాధ్యులెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అంతేకాకుండా, టౌన్ ప్లానింగ్ విభాగం ఏసీపీ ప్రతాప్, సెక్షన్ ఆఫీసర్ రామచందర్ కళ్ల ముందే ఎలాంటి అదనపు అనుమతులు లేకుండా పై అంతస్తుల నిర్మాణం యథేచ్ఛగా సాగుతుండటంపై స్థానికులు మండిపడుతున్నారు.

*కార్పొరేషన్ ఖజానాకు భారీ గండి
మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే లోటు బడ్జెట్‌తో కొట్టుమిట్టాడుతుండగా, ఇలాంటి అక్రమ కమర్షియల్ నిర్మాణాల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన లక్షలాది రూపాయల పన్నుల ఆదాయానికి భారీగా గండి పడుతోంది. గతంలో ఇలాంటి అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించి, బిల్డింగులను సీజ్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ, ప్రస్తుత అధికారులు మాత్రం ముడుపుల మత్తులో జోగుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

*సామాన్యుడికి ఒక న్యాయం.. బడా బాబులకు ఒక న్యాయమా?
 ఒక సామాన్య, మధ్యతరగతి వ్యక్తి తన వంద గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపల్ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిప్పే అధికారులు, ఇలాంటి భారీ అక్రమ నిర్మాణాలపై ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 'రూపాయి' ఒప్పందాలే దీనికి కారణమా అని బాహాటంగానే విమర్శిస్తున్నారు.WhatsApp Image 2026-07-08 at 19.25.07 (3)

*గతంలో 'విశాల్ మార్ట్' తరహాలోనే కోర్టుల తప్పుదోవ!
ఇదే అక్రమ పద్ధతిలో చింతలకుంట పల్లవి గార్డెన్స్ పక్కన ఉన్న 'విశాల్ మార్ట్' భవన యజమాని కూడా అధికారులను బెదిరిస్తూ అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు నిర్మించిన విషయాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు నోటీసులు ఇస్తే, దానిని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్లి.. అక్కడ తానేదో ‘సోలార్ రూఫ్’ వేసుకుంటున్నానని తప్పుడు అఫిడవిట్ సమర్పించి భవనాన్ని పూర్తి చేశారని, ఇప్పుడు 'పండుగ సరస్వతి ఆర్కేడ్' యాజమాన్యం కూడా అదే దొంగదారిని ఎంచుకుందని ఆరోపిస్తున్నారు.

*ఉన్నతాధికారులు స్పందించాలి: స్థానికుల డిమాండ్
ఈ తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనపై నాగోల్ సర్కిల్ 11 డిప్యూటీ కమిషనర్ నిత్యానంద్,
 ఎల్బీనగర్ జోన్ ఎస్టీఎఫ్ (STF) ఇంచార్జ్, జోనల్ కమిషనర్ మహతో (IAS), అలాగే మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తక్షణమే స్పందించాలని బాధితులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో జరగబోయే భారీ ప్రమాదాలను అరికట్టడానికి, ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడటానికి ఈ అక్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసి, సీజ్ చేయాలని స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవస్థలో నిజాయితీపరులు బతకాలంటే ఇలాంటి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్థానిక కాలనీవాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు.WhatsApp Image 2026-07-08 at 19.25.26

About The Author